For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

|

ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్‌ జాబ్‌ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాల సమయం వారు ఒకే చోట కూర్చొని వుండటం కూడాను.

READ MORE: ఆక్యుప్రెజర్(acupressure)వల్ల కలిగే ప్రయోజనాలు

మరి ఈ నొప్పులకు మీరు పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్ల వేసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్‌ ఉత్తమం అని చెప్పవచ్చు. మసాజ్‌ చేస్తే ఎటువంటి శారీరక నొప్పి అయినప్పటికీ తగ్గిపోతుంది. మస్త మానవాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వర ఉపసమనాన్ని ఇచ్చేదిగా... సమర్ధవంతమైన చికిత్సా ప్రక్రియగా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం.

READ MORE: స్తనాల సైజును పెంచే మసాజ్ టిప్స్..!

బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు. బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

READ MORE: బాడీ మసాజ్ కు ఉపయోగించే 10 బెస్ట్ ఆయిల్స్

బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ నొప్పులను తగ్గిస్తుంది మరయు మనస్సు ప్రశాతం పరుస్తుంది:

మసాజ్ నొప్పులను తగ్గిస్తుంది మరయు మనస్సు ప్రశాతం పరుస్తుంది:

బాడీ మసార్ వల్ల వంటినొప్పులు నివారించబడుతాయి మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. మరియు ఇది మూడ్ ను ప్రశాంత పరుస్తుంది . శరీరంలో ఎండోర్ఫిన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్స్ విశ్రాంతి పొందడానికి మరియు పెయిన్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

మజిల్స్ మరియు జాయింట్స్ రిలాక్స్ అవుతాయి:

మజిల్స్ మరియు జాయింట్స్ రిలాక్స్ అవుతాయి:

బాడీ మసాజ్ వల్ల కండరాలు మరియు జాయింట్స్ ఫ్లెక్సిబుల్ గా మారుతుంది . ఇది మజిల్ క్రాంప్ నివారిస్తుంది మరియు మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. కండరాల పట్టివేతను అరికడుతుంది.

స్కార్స్ ను తొలగిస్తుంది:

స్కార్స్ ను తొలగిస్తుంది:

బాడీ మసాజ్ వల్ల చర్మంలో ఏర్పడ్డ స్కార్స్ తొలగింపబడుతుంది. ముఖ్యంగా సర్జరీలు మరియు గాయాల వల్ల ఏర్పడ్డ కుట్ల యొక్క చారలను నివారించడంలో మసాజ్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది.

మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది:

మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది:

మసాజ్ థెరఫీ వల్ల మరో ప్రయోజనం మైగ్రేన్ తలనొప్పి, జాయింట్ పెయిన్ మరియు క్యాన్సర్ నివారిస్తుంది . రక్తప్రసరణను పెంచుతుంది మరియు నొప్పిని మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

డిటాక్సిఫికేషన్:

డిటాక్సిఫికేషన్:

బాడీ మసాజ్ వల్ల శరీరంలో టాక్సిన్ ను తొలగింపబడుతుంది . దాంతో శరీరంలో ఆక్సిజన్ ఎక్కువగా ప్రసరిస్తుంది. ఇది శరీరంను శుభ్రం చేసి, క్యాన్సర్ ను నివారిస్తుంది.

వ్యాయామం వల్ల తగిలే గాయాలను మాన్పుతుంది:

వ్యాయామం వల్ల తగిలే గాయాలను మాన్పుతుంది:

బాడీ మసాజ్ వల్ల కండరాలు పట్టివేత లేదా చిన్న చిన్న గాయాలను మాన్పడంలో సహాయపడుతుంది .

త్వరగా ఉపశమనం కలిగిస్తుంది:

త్వరగా ఉపశమనం కలిగిస్తుంది:

మసాజ్ వల్ల గాయాలు త్వరగా మాన్పుకోవచ్చు . రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . అధిక న్యూట్రీషియన్స్ సప్లై చేస్తుంది . దాంతో గాయాలు త్వరగా మానుతాయి.

 రక్తప్రసరణ మెరుగుపడుతుంది:

రక్తప్రసరణ మెరుగుపడుతుంది:

బాడీ మసాజ్ వల్ల రక్తకణాలు రక్త ప్రసరణ పెరుగుతుంది . దాంతో పాటు ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ కూడా సప్లై అవుతాయి . ఇది మిమ్మల్ని యాక్టివ్ గా మార్చుతుంది.

ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది:

ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది:

బాడీ మసాజ్ వల్ల మంచి మూడ్ ఉంటుంది. ఇది ఆందోళనను మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది. బాడీ మసాజ్ వల్ల శ్వాస మెరుగుపరడుతుంది మరియు మనస్సుకుదట పడుతుంది.

Story first published: Friday, July 10, 2015, 18:27 [IST]
Desktop Bottom Promotion