For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంటాక్ట్ లెన్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు

|

కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి కూల్ గా ఉంటాయి...కానీ....కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయం మీకెవరికైనా తెలుసా లేదా ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల దుష్పభావాలు కూడా ఉన్నాయి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ రిస్క్ లను వెంటనే నివారించుకోవచ్చు.

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్ వాడకం ఎక్కువగా ఉన్నది. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, అందంగా కనబడటానికి కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరిగినది. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యవంతంగా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల వీటి వాడకం ఎక్కువైనది. అయితే కొంత మంది మాత్రం ఫ్యాషన్ కోసం ధరించే వారు కూడా ఉన్నారు.

కొంత మంది మాత్రం వివిధ కారణాల కారణాల వల్ల గ్లాస్ లేదా అద్దాలు ధరించడానికి ఇష్టపడరు. ఆ కారణాలు పక్కనపెట్టి, మీరు కనుక కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నట్లైతే వాటిని రెగ్యులర్ గా సరిగా శుభ్రం చేస్తుండాలి. సరిగా శుభ్రం చేయకపోతే అవి కళ్ళఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది

READ MORE:కంటి అద్దాల వల్ల ఏర్పడ్డ మచ్చల నివారణకు పరిష్కారం...!

కాంటాక్ట్స్ లెన్స్ ఎక్కువ రోజులు ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తుల తీసుకొన మెయింటైన్ చేయాలి. మరి కాంటాక్ట్ లెన్స్ ను తరచూ ఉపయోగించడం వల్ల కొన్ని ఆరోగ్య దుష్ప్రభాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వార తెలుసుకుందాం...

సమయం:

సమయం:

ఎక్కువ కాలం కాంటాక్ట్స్ లెన్స్ ధరిచడం వల్ల కళ్ళలోని కార్నియా దెబ్బతింటుందని కొందరు నిపుణుల అభిప్రాయం . కాంటాక్ట్ లెన్స్ వల్ల ఇది ఒక దుష్ప్రభావం.

కళ్ళ ఇన్ఫెక్షన్:

కళ్ళ ఇన్ఫెక్షన్:

కాంటాక్ట్ లెన్స్ అమర్చుకొనేప్పుడు, చేతి వేళ్ళను ఉపయోగించడం వల్ల, చేతులు శుభ్రంగా లేకపోతే త్వరగా కళ్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాధం ఉంది.

స్మోకర్స్:

స్మోకర్స్:

స్మోకింగ్ చేసే వారు కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడం వల్ల కార్నియల్ అల్సర్ తో బాధపడుతారని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది.

దుమ్ము రేణువులు:

దుమ్ము రేణువులు:

దుమ్ము , ధూలి కాంటాక్ట్ లెన్స్ లో చేరడం వల్ల కళ్ళు అసౌకర్యానికి గురి అవ్వడం మాత్రమే కాదు కళ్ళ నుండి నీరు ఎక్కువగా కారీ, పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది.జ

 డ్రై ఐస్:

డ్రై ఐస్:

కొంత మందిలో కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల కళ్ళ పొడి బారడం జరుగుతుంది. కాంటాక్ట్స్ కళ్ళను కవర్ చేయడం వల్ల కళ్ళకు ఆక్సిజన్ సరఫరా బ్లాక్ అవుతుంది . ఆ కారణం వల్ల కళ్ళ పొడిబారడం జరుగుతుంది.

పూల్స్:

పూల్స్:

స్విమ్మింగ్ చేసేవారు, పూల్లో స్విమ్ చేయడానికి ముందు కాంటాక్ట్స్ లెన్స్ ను తొలగించడం మంచిది.

English summary

Health Risks Of Contact Lenses

Contact lenses are cool....but wait; have you heard of the health risks of contact lenses? Well, those who prefer contact lenses must also take the necessary care in order to avoid certain health risks.
Story first published: Wednesday, June 3, 2015, 18:29 [IST]
Desktop Bottom Promotion