For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ వెజిటబుల్సే..! కానీ తినడానికి నో చెబుతున్నాం..

By Nutheti
|

మనం ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు ఒక భాగం. చాలా ముఖ్యం కూడా. ఇంతకుముందు.. సీజన్ బట్టి కొన్ని రకాల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆయా కాలానికి బట్టి లభించే వెజిటబుల్స్ మాత్రమే మనం తీసుకోవడానికి వీలుండేది. సీజన్ అయిపోయిన తర్వాత అవి లభించవి కాదు.

అలా సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే లభించేవి కాబట్టి వాటి విలువ తెలిసేది.. మళ్లీ దొరకదే ఉద్ధేశ్యంతో.. ఎక్కువగా తీసుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం సీజనల్ అన్న మాటే వినిపించదు. ఎందుకంటే.. సీజన్ తో పనిలేకుండా.. ఏడాది మొత్తం కూరగాయలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.

READ MORE: చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ వెజిటేబుల్స్

లైఫ్ స్టైల్ లో మార్పులు వచ్చాయి. దీనివల్ల ఏడాదంతా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏదో ఒకసారి చేసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం ఎక్కువవుతోంది. అలాగే.. వండటానికి ఈజీగా ఉన్న కూరగాయలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే కట్ చేయడానికి, వండటానికి సులభంగా ఉన్నవాటినే ఎక్కువగా వాడుతున్నాం. దీంతో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు చేకూర్చే వెజిటబుల్స్ ని దూరం పెడుతున్నాం. అలా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న ఎలాంటి కూరగాయలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఒక్కసారి చూద్దాం..

గుమ్మడి

గుమ్మడి

గుమ్మడిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కానీ.. దీన్ని ప్రస్తుత జనరేషన్ అసలు వాడటమే లేదు. ఇది కట్ చేయడం, వండటం సమయంతో కూడుకున్నది కావడంతో.. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు.

చిక్కుడు

చిక్కుడు

చిక్కుడు వంటి కూరగాయలన్నీ ఈ మధ్య పాపులారిటీకి దూరమవుతున్నాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలియక వీటిని తీసుకోవడం లేదు. చాలామంది వీటిని కట్ చేసే ఓపిక లేక లైట్ తీసుకుంటున్నారు.

క్యాలీఫ్లవర్ ఆకులు

క్యాలీఫ్లవర్ ఆకులు

క్యాలీఫ్లవర్ గురించి అందరికీ తెలుసు. మరి ఆకుల గురించి ? చాలా హెల్తీ ఫుడ్ ఇది. కానీ.. అందరూ దీనిగురించి పట్టించుకోరు. చాలా కూరగాయల్లో ఆకులను వదిలేసి వాటిని మాత్రం ఉపయోగించుకుంటాం. కానీ.. కాలీ ఫ్లవర్ ఆకుల్లో క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

సొరకాయ

సొరకాయ

సొరకాయ చూడటానికి మరి అంత అందంగా ఉండకపోయినా.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగుంటుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఇది చాలా రకాలు ప్రిపేర్ చేయవచ్చు. కానీ చాలామంది దీన్ని వాడటానికి ఇష్టపడరు.

టర్నిప్

టర్నిప్

టర్నిప్ అనే వెజిటబుల్ ముళ్లంగి రకానికి చెందినది. వైట్ కలర్ లో ఉండే బెరడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషంట్స్ కి బాగా సహాయపడుతుంది.

క్యాబేజ్

క్యాబేజ్

క్యాబేజీ కూడా అంతే.. చాలా మంది ఇష్టపడరు. ఎప్పుడు చేసినా.. దాన్ని తినకుండా అవైడ్ చేస్తుంటారు. కానీ క్యాబేజ్ లో విటమిన్ కె, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇకపై క్యాబేజ్ అంటే వద్దు అనకండి.

కాకరకాయ

కాకరకాయ

కాకరకాయ చూడగానే చాలామంది చిరాకు పడుతుంటారు. ఇది చేదుగా ఉంటుందని.. పిల్లలు, కొంతమంది పెద్దవాళ్లు తినడానికి ఇష్టపడరు. కానీ.. ఇందులో అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు ఇది చాలా మంది. అలాగే నాలుకలో టేస్టింగ్ బడ్స్ యాక్టివ్ గా ఉండటానికి ఇవి సహాయపడతాయి.

English summary

Healthy Veggies That You Are Avoiding

Vegetables are and should always be an integral part of our everyday meal. In the past, there were days when seasonal vegetables meant something and a number of them would only be available at a particular time of the year.
Desktop Bottom Promotion