For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారించే 20 ఉత్తమ హోం రెమెడీస్

|

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.

మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రా శయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వస్తాయి. మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్‌ ఫెక్షన్‌ సోకడం, చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్‌, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కారణాల వలన వీటికి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.

అలాగే గర్భాశయంనుంచి మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడం వలన కూడా అవి దెబ్బతింటాయి. ఇతర కారణాలలో మూత్రం వెలుపలికి వెళ్లవలసిన దారిలో రాళ్ల వలన కానీ, ఇతరత్రా కాని అడ్డంకులు ఏర్పడటం వలన వచ్చే ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తులకు టిబి సోకడం వలన మూత్ర పిండాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలున్నాయి. ఇవేకాక పుట్టుకతో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వలన కూడా మూత్రపిండాలకు వ్యాధులు సోకడానికి కారణమవుతున్నాయి. మూత్రవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్‌ సోకడం మహిళలలో, చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా కనిపి స్తుంది. చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల వలన మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. మహిళల్లో రజస్వల సమయంలోనూ, ప్రసూతి సమయంలోనూ ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంది.

లక్షణాలు : మూత్ర వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్స్‌ సోకడం వలన తొలిదశలో రోగి తలనొప్పితో బాధపడటం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటాడు. దీనితోపాటు కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి కడుపు మధ్యభాగంనుండి కిందికి తొడ వరకూ పాకుతుంది. దీనితోపాటు జ్వరం ఉంటుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం, మూత్రంలో మంట ఉంటాయి. కాళ్ళు, పాదాలు, చేతులు, మడమలు వాపు, అలసట, తరచూ మూత్రవిసర్జన లక్షనాలు కలిగి ఉంటారు. అంతే కాదు, మీరు డయాబెటిస్ మరియు హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాల గమనించాలి. పైలక్షణాల్లో ఏఒక్క లక్షణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి.

కిడ్నీ ఇన్ఫెక్షన్ నేచురల్ గా ఎలా నివారించాలి? కిడ్నీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను boldsky.com పరిచయం చేస్తున్నది. వాటిని గమనించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి...

1. క్రాన్ బెర్రీ:

1. క్రాన్ బెర్రీ:

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో క్రాన్ బెర్రీ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. క్రాన్ బెర్రీ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఒక ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. కాబట్టి, స్వచ్చమైన జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

2. జునిపర్ బెర్రీస్:

2. జునిపర్ బెర్రీస్:

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారణకు మరో బెస్ట్ హోం రెమెడీ. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సార్లు యూరిన్ పాస్ అయ్యే విధంగా చేస్తుంది. మరియు కిడ్నీలో ఉండే టాక్సిన్స్ (వ్యర్థాలు)మూత్రం ద్వారా బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది.

3.బర్డక్ రూట్:

3.బర్డక్ రూట్:

ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది మరియు కిడ్నీయొక్క టాక్సిన్ లెవల్స్ ను క్లియర్ చేస్తుంది మరియు మూత్రం ఎక్కువసార్లు పోయేందుకు సహాయపడి, వ్యర్థాలను కిడ్నీ నుండి త్వరగా నెట్టే వేసేలా చేస్తుంది.

4.ఆల్ఫాల్ఫా:

4.ఆల్ఫాల్ఫా:

ఆల్ఫాల్ఫా కిడ్నీ యొక్క క్రియను వేగవంతం చేస్తుంది, చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ మరియు బ్యాక్టీరియా తొలగిపోయేలా చేస్తుంది.

5. రోజ్ హిప్:

5. రోజ్ హిప్:

ఇది కేవలం యాంటీబయోటిక్స్ లా పనిచేస్తుంది కాబట్టి, కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. దీన్ని ఒక యాంటీబయోటిక్ లా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

6. పసుపు:

6. పసుపు:

కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ప్రొటెక్టివ్ హోం రెమెడీ. ఇది రికవరీ ప్రొసెస్ ను వేగవంతంగా చేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే కంటెంట్ లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ఏజెంట్ కిడ్నీకి హానికలిగించే మైక్రోబ్స్ పెరగకుండా మరియు కిడ్నీ మొత్తం వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది.

7. అల్లం:

7. అల్లం:

అల్లం బాగా ప్రసిద్ది చెందిన హోం రెమెడీ. ఎందుకంటే దీనిలో వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కు ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ . అల్లంలో ఉండే జింజరోల్ అనే యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ కిడ్నీలో వ్యాప్తి చెందే బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. కాబట్టి, మీరు అల్లం టీని రెగ్యులర్ గా ఉపయోగించండి.

8. వెల్లుల్లి:

8. వెల్లుల్లి:

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే మరో ఉత్తమ హోం రెమెడీ . ఇది ఒక ఘాటైన వాసన కలిగిన నేచురల్ రెమడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫమేటరీ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను అతి కొద్దిరోజుల్లోనే నివారిస్తుంది .

9. ప్రొబయోటిక్స్ :

9. ప్రొబయోటిక్స్ :

పెరుగులో మంచి బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఈ మైక్రో ఆర్గానిజం మొత్తం ఆరోగ్యంను మరియు డైజెస్టివ్ హెల్త్ ను మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనబడినది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కిడ్నీ నుండి వేస్ట్ మెటీరియల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది.

10. పార్ల్సే జ్యూస్:

10. పార్ల్సే జ్యూస్:

కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ మరియు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ . ఈ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, సి, పొటాషియం, సోడియం, కాపర్, థైమిన్, మరియు రిబోఫ్లొవిన్ వంటి న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి.నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి, చల్లారిన తర్వాత త్రాగాలి.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

తేనె మరియు యాపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని విడివిడిగా ఉపయోగించడం కంటే రెండు కలిపి ఉపయోగించడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి.

హేర్బల్ టీ:

హేర్బల్ టీ:

మీ శరీరానికి హేర్బల్ టీ ఏదైనా సరే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చమోమిలీ, మార్షమల్లో టీ, పార్ల్సే టీ లేదా గోల్డెన్ రోడ్ టీ వంటి హేర్బల్ టీలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇలాంటి టీలలో ఏదో ఒకటి రోజుకు రెండు సార్లు త్రాగాలి.

అలోవెరా:

అలోవెరా:

అలోవెరా ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది శరీరంలో ప్రతి ఒక్క అవయావానికి సహాయపడుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు అలోవెరాను క్రమంగా తీసుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది . మన శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మంచి ఫలితాలను పొందడానికి అలోవెరాను ప్రతి రోజూ తీసుకోవాలి.

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి చాలా ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన నేచురల్ ఫుడ్స్ వీటిలో ఉండే అసిడిక్ లెవల్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బ్యాక్టీరియా అభివ్రుద్ది చెందకుండా నివారిస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బేకింగ్ సోడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీలోని బైకార్బొనేట్ లెవల్సను నిండుగా నింపడానికి సహాయపడుతుంది. ఇది ఒక ఉత్తమ హోం రెమెడీగా సహాయపడుతుంది. ఒక చెంచా బేకింగ్ సోడాను వాటర్ లో వేసి కరిగిన తర్వాత త్రాగాలి.

 స్వచ్చమైన ఆలివ్ నూనె:

స్వచ్చమైన ఆలివ్ నూనె:

స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ను చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. ఇది ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్. ఇది మంచి ఫ్లేవర్ మరియు ఎసిడిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ లూబ్రికేట్స్ కు సహాయపడుతుంది మరియు కిడ్నీ, లివర్ మరియు గాల్ బ్లాడర్ లోని టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది.నిమ్మరసంతో పాటు తీసుకుంటే చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు లెమన్ వాటర్ లో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.

 ఎచినాచియా:

ఎచినాచియా:

ఎచినాచియా ప్లాంట్ లేదా హెర్బ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. రక్తనాళాలు, ఫ్లూ మరియు ఇతర శరీర ఇన్ఫెక్షన్స్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో వ్యాధినిరోధకతను పెంచే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతుంది.

మార్షమల్లో:

మార్షమల్లో:

మార్షమల్లో వేర్ళు మరియు ఆకులు దగ్గు, గొంతు నొప్పి, స్కిన్ ఎలిమెంట్స్ నివారించడంలో మరియు చిన్న చిన్న గాయాలను మాన్పడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మార్షమల్లో టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

 పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు:

పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు:

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది కిడ్నీలో టాక్సిన్స్ ను పెంచుతుంది . పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్అయ్యే అవకాశం ఎక్కువ. ఇవి చాలా నిధానంగా కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి.

 నీళ్ళు త్రాగడం పెంచాలి :

నీళ్ళు త్రాగడం పెంచాలి :

మన శరీరంను నిరంతరం తేమగా ఉంచుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది మరియు కిడ్నీలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కుసార్లు యూరిన్ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినిరల్స్ మరియు సోడియం ఫ్లష్ చేస్తుంది.

English summary

20 Home Remedies For Kidney Or Renal Infections

Kidney infections in females is more common because of the close proximity of the urethra, vagina, and anus. Symptoms of kidney infection are back pain, especially when it's sudden and intense, an urgent need to urinate, fatigue, swollen legs, hands, feet, or ankles, blood in the urine or difficulty urinating, bloating, puffy eyes, ridges in fingernails, skin problems, nausea and vomiting, metallic taste in the mouth
Desktop Bottom Promotion