For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ విత్ తులసిలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

|

దినచర్యను ఎనర్జిటక్ గా మొదలు పెట్టాలంటే, వేడి వేడిగా ఒక కప్పు టీతో స్టార్ట్ చేయాలి. అంతే కాదు, ఫ్రెండ్స్ ను కలిసిస్తే చాలు ఒక కప్పు టీతో ఎంజాయ్ చేసేస్తుంటారు, అయితే టీలో చేర్చే పాలు, పంచదార వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో గుర్తించారా?మీరు కనుకు టీకి అలవాటు పడినట్లైతే, గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. గ్రీన్ టీలో వివిధ రకాల లాభాలున్నాయి. గ్రీన్ టీలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ హెల్త్ కండీషన్స్ ను మెరుగుపరుస్తాయి . ఈ గ్రీన్ టీలో కొద్దిగా తులసి ఆకులను చేర్చడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ డబుల్ అవుతాయి.

తులసి మరియు గ్రీన్ టీ యొక్క అద్భుతమైన ఉపయోగాలేంటి?తులసిలో అద్భుతమైన ఔషధగుణాలుండబట్టే ఆయుర్వేదంలో తులసిని పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఔషధమొక్క. ఇందులో నాన్ టాక్సి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది . కాబట్టి, సూపర్ పవర్స్ ఉన్న ఈ రెండింటి కాంబినేషన్ తో అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు ..

తులసిలోని ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధగుణాలు చెప్పలేన్ని ఉంటే, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫెవనాయిడ్స్ శరీరంలోని ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి . అదే క్రమంలో తులసి ఏజింగ్ ప్రొసెస్ ను నివారించే కాంపోనెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఈ రెండింటి కాంబినేషన్ యొక్క ప్రయోజనాలను వివరించడానికి పరిమితంటూ లేదు. కాబట్టి, మీ దినచర్యలో భాగంగా త్రాగే ఒక కప్పు టీకి బదులుగా ఒక కప్పు గ్రీట్ టీ విత్ తులసి త్రాగండి అనేక లాభాలను పొందండి. మరి బాసిల్ గ్రీన్ టీలోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం....

శ్వాస సంబంధిత సమస్యలు:

శ్వాస సంబంధిత సమస్యలు:

దగ్గు మరియు జలుబుతో పాటు శ్వాస సంబంధిత సమస్యలున్న వారికి గ్రీన్ టీ విత్ తులసి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు తులసిలో ఆస్త్మా మరియు బ్రొంకైటిస్ వంటి లక్షణాలను నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి . ఇక ఒక కప్పు గ్రీన్ టీ విత్ తులసి త్రాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది మరియు రెస్పరేటరి ట్రాక్ ను క్లియర్ చేస్తుంది.

జ్వరం తగ్గిస్తుంది:

జ్వరం తగ్గిస్తుంది:

గ్రీన్ టీ విత్ తులసి లో మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జ్వరాన్ని తగ్గించడంలో మ్యాజిక్ చేస్తుంది. ఎందుకంటే మలేరియా, డేంగ్యు వంటి జ్వరాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ టీ తులసి ఆకులతో చేసిన డికాషిన్ లో కొంచెం యాలుకలు పొడి, పాలు, తేనె కలుపుకొని త్రాగితే ఎంత తీవ్రమైన జ్వరమైన తగ్గిపోతుంది.

 కార్డియో వాస్క్యులర్ డిసీజ్ లను తగ్గిస్తుంది:

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ లను తగ్గిస్తుంది:

బాసిల్ గ్రీన్ యొక్క మరో ముఖ్యమైన లక్షణం. బాసిల్ లీవ్స్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది . దీన్ని గ్రీన్ టీలో చేర్చుకోవడం వల్ల రక్తకణాల, రక్తణాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రక్తప్రరసరణను కూడా మెరుగుపరుస్తుంది. మరియు తులసి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

దృష్టి సమస్యలు :

దృష్టి సమస్యలు :

తులసిలో దాగి ఉండే విటమిన్ ఏ ఐసైట్ మెరుగుపరుస్తుంది. ఎవరైనా రేచీకటితో బాధపడుతున్నట్లైతే గ్రీన్ టీ విత్ తులసి ఒక బెస్ట్ హోం రెమెడీ. బాసిల్ విత్ గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలల్లో ఇది ఒక సహజ ప్రయోజనం.

ఒత్తిడి తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది.

ఒక కప్పు గ్రీన్ టీ స్ట్రెస్ బూస్టర్ గా సహాయపడుతుంది . ఒక కప్పు గ్రీన్ టీలో తులసి ఆకులను చేర్చడం వల్ల ఇది యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తులసి కార్టిసోల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్ ను)కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది . ఒక్క క్షణంలో రిలాక్స్ చేస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఇన్ని ప్రయోజనాలున్న బాసిల్ గ్రీన్ టీ బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించే వాటిలో గ్రీన్ టీ మనకు బాగా సుపరిచితమైనది. మరి గ్రీన్ టీలో తులసి ఆకులు చేర్చడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. మెటబాలిజం రేటును పెంచి బరువు వేగంగా తగ్గిస్తుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

బాసిల్ గ్రీన్ టీతో ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం . ఎందుకంటే కొన్ని రీసెర్చ్ ల ప్రకారం ఈ రెండింటి హెర్బ్స్ లోనూ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి శరీరంలో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా ఓరల్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే వండర్ ఫుల్ హోంమేడ్ సొల్యూషన్.

కిడ్నీ స్టోన్స్:

కిడ్నీ స్టోన్స్:

కిడ్నీ లో రాళ్ళతో బాధపడేవారు రోజు ఈ కషాయం లో తేనే కలుపుకొని త్రాగాలి. ఇలా చేస్తే కచ్చితంగా ఆరు నెలల పాటు కిడ్నీ లో రాళ్ల సమస్య తీరిపోతుంది.

డిప్రెషన్ :

డిప్రెషన్ :

ఆరోగ్య వంతుడైన వ్యక్తీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 12 తులసి ఆకులతో తయారుచేసిన టీ త్రాగడం వల్ల శరీరం ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి నుండి కూడా రిలీఫ్ కలిగి ఉంటారని పరిశోధనలు చెపుతున్నాయి. ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా ప్రభావం కనిపిస్తుంది. అరోమా థెరపీ అంటే ఇదే.

తలనొప్పి:

తలనొప్పి:

తలనొప్పి వచినపుడు తులసివిత్ గ్రీన్ టీ త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

 చర్మ సమస్యలు:

చర్మ సమస్యలు:

గ్రీన్ టీ విత్ తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.

 గ్రీన్ టీ విత్ తులసి తయారుచేయు విధానం:

గ్రీన్ టీ విత్ తులసి తయారుచేయు విధానం:

గ్రీన్ టీ విత్ తులసి తయారుచేయు విధానం:

కావలసినవి:

నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు

తయారు చేయు విధానం:

నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)

· పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.

English summary

How Basil Green Tea Benefts Your Health: Health Benefits in Telugu/tulasi with green tea

A cup of tea can give you an energetic start. Also, you can hang out with your friends over cups of tea. But, have you ever thought how milk and sugar in your tea are hampering your health? So, if you’re addicted to tea, it is better to go for green tea. The benefits of green tea are numerous. The bioactive compounds in it improve your health condition. Now, if you add basil (tulsi) to it, the health benefits are doubled.
Story first published: Thursday, November 12, 2015, 12:07 [IST]
Desktop Bottom Promotion