For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేధించే మెడ నొప్పి నుండి ఉపశమనం కలిగించే చిట్కాలు

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో రోజురోజుకీ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోంది. చాలామంది గంటల తరబడి ఇలాంటి పరికరాలతో గడుపుతూ మెడనొప్పిని కొని తెచ్చుకుంటున్నారు. సరిగా కూచోకపోవటం, ఎలా పడితే అలా మెడను వంచటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి.

రోజంతా కంప్యూటర్‌ మానిటర్‌ను చూస్తుంటే మెడ కీళ్ల చుట్టూ ఉండే కండరాలు అలసిపోతాయి. బాగా సాగుతాయి. అలాగే చాలాసేపు కార్ల వంటి వాహనాలను నడపటం, స్మార్ట్‌ఫోన్ల వైపు చూస్తుండటం కూడా వీటిని దెబ్బతీస్తాయి. మెడ కండరాలు బలహీనమైతే తలను పక్కను వంచటానికి దారితీస్తుంది. దీంతో కీళ్ల భంగిమ మారిపోయి వాటి కదలికలు కష్టమవుతాయి. ఇది మెడ నొప్పిని తెచ్చిపెడుతుంది.

READ MORE: మెడ పట్టేసిందా.. మెడ నొప్పి నివారణకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సేపు పనిచేసినా.. వంగి రాసినా.. ఒకవైపు భుజంపై బరువు ఎక్కువ వేసినా.. ఇలా ఏదో ఒక సమయంలో మెడనొప్పితో బాధపడని వాళ్లుండరు. ఇలాంటప్పుడు కొంచెం రిలాక్స్ అయితే చాలు.. నొప్పి తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు సాధారణ మెడనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ఏ డిస్క్ సమస్యే, మరే కారణమో ఉండొచ్చు. అందుకే మెడనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి దీని బారినపడకుండా ఉండేందుకు..

హాట్ కంప్రెసర్

హాట్ కంప్రెసర్

మెడనొప్పి వచ్చినప్పుడు వేడినీటిలో ముంచిన గుడ్డతో మెడపైన కాపాలి. లేదా ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపవచ్చు. ఇలా చేయడం వల్ల సాధారణ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

కంప్యూటర్‌

కంప్యూటర్‌

కంప్యూటర్‌ మానిటర్‌ కంటికి సమాన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.

విశ్రాంతి

విశ్రాంతి

మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందువల్ల నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

నిటారుగా కూచోవాలి.

నిటారుగా కూచోవాలి.

వెన్ను వంగిపోకుండా నిటారుగా కూచోవాలి.

ఫిజియోథెరపి

ఫిజియోథెరపి

ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

 తలను అటూఇటూ వంచటం, కిందికీ పైకీ తిప్పటం చేయకూడదు.

తలను అటూఇటూ వంచటం, కిందికీ పైకీ తిప్పటం చేయకూడదు.

కంప్యూటర్‌తో పనిచేస్తున్నప్పుడు తలను అటూఇటూ వంచటం, కిందికీ పైకీ తిప్పటం చేయకూడదు.

పెయిన్‌కిల్లర్

పెయిన్‌కిల్లర్

సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి అయిదారుసార్లు సున్నితంగా మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.

స్మార్ట్‌ఫోన్లను

స్మార్ట్‌ఫోన్లను

స్మార్ట్‌ఫోన్లను అదే పనిగా వాడకుండా మధ్యమధ్యలో వాటిపై నుంచి దృష్టిని మరల్చాలి.

బరువైన బ్యాగులు

బరువైన బ్యాగులు

బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకుని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. కాబట్టి అటూ ఇటూ మార్చుకుంటూ ఉండాలి. అసలే నొప్పి ఉన్నవాళ్లు ఎక్కువ బరువు మోయకుండా ఉండటం మేలు.

 డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు

డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు

డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తల ఎక్కువసేపు ముందుకు వంచకుండా చూసుకోవాలి.

నడక

నడక

నడిచేటప్పుడు ఒక వైపుకే వంగకూడదు

బోర్లా పడుకోవటం మానెయ్యాలి

బోర్లా పడుకోవటం మానెయ్యాలి

మెడనొప్పితో బాధపడేవారు బోర్లా పడుకోవటం మానెయ్యాలి. ఎందుకంటే బోర్లా పడుకుంటే ఎక్కువసేపు తలను ఏదో ఒక పక్కకు తిప్పి పడుకోవాల్సి ఉంటుంది.

English summary

How to Get Rid of Neck Pain: Health Tips in Telugu

Most people have experienced neck pain at least once during their life time. It is one of the most common pains, which is usually triggered by bad posture, wrong sleeping habits, and stress.
Story first published: Wednesday, October 7, 2015, 18:10 [IST]
Desktop Bottom Promotion