For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికాకు పెట్టే యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణా మార్గాలు

By Nutheti
|

స్ర్తీలలో చాలా అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఎదురవుతుంటాయి. రుతుక్రమం సమయంలోనే కాదు, తరచుగా యూరిన్ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోలేక, బయటపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యల నుంచి బయటపటానికి ఈ సింపుల్ రెమిడీస్ ఫాలో అయితే చాలు.

మూత్రం వెళ్లినప్పుడు విపరీతమైన మంట, చికాకు, తరచుగా మూత్రానికి వెళ్లడం వంటివన్నీ మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఈ సమస్య కనిపించినప్పుడు మందులు వాడితే తగ్గిపోతూ ఉంటుంది. కానీ.. మళ్లీ కొన్ని రోజులకే సమస్య మొదలవుతుంటుంది. ఇలాంటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం..

urine infection

మెనోపాజ్ దశలో
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా స్త్రీలలోనే కనిపిస్తుంది. అది కూడా పిల్లలను కనే వయసులో లేదా మెనోపాజ్ దశలో కనిపిస్తూ ఉంటుంది. యోనిమార్గంలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలపైన కూడా ప్రభావం చూపుతుంది.

మంచినీళ్లు
మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తరచుగా యూరిన్ కి వెళ్తే.. మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు కనీసం గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది.

drinking water

కలయిక తర్వాత
లైగింక చర్యలో పాల్గొన్నప్పుడు బ్యాక్టీరియా యోనిమార్గం నుంచి మూత్రాశయంలోకి చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియా అలాగే ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి కలయిక తర్వాత యూరిన్ కి వెళ్లడం, ఆ ప్రాంతాన్ని శుభ్రపరుచుకోవడం అలవరచుకోవాలి.

సోప్
వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గాఢత ఎక్కువగా ఉన్న సోప్ లు, క్రీములు, పౌడర్లు ఆ ప్రాంతాల్లో వాడకూడదు.

గర్భనిరోధకమాత్రలు
కొన్నిరకాల గర్భనిరోధక మాత్రలు హాని కలిగిస్తాయి. ఇవి మేలుచేసే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్ సలహా తీసుకోవాలి.

anti biotics

యాంటీ బయోటిక్స్
యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మెడికల్ షాపులో ఏవో మందులు తీసుకుని వాడటం మంచిది కాదు. డాక్టర్ సలహా తీసుకుని వాడితే మంచిది. వైద్యులు సూచించినన్ని రోజులు మందులు వాడటం చాలా అవసరం. మధ్యలోనే ఆపేయడం వల్ల మళ్లీ సమస్య మొదలయ్యే అవకాశముంది.

English summary

How to Prevent Urine Infection

As we all know kidneys are one of the most important organs of our body. In our body they have been assigned the work of filtering and removing harmful and toxic substances from the blood through urine.
Story first published: Friday, December 4, 2015, 17:24 [IST]
Desktop Bottom Promotion