For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చళ్లు తింటే.. అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే

By Nutheti
|

ఊరగాయలు చూడగానే ఆవురావురుమంటూ లాగించేస్తున్నారా ? రోజూ భోజనంలో ఊరగాయ ఉండాల్సిందేనా ? పికిల్ లేకపోతే ముద్ద దిగడం లేదా ? అయితే కాస్త ఆగండి. నోరూరించే ఊరగాయలు ఎక్కువగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఊరగాయలు సేవించడానికీ ఓ లిమిట్ ఉండాలని సూచిస్తున్నారు.

ఊరగాయలు రుచికరంగా.. కారంగా.. తింటుంటే తినాలిపిస్తాయి. ఇండియాలో ఊరగాయలు లేకుండా.. భోజనం పరిపూర్ణం కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కాస్త కష్టమే కానీ.. కొన్ని నియమాలు పాటిస్తే.. ఊరగాయల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజుకి ఎంత మొత్తంలో పచ్చళ్లు తినాలో తెలుసుకుంటే.. రుచితో పాటు.. ఆరోగ్యంగానూ ఉండవచ్చు.

నూనె

నూనె

పచ్చళ్లు అంటేనే నిల్వ పదార్థాలు. ఇవి ఎంతకాలమైనా.. రుచిగా ఉండటానికి.. నిల్వ ఉండటానికి ఇందులో నూనె ఎక్కువ వాడతారు. ప్యాక్ చేసిన పచ్చళ్లు పాడవకుండా ఉండటానికి నూనెతోపాటు ఉప్పు, వెనిగర్ ఎక్కువ మోతాదులో కలుపుతారు. ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ఉప్పు, కారం

ఉప్పు, కారం

నూనెతో పాటు కారం, ఉప్పు ఊరగాయలలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ల స్థాయిలు శరీరంలో పెరుగుతాయి. ఇవి ఎక్కువైతే.. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి పచ్చళ్లకు దూరంగా ఉండటమే మేలు.

ఉదర సమస్యలు

ఉదర సమస్యలు

నిత్యం ఊరగాయలు తీసుకునే వాళ్లు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువగా పచ్చళ్లు తినే వాళ్లలో ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు పెరుగుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది.

జీర్ణాశయ సమస్యలు

జీర్ణాశయ సమస్యలు

జీర్ణాశయ సమస్యలు తీవ్రమవుతాయి. కొన్ని సందర్భాలలో విరేచనాలకు కారణమవుతాయి. పచ్చళ్ల ద్వారా ఎక్కువ మొత్తంలో సోడియం తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ నీటి శాతం అందించాల్సి వస్తుంది.

రక్తపోటు

రక్తపోటు

ఊరగాయలు ఎక్కువగా తీసుకుంటే.. బీపీ కూడా పెరుగుతుంది. ఆకస్మికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగడం.. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

అల్సర్

అల్సర్

కారం ఎక్కువగా ఉండే పచ్చళ్లు అల్సర్లకు కారణమవుతాయి. ఊరగాయలను నిత్యం తీసుకునే వాళ్లకు పొట్టలో, పేగులలో అల్సర్ సమస్య మొదలవుతుంది.

పైల్స్

పైల్స్

మొలల సమస్యలున్న వాళ్లు సాధ్యమైనంతవరకు పచ్చళ్లకు దూరంగా ఉండాలి. రోజూ ఆహారంలో ఊరగాయలు చేర్చుకోవడం వల్ల.. మొలల సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో కారంతో పాటు ఘాటు పదార్థాలు ఉండటం వల్ల పైల్స్ మరింత తీవ్రమవుతాయి.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

తినడానికి రుచికరంగా.. చూడ్డానికి నోరూరించేలా ఉండే పచ్చళ్లు ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మితంగా తీసుకోండి. కావాలంటే నూనె, ఉప్పు, కారం తగ్గించి.. ఊరగాయలను తయారు చేసుకుని తినాలి. రోజూ తినాలి అనిపిస్తే.. తక్కువ పరిమాణంలో తీసుకోండి. అప్పుడు.. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ ఎలాంటి ముప్పూ ఉండదు.

English summary

Pickles Raise Health Problems: health tips in telugu

Pickles make our food tastier. Pickles, in India, are usually made with a lot of oil, spice and salt. The main ingredients of pickles may vary from vegetables such as carrot, beet, amla to non-vegetarian items such as fish or meat. Most of the meat products are used to make pickle. Sea foods are also used in making pickles.
Story first published: Monday, October 12, 2015, 15:09 [IST]
Desktop Bottom Promotion