For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వచ్చే అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే..

By Nutheti
|

వర్షాకాలం వచ్చిందంటే.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ వాతావరణానికి శరీరం అడ్జెస్ట్ కావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గాలి, నీళ్లు, క్రిమికీటకాల ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి.

READ MORE: వైరల్ ఫీవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే..

దగ్గు, జలుపు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో ఈజీగా స్ర్పెడ్ అవుతాయి. ఇవే కాకుండా మరికొన్ని ఇన్ఫెక్షన్లు పొట్ట, రోగనిరోధక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయి. రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల నీటి ద్వారా వ్యాధులు వచ్చే అవకాశముంది. కాలుష్యం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల గాలి ద్వారా, వర్షపు నీటి ద్వారా వచ్చే దోమల కారణంగా క్రిమికీటకాల నుంచి రోగాలు వ్యాపిస్తాయి.

READ MORE: వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే హెల్తీ ఫుడ్స్

ఇలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండాలంటే.. మీ శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటం చాలా అవసరం. సరైన ఆహారం, ఎక్కువ మోతాదులో పండ్ల రసాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

ఈ మాన్ సూన్ సీజన్ లో వ్యాధులకు దూరంగా ఉండటానికి ఆరోగ్యకరమైన హోం రెమిడీస్ ఫాలో అవ్వాలి. చలికాలం, వర్షాకాలాలలో వచ్చే కామన్ డిసీజ్ ల నుంచి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి ? నాచురల్ పద్ధతిలో ఎలా ట్రీట్మెంట్ చేయాలి ? వంటి సందేహాలకే చెక్ పెట్టాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే..

జలుబు

జలుబు

వర్షాకాలంలో జలుబు చాలా సాధారణం. వాతావరణంలో మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి బయట ఫుడ్ కి దూరంగా ఉంటూ.. ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.

దగ్గు

దగ్గు

దగ్గు, గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈ వైరస్ త్వరగా ప్రబలుతుంది.. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలి. దగ్గు నుంచి బయటపడాలంటే గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇది రోగనిరోధక వ్యవస్థకు సహాయపడటమే కాదు.. హాని చేసే బ్యాక్టీరియా నుంచి పోరాడుతుంది.

ఫ్లూ లేదా వైరస్

ఫ్లూ లేదా వైరస్

వర్షాకాలం, చలికాలంలో ఈజీగా ప్రబలే డిసీజ్ వైరస్. దీనికి దూరంగా ఉండాలంటే.. శరీరం వెచ్చగా ఉండాలి. దాంతోపాటు వైరస్ సోకిన వాళ్లకు దూరంగా ఉండాలి. చల్లటి పదార్థాలను అవైడ్ చేయాలి.

డెంగ్యూ

డెంగ్యూ

ఎడిస్ ఎంజిప్టి అనే దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి డెంగ్యూ. ప్రస్తుతం ఇండియాలో డెంగ్యూ ఎక్కువగా ఉంది. తీవ్ర జ్వరం, జాయింట్ పెయిన్స్, చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పులు డెంగ్యూ జ్వరం ప్రధాన లక్షణాలు.

మలేరియా

మలేరియా

క్రిమికీటకాల ద్వారా వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. వర్షపు నీటి ద్వారా దోమలు పెరుగుతాయి. అలా ఈ మలేరియా వ్యాపిస్తుంది.

కాబట్టి మురుగునీళ్లు దగ్గరగా ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

చికెన్ గున్యా

చికెన్ గున్యా

చికెన్ గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాదు వాటర్ ట్యాంక్ లను తరచుగా శుభ్రం చేయకపోయినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్ర జ్వరం, కీళ్లనొప్పులు, తీవ్ర తలనొప్పి చికెన్ గున్యా లక్షణాలు.

జ్వరాలు

జ్వరాలు

వైరల్ ఫీవర్స్ ఈ సీజన్ లో చాలా కామన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు దగ్గు, జలుబు కారణంగా వ్యాధినిరోధకతపై ప్రభావం పడుతుంది. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్, ఫ్రై ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

టైఫాయిడ్

టైఫాయిడ్

కలుషితమైన నీటి ద్వారా టైఫాయిడ్ వస్తుంది. కాబట్టి కాచిన నీటినే తీసుకోవడం ఈ కాలంలో అలవాటు చేసుకోవడం మంచిది. జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి టైఫాయిడ్ లక్షణాలు.

జాండీస్

జాండీస్

మాన్ సూన్ సీజన్ లో జాండీస్

సాధారణ వ్యాధి. దీన్ని అరికట్టాలంటే.. కాచిన నీటినే తాగాలి.. బయట ఫుడ్ తీసుకోకూడదు. వండటానికి ముందు కూరగాయలను ఉప్పు నీటిలో శుభ్రం చేయడం వల్ల హానికలిగించే క్రిములు నాశనమవుతాయి.

డయేరియా

డయేరియా

చలికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే మరో వ్యాధి డయేరియా. కలుషితమైన నీళ్లు తాగడం, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. డయేరియా ఎక్కువగా బాధిస్తోంది.

కాబట్టి వర్షాకాలం, శీతాకాలాలలో వచ్చే అంటువ్యాధులు, డిసీజ్ లపై చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహారం తీసుకోవడం, కాచిన నీటినే తాగడం వల్ల చాలావరకు సీజనల్ డిసీజ్ లకు దూరంగా ఉండవచ్చు.

English summary

Protect Yourself From Common Winter Monsoon Diseases in telugu

During the winter season, your body heat experiences a drop as the environment cools down. At the same time, your body adjusts to a new climate which often results in a number of air-borne, water-borne and insect-borne diseases.
Story first published: Tuesday, November 17, 2015, 11:24 [IST]
Desktop Bottom Promotion