For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాయాలు తగిలినప్పుడు బ్లీడింగ్ ఆపే ఈజీ హోం రెమిడీస్

By Nutheti
|

కూరగాయలు కట్ చేసేటప్పుడు.. ఏదైనా పని చేస్తున్నప్పుడు సడెన్ గా చేతులకు, కాళ్లకు గాయాలవుతూ ఉంటాయి. చిన్న గాయమే అయినా రక్తం పాస్ట్ గా కారిపోతూ ఉంటుంది. బ్లడ్ పోతుందన్న కంగారులో ఏం చేయాలో తెలియక సతమతపడుతూ ఉంటాం. అయితే హడావుడి చేయడకుండా.. బ్లీడింగ్ నిలబడటానికి ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఈజీగా ట్రీట్ చేయవచ్చు.

READ MORE: చియా సీడ్స్(సబ్జ గింజలు)లోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

రక్తం కారుతూ ఉంటే వెంటనే ఏదైనా క్లాత్ తీసుకుని గట్టిగా కట్టేయడమో, ట్యాప్ కింద పెట్టడమో చేస్తూ ఉంటాం. అయితే టెన్షన్ తీసుకోకుండా.. ప్రథమ చికిత్సలో భాగంగా వెంటనే మెదడుకు పనిచెప్పాలి. దీనికి చాలా అద్భుతంగా పనిచేసే హోం రెమిడీస్ చాలా ఉన్నాయి. వాటి ద్వారా బ్లడ్ బ్లీడింగ్ ని వెంటనే ఆపేయవచ్చు. చిన్న చిన్న గాయాలైనప్పుడు ఇంట్లోనే ట్రీట్ మెంట్ చేయవచ్చు.

READ MORE:అనారోగ్య సమస్యలకు అమ్మమ్మ చిట్కాలతో ఉపశమనం

హఠాత్తుగా గాయాలు తగిలినప్పుడు ముందుగా రక్తం కారడాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. అందుకే వంటింట్లో వాడే వస్తువులతోనే త్వరగా బ్లడ్ బ్లీడింగ్ ని స్టాప్ చేసే ఉపాయాలు చాలా ఉన్నాయి. చిటికెలో బ్లీడింగ్ నిలబడేలా చేసే చిట్కాలేంటో తెలుసుకుందాం..

కాఫీ పౌడర్

కాఫీ పౌడర్

చిన్న చిన్న గాయాలు తగిలి బ్లడ్ కారిపోతూ ఉంటే వెంటనే ఇంట్లో ఉండే కాఫీ పౌడర్ రాస్తే బ్లీడింగ్ కాకుండా కాపాడుతుంది. ఇది చర్మంపై ఆస్ర్టిజెంట్ లా పనిచేసి.. గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది.

పసుపు

పసుపు

బ్లీడింగ్ అవుతున్న గాయానికి డైరెక్ట్ గా పసుపు రాయడం వల్ల వెంటనే రక్తం కారడం నిలిచిపోతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ చుట్టూ స్ర్పెడ్ అవకుండా.. కాపాడుతూ.. బ్లీడింగ్ ని కొన్ని నిమిషాల్లోనే ఆపుతుంది.

టీ బ్యాగ్

టీ బ్యాగ్

చల్లటి నీళ్లలో ఒక టీ బ్యాగ్ ని ముంచి తర్వాత గాయంపై నొక్కి పెట్టాలి. ఎలాంటి గాయానికైనా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ టీ బ్యాగ్ పెట్టడం వల్ల ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే బ్లీడింగ్ ఆగిపోతుంది.

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్

చిన్న చిన్న గాయాలై.. రక్తం కారుతున్నప్పుడు పేస్ట్ పెడితే వెంటనే ఫలితం ఉంటుంది. ఇది ఆస్ర్టిజెంట్ పనిచేసి, బ్లీడింగ్ ఎక్కువకాకుండా చూస్తుంది. అలాగే గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది.

గ్లాస్

గ్లాస్

శుభ్రంగా ఉన్న గ్లాస్ ని బ్లీడింగ్ అవుతున్న గాయంపై పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా కాసేపు ఉంచడం వల్ల బ్లడ్ బ్లీడింగ్ ఆపడానికి సహాయపడుతుంది. అయితే ఈ గ్లాస్ గాజుదై ఉండాలి. ఇలా గ్లాస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే.. మరో ప్రమాదానికి అవకాశముంది.

మొక్కజొన్న పిండి

మొక్కజొన్న పిండి

బ్లడ్ బ్లీడింగ్ ని ఆపడానికి ఇదో సింపుల్ రెమెడీ. రక్తం కారుతున్న గాయంపై డైరెక్ట్ గా కార్క్ స్టార్చ్ ని అప్లై చేయాలి. ఇది బయటకు వచ్చే బ్లడ్ ని పీల్చుకుని.. బ్లీడింగ్ ఆపుతుంది.

ఐస్ క్యూబ్

ఐస్ క్యూబ్

రక్తం కారుతున్న గాయంపై ఐస్ క్యూబ్ పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి. ఇది బ్లీడింగ్ ని వెంటనే స్టాప్ చేస్తుంది. గాయం ద్వారా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కారం పొడి

కారం పొడి

గాయం తగిలిన వెంటనే బ్లడ్ బ్లీడింగ్ ను ఆపడానికి కొద్దిగా కారం పొడిని చల్లాలి. ఇది గాయం త్వరగా మానేలా పనిచేస్తుంది.

ఉప్పు

ఉప్పు

గాయాలపై సాల్ట్ వేయడం వల్ల కొంచెం నొప్పి ఉంటుంది. అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది గాయం నుంచి వస్తున్న రక్తాన్ని పీల్చుకుని.. అది డ్రైగా మారడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది.

English summary

Quick Home Remedies For Bleeding Wounds in telugu

Whenever we get a cut accidentally, we usually stop the wound from bleeding by tying the area tight with a piece of cloth or by keeping the affected area under a running tap. We don't have to panic in such conditions and just have to use our minds on how to stop the bleeding effectively.
Story first published:Thursday, November 26, 2015, 10:08 [IST]
Desktop Bottom Promotion