For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నాలుకను శుభ్రం చేసుకోవాల్సిన అవసరమేంటి ?

|

నోటిని శుభ్రం చేసుకోవడం ఎంత అవసరమో.. నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా అంతే అవసరం. నాలుక శుభ్రంగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. నోరు ఫ్రెష్ గా ఉండటం వల్ల ఆహారం రుచికరంగా ఉంటుంది.

READ MORE: ఓరల్ క్యాన్సర్(నోటి క్యాన్సర్)నివారించడం ఎలాREAD MORE: ఓరల్ క్యాన్సర్(నోటి క్యాన్సర్)నివారించడం ఎలా

నోటిని శుభ్రం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్రష్ చేసుకోవడం, నోరు కడుక్కోవడం వల్ల క్యావిటీస్, చిగుళ్ల సమస్యలు రావని అందరికీ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో నాలుకను శుభ్రం చేసుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సందర్భాల్లో పళ్లు క్లీన్ చేయడంలో చూపించే శ్రద్ధ నాలుక శుభ్రపరచడానికి చూపించరు. దీనివల్ల.. చాలా సమస్యలు ఎదురవుతాయి. నాలుక శుభ్రంగా ఉంటే.. మాట్లాడటంలో క్లారిటీ ఉంటుంది, గొంతులో కిచ్ కిచ్ లాంటి సమస్యలుండవు.

READ MORE: నోటి దుర్వాసనను దూరం చేసే 7 అద్భుత చిట్కాలు...

అయితే ఆరోగ్యమైన, పరిశుభ్రమైన నాలుక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఫ్రెష్ నెస్ ఇంప్రూవ్ చేయడం నుంచి.. శ్వాస అందించడం వరకు.. అనేక లాభాలున్నాయి. నాలుకను క్లీన్ చేయడం వల్ల పొందే లాభాలేంటో ఓ లుక్కేద్దాం..

ఫ్రెష్ బ్రీత్

ఫ్రెష్ బ్రీత్

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో మొదటికి ఫ్రెష్ బ్రీత్. దుర్వాసనను పోగొడుతుంది. రోజుకి రెండుసార్లు బ్రెష్ చేయడం వల్ల బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

రుచి పెరుగుతుంది

రుచి పెరుగుతుంది

ఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకరకాల రుచులను తెలిపుతుంది నాలుక. సగటున ప్రతి ఒక్కరికి 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండు వారాలకు రీప్లేస్ అవుతూ ఉంటటాయి. ఒకవేళ నాలుకను సరిగ్గా శుభ్రపరచకపోతే.. టేస్ట్ బడ్స్ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల టేస్ట్ తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరను కలుపుకుని తింటారు.

చిగుళ్ల ఆరోగ్యానికి

చిగుళ్ల ఆరోగ్యానికి

నాలుకను శుభ్రం చేసుకోకపోతే.. బ్యాక్టీరియా పెరిగిపోయి.. చిగుళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్యకరమైన పళ్లు

ఆరోగ్యకరమైన పళ్లు

బ్రషింగ్ పళ్లలో చిక్కుకున్న ఆహారాన్ని, బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మొత్తం నోటినంతా అంటే.. నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం వల్ల.. వయసు పెరిగినా పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగవడానికి

జీర్ణక్రియ మెరుగవడానికి

జీర్ణప్రక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి నోట్లో లాలాజలం ఊరడం ద్వారానే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల సాలివాను ఉత్పత్తి చేసి.. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోరు డ్రైగా మారకుండా సహాయపడుతుంది.

 గొంతు సమస్యలకు

గొంతు సమస్యలకు

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నాలుకపై ఏర్పడే తెల్లటి పొర, ఫంగస్ కారణంగా శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతాయి. నాలుకను సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల గొంతులో వచ్చే ఫ్లమ్ ని, బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

నోటి ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు ఇటీవలే తేలింది. నోట్లో ఉండే ఫలకం హార్ట్ ఎటాక్, స్ర్టోక్ కు కారణమవుతాయి. దీని కారణంగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి నొప్పులకు దారితీస్తాయి. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

శ్వాస సంబంధిత వ్యాధులకు దూరంగా

శ్వాస సంబంధిత వ్యాధులకు దూరంగా

నాలుకను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. లంగ్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు. శ్వాస ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రక్రియ సహకరిస్తుంది.

English summary

Reasons Why Cleaning Your Tongue is Important in telugu

Brushing and flossing your teeth can help prevent cavities and gum disease while leaving your mouth with a pleasant and clean feeling. But often times, we neglect one of the most important facets of oral hygiene: the tongue. The tongue serves many purposes like pronunciation and speech.
Desktop Bottom Promotion