For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే పానీయాలు

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అందరూ ఏదో ఒక సమయంలో తలనొప్పికి గురి అవుతున్నారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో తలనొప్పికి కారణం స్ట్రెస్, నిద్రలేమి, విశ్రాంతి తీసుకోకపోవడం, డీహైడ్రేషన్ మరియు ఇతర కొన్ని అలర్జీల వల్ల తలనొప్పికి గురి అవుతుంటారు. తలనొప్పిలో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో టెన్షన్ తో వచ్చే తలనొప్పి, క్లస్టర్ తలనొప్పి, సైనస్ వల్ల తలనొప్పి, మరియు మైగ్రేన్ జ

టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి కొద్దిసమయం మాత్రమే ఉంటుంది. ఈ నొప్పి తలమొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. క్లస్టర్ హెడ్ ఏక్ ఇది ఒక సారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది . ఈ తలనొప్పి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సైనస్ హెడ్ ఏక్, ఇది సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది . ఇది చాలా లోతుగా ఇబ్బంది పెట్టే తలనొప్పి ముఖం మరియు నుదుటి బాగంలో ఎక్కువ నొప్పికి దారితీస్తుంది.

మైగ్రేన్ హెడ్ ఏక్ ఇది ఎప్పుడూ ఎక్కువగా ఇబ్బంది పెట్టే తలనొప్పి, . మైగ్రేన్ తలనొప్పి యొక్క లక్షణాలు ఒక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. ఇలా చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడానికి బదులు, నేచురల్ హోం రెమెడీస్, అందులోనే మనకు చాలా చౌకగా అందుబాటులో ఉండే హోం రెమెడీస్ తీసుకోవడం వల్ల ఎలాంటి తలనొప్పి అయినా వెంటనే తగ్గించుకోవచ్చు. మరియు ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

 కాఫీ:

కాఫీ:

తలనొప్పిని నివారించడంలో కాఫీ ఒక గ్రేట్ హోం రెమెడీ. ఎందుకంటే మనం తలనొప్పి నివారించుకోవడానికి తీసుకొనే ఆస్పిరిన్ మరియు మిడోల్ వంటి మాత్రల్లో కూడా కెఫిన్ ను ఉపయోగిస్తారు. కెఫిన్ వల్ల తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది . కాబట్టి, తలనొప్పి ఉన్నప్పుడు, ఒక కప్పు కాఫీని త్రాగడం మంచిది.

పెప్పెర్ మింట్:

పెప్పెర్ మింట్:

ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . సాధారణ తలనొప్పితో పాటు, మైగ్రేన్ హెడ్ ఏక్ ను నివారిస్తుంది. మింట్ టీ బహిర్గతంగాను, మరియు అంతర్గతంగాను ఉపయోగించుకోవచ్చు . పెప్పెర్ మింట్ ఆయిల్లోని ఆరోమా వాసన రక్తప్రసరణను కంట్రోల్ చేస్తుంది. దాంతో మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది పెప్పర్ మింట్ టీ తలనొప్పి , మరియు స్ట్రెస్ తగ్గించడంలో, సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

చల్లటి నీళ్ళు:

చల్లటి నీళ్ళు:

డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఒక గ్లాసు చల్లటి నీళ్ళు త్రాగడం వల్ల తలనొప్పి మరింత ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు . తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

అల్లం టీ:

అల్లం టీ:

అల్లం టీ కూడా తలనొప్పి నివాిరస్తుంది. అల్లంలోని ఔషధగుణాల వల్లే దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అల్లం టీ ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఈ టీని త్రాగిన కొద్దిసేపటికే నొప్పి నివారిస్తుంది మరియు వికారంను కంట్రోల్ చేస్తుంది.

తులసి టీ:

తులసి టీ:

తులసి టీ, ఇది ఒక ఆరోమాటిక్ స్మెల్ కలిగినటువంటి హెర్బ్ . పిజ్జా మరియు మరికొన్ని వంటలకు దీన్ని టాపింగ్ కోసం వినియోగిస్తున్నారు . వంటలకు రుచి మాత్రమే కాదు, తలనొప్పిని తగ్గించడంలో కూడా అద్భతుంగా సహాయపడుతుంది . తులసిలో విశ్రాంతి మరియు అనాల్జిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . తలనొప్పిని క్షణాల్లో నివారిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్, మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉన్నాయి . గ్రీన్ టీ నాడీవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది మరియు బ్రెయిన్ ను యాక్టివేట్ చేస్తుంది . గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మంచి పాత్రపోషిస్తుంది. తలనొప్పి నివారిస్తుంది.

 బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

కొన్ని పరిశోధనల ప్రకారం, కాఫీ మరియు టీలో ఉండే కెఫిన్ పెయిన్ కిల్లర్స్ కంటే చాలా వేగంగా నొప్పిని నివారిస్తుంది. బ్లాక్ టీ మరియు నిమ్మరసం రెండింటి కాంబినేషన్ చాలా గ్రేట్ కాంబినేషన్ ఇది తలనొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Seven Beverages To Relieve Headache

Headaches including migraines are one of the most common problems faced by every age group these days. The reasons could be stress, lack of sleep, restlessness, dehydration and certain allergies. There are various types of headaches; some of which include, tension headaches, cluster headaches, sinus headaches, rebound headaches and migraines.
Story first published: Monday, August 24, 2015, 13:58 [IST]
Desktop Bottom Promotion