For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయి సీడ్స్ మంచివే.. కానీ ? ఎక్కువైతే అనర్థమే

By Nutheti
|

బొప్పాయి గింజలలోని ఆరోగ్య రహస్యాలు తెలియక చాలామంది వాటిని పడేస్తుంటారు. కానీ ఇవి చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తాయి. నిత్యం కొంచెం పరిమాణంలో బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే బొప్పాయి గింజలు తీసుకునే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. తగినన్ని తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి.

READ MORE: బొప్పాయి ఆకులో మనకు తెలియని ఆరోగ్య రహస్యాలెన్నో..ఎన్నెన్నో...

పపాయ గింజలు తీసుకోవాలి అనుకుంటే ఫ్రెష్ వే ఎంచుకోవాలి. పండులో నుంచి తీసిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకోవాలి. దాన్ని ఫ్రిజ్ లో నిలువ ఉంచుకోవాలి. ఇలా ఫ్రిజ్ లో పెట్టుకున్న బొప్పాయి గింజలను కొన్ని నెలలపాటు వాడుకోవచ్చు. బొప్పాయి పండు గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అనారోగ్య సమస్యలతో పోరాటడంతో పాటు, ఇమ్యునిటీ పవర్ ని పెంచుతాయి. అయితే ఎంతవరకు ఈ గింజలు సేఫ్ ? ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే అనార్థాలేంటో చూద్దాం..

యాంటీబ్యాక్టీరియల్ గుణాలు

యాంటీబ్యాక్టీరియల్ గుణాలు

బొప్పాయి సీడ్స్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే ఫుడ్ పాయిజనింగ్ అరికట్టడానికి కూడా ఇవి సహాయపడతాయి.

క్యాన్సర్

క్యాన్సర్

బొప్పాయి గింజలు ట్యూమర్స్, క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా కాపాడుతాయి. అలాగే ఈ గింజల్లో ఐసోథియోసైనేట్ ఉంటుంది. ఇది లంగ్స్, కెలాన్, ప్రొస్టేట్, ల్యుకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడతాయి.

కిడ్నీ డిసీజ్

కిడ్నీ డిసీజ్

పపాయ సీడ్స్ కిడ్నీ సమస్యలతో పోరాడే శక్తి ఎక్కువగా ఉందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కిడ్నీల్లో వచ్చే పాయిజనింగ్ సమస్యలతో చాలా గ్రేట్ గా పోరాడుతాయి బొప్పాయి గింజలు.

వైరల్ ఇన్ఫెక్షన్

వైరల్ ఇన్ఫెక్షన్

ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా.. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి బొప్పాయి సీడ్స్. డెంగ్యూ ఫీవర్ నివారించడానికి చాలా దేశాల్లో బొప్పాయి గింజలు వాడుతున్నారు.

పారాసైట్స్

పారాసైట్స్

బొప్పాయి గింజల్లో కార్పెయిన్ ఉంటుంది. ఇది పారాసైట్స్ ని నాశనం చేయడానికి సహకరిస్తుంది. బొప్పాయి గింజల జ్యూస్ ని ఏడు రోజులు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న 75 శాతం పారాసైట్స్ నివారించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

కాలేయానికి

కాలేయానికి

బొప్పాయి సీడ్స్ లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి కాలేయంలో వచ్చే సమస్యలతో పోరాడుతాయి. కాబట్టి 5 లేక 6 బొప్పాయి గింజలు తీసుకుని వాటిని ఫ్రూట్ జ్యూస్ తో కలిపి గ్రైండ్ చేయాలి. ఇలా ఒక నెలరోజులు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. రోజూ తక్కువ మోతాదులో బొప్పాయి గింజలు తీసుకుంటే.. కాలేయ వ్యాధులను నివారించవచ్చు.

సైడ్ ఎఫెక్ట్స్

సైడ్ ఎఫెక్ట్స్

సరైన మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలతో పోరాడవచ్చు. కానీ మోతాదు మించి తీసుకోవడం వల్ల ఇవి పాయిజనింగ్ కి కారణమవుతాయి. కాబట్టి మంచిదే కదా అని ఎక్కువగా తీసుకోకూడదు.

పేగులకు

పేగులకు

బొప్పాయి గింజల్లో కార్పెయిన్ అనేది ఉంటుంది. ఇది పేగులకు మేలు చేస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే పేగుల్లో సమస్యలు ఎదురవుతాయి. నెర్వస్ సిస్టమ్ పై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది.

English summary

Side Effects Of Eating Too Much Papaya Seeds

Papaya seeds are thrown away by a majority of people because they do not know how safe papaya seeds are for health. Papaya seeds are safe to eat and incorporating them in small amounts in your daily diet can be beneficial for you.
Desktop Bottom Promotion