For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ల నొప్పులను మాయం చేసే టాప్ 10 హోం రెమెడీస్

|

నేటి ఆధునక యుగంలో వయసు మీదపడిన పేద్దలు మాత్రమేకాక, చిన్న వయసులో ఉన్న కుర్రాళ్లు సైతం కాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు అంటా తెగ బాధపడిపోతుంటారు. ఆ నొప్పులకు కారణాలు ఎన్నైనప్పటికీ వాటిని నుంచి ఉపశమనం పొందడానికి అందరూ తంటాలుపడుతుంటారు.

ఈ కాళ్ల నొప్పులు కొందరిలో తీవ్రంగా ఉంటే మరికొందరిలో తక్కువగా ఉంటుంది, అయితే, కాళ్లనొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంయొక్క సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. శరీర మొత్తం బరువును కాళ్ల మీద మోపడానికి కుదరదు. కాళ్లనొప్పి వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లనొప్పులున్నప్పుడు కాళ్లలో సలుపు, జలదరింత మరియు కాళ్లు బలహీనంగా అనిపంచడం జరుగుతుంది.

READ MORE: బాడీపెయిన్స్ ను తగ్గించే మంచి ఆహారాలు...

కాళ్లనొప్పులకు వివిధ రకాల కారణాలుండవచ్చు. అయితే, అత్యంత సాధారణంగా లెగ్ క్రాంప్స్, కండరాల పట్టివేత, కండాల సలుపు, అలసట, న్యూట్రీషియన్ లోపం, డీహైడ్రేషన్ మరియు ఎక్కువ సమయం నిలబడటం వల్ల కాళ్లనొప్పులు వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో, కాళ్లనొప్పి, కండరాల అలసట, స్నాయువు లేదా ఒత్తిడికి ఒక సంకేతం. డీప్ వీన్ థ్రోబోసిస్, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రో, డయాబెటిస్, ఆర్ధరైటిస్, గౌట్, వేరికోస్ వీన్స్, మిరయు నర్వెస్ డ్యామేజ్ వంటి కొన్ని నిర్ధష్టమైన వైద్య పరిస్థితుల్లో కూడా కాళ్లు నొప్పులు ఉంటాయి.

కాళ్లనొప్పులున్నప్పుడు నొప్పి తీవ్రంగా లేదా కొద్దిగా ఉంటుంది. ఇది కొద్ది రోజుల పాటు ఉంటుంది. లేదా కొందరిలో తగ్గిపోతుంది. కాళ్లనొప్పుల నివారణకు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మరియు నొప్పి ఉన్న కాలు మీద ఎక్కువ బరువు మోకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు, హోం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. హోం రెమెడీస్ తీసుకొన్న తర్వాత కూడా నొప్పి అలాగే బాధిస్తుంటే డాక్టర్ ను తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది.

కోల్డ్ కంప్రెసర్:

కోల్డ్ కంప్రెసర్:

శారీరక స్థితి మీద ప్రభావం చూపుతుంది. కాళ్ల నొప్పులును ప్రారంభమైనప్పుడే కోల్డ్ కంప్రెసర్ ను అప్లై చేయాలి. ఇది నొప్పి తగ్గించడంతో పాటు సలుపును తగ్గిస్తుంది. వాపు మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది.ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కలు వేసి ఒక రోజులో రెండు మూడు సార్లు నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

మసాజ్:

మసాజ్:

మజిల్ డ్యామేజ్ వల్ల వచ్చే కాళ్ల నొప్పి నుండి సత్వరం ఉపశమనం కలిగిస్తుంది మసాజ్. దాంతో పాటు బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపరిచి ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది . నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా గోరువెచ్చని ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మరియు ఆవనూనె వేసి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక రోజులో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

కాళ్లనొప్పికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మరియు వివిధ రకాల ఔషధ గుణాలుండుట వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లా చేసి కాలుకు అప్లై చేసి మర్దన చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . అలాగే వేడి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని త్రాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కాళ్లలో నొప్పులను తగ్గిస్తాయి . ముఖ్యంగా ఇది ఆర్ధరైటిస్ మరియు గౌట్ పెయిన్ నివారిస్తాయి. ఇది ఆల్కలైజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండటం వల్ల రక్తంలోని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించడానికి సహాయపడుతాయి . బాత్ టబ్ లో అన్ ఫిల్టర్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, ఆ నీటిలో కాళ్లను డిప్ చేసి అరగంట పాటు అలాగే ఉంచితే కాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఎప్సమ్ సాల్ట్ నీటిలో డిప్ చేయడం:

ఎప్సమ్ సాల్ట్ నీటిలో డిప్ చేయడం:

ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది నాడికణవ్యవస్థను క్రమబద్దం చేసే ఎలక్ట్రోలైట్ సహాయపడుతాయి . ఇది నేచురల్ మజిల్ రిలాక్సెయెంట్ గా సనిచేస్తుంది . నొప్పి , ఇన్ఫ్లమేషన్ మరియు వాపు తగ్గిస్తుంది. బాత్ వాటర్ లో ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలియబెట్టి ఆ నీటిలో కాళ్లను ముంచి 15నిముషాల వరకూ అలాగే ఉంచాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టార్ట్ చెర్రీ జ్యూస్ :

టార్ట్ చెర్రీ జ్యూస్ :

కాళ్లనొప్పికి మరియు మజిల్ సోర్ నెస్ కు కు ఉపశమనం కలిగించే వాటిలో టార్ట్ చెర్రీ జ్యూస్ ఉత్తమమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . టార్ట్ చెర్రీ జ్యూస్ కణాల డ్యామేజ్ ను మరియు నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి 1/2కప్పు టార్ట్ చెర్రీస్ పండ్లును తినాలి. లేదా 1కప్పు జ్యూసును రోజూతీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి నొప్పిని మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది . ఇంకా ఇది బ్లడ్ సర్క్యులేషన్ మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కండరాల నొప్పి తగ్గిస్తుంది . కాళ్ల నొప్పి ఉన్న చోట జింజర్ ఆయిల్ ను అప్లై చేసి మసాజ్ చేయాలి. మరియు జింజర్ టీని రోజూ రెండు మూడు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు శరీరంలో పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.ఆముదం మరియు నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి రోజులో రెండు మూడు సార్లు త్రాగాలి.

 విటమిన్ డి:

విటమిన్ డి:

శరీరంలో విటమిన్ డి లోపం ఉన్న వారిలో కూడా కాళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్ మరియు బాడీ పెయిన్స్ మరియు తొడల నొప్పులుంటాయి. విటమిన్స్, క్యాల్షియం మరియు ఫాస్పరస్ వంటి రెండు రకాల మినిరల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇవి నాడీవ్యవస్థకు మరియు కండరాల నొప్పికి చాలా అవసరం అవుతాయి. అలాగే రోజూ ఉదయం ఎండలో ఉండటం, మరియు విటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

పొటాషియం :

పొటాషియం :

శరీరంలో పొటాషియం లోపించడం వల్ల కూడా కాళ్లనొప్పులుంటాయి. పొటాసియం నాడీవ్యవస్తకు కండరాల బలోపేతానికి అత్యంత అవసరమయినది పొటాషియం. అలాగే డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది: పొటాసియం అధికగా ఉన్న ఆహారాలు ఎక్కుువగా తీసుకోవాలి. బంగాళదుంప, అరటిపండ్లు, ప్లమ్స్, ప్రూనేజ్యూస్, మరియు టమోటో జ్యూస్ వంటివి తీసుకోవాలి.

English summary

Top 10 Home Remedies for Leg Pain: Health Tips in Telugu

Leg pain is a common problem, experienced by people of all ages. Pain can range from a dull ache to severe stabbing sensations. It can occur in one or both legs. Some leg pain may be simply uncomfortable and annoying, whereas severe pain can affect your mobility or make it difficult to put weight on your leg. Other symptoms may include weakness, numbness or a tingling sensation.
Story first published: Monday, November 16, 2015, 16:24 [IST]
Desktop Bottom Promotion