For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉచితంగా పొందే ఎండతో ఎన్నో ఉచితమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

|

సాధారణంగా చాలా మంది బయటకెళ్ళలంటే చాలు గొడుగు తప్పనిసరిగా వారిచేతిలో ఉండాల్సిందే. అది వేసవైనా లేదా ఇతర కాలాలైన సరే. కొద్దిగా ఎండను తమ శరీరంపై పడనివ్వరు. దాంతో వారి శరీరానికి విటమిన్ డి లోపిస్తుంది. ఎండను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్ అందదు. పేరుకు 'డి' విటమిన్‌ అంటూ ఏకవచనంలో సంబోధించినా అది కొన్ని రసాయనాల సమ్మేళనం. విటమిన్‌ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు విభిన్న రసాయనాల సమస్తాన్ని కలగలిపి 'డి' విటమిన్‌ అంటారు. ఇందులో డి3 అనేది చాలా ముఖ్యమైనది.

మన శరీరానికి విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత ఏంటి

ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించటం..ఊబకాయం.. ధూమపానం.. వీటన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్‌-డి' అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా... ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా... నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపో తోంది. ఫలితం.. ఎంతో మందిలో ఎంతోకొంత విటమిన్‌-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్‌-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా... ఇది అస్సలు మంచి పరిణామం కాదు.

ఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలు

'డి' విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో క్యాల్షియమ్‌ కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్ లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి, వివిధ రకాల అనారోగ్యాల భారీన పడటానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే..!!

విటమిన్ డి లోపం.. ఆరోగ్యానికి శాపం..

శరీరం మీద ఎంతగా ఎండ పడితే ఆరోగ్యాన్ని అంతగా పొందవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు జీవశక్తికి నిధినిక్షేపము. సూర్యకాంతికి దూరమైనవారు తేజో హీనులు, రోగగ్రస్తులవుతారు. ఆరోగ్యభాగ్యాన్ని పొందగోరేవారు ఎండలో బాగా తిరుగుతూ ఎండ శరీరంపై పడేటట్టు చేసుకోవాలి. మరి శరీరం మీద తగినంత ఎండ పడటం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

గాఢనిద్ర:

గాఢనిద్ర:

ఒక రోజుకు మీరు ఎన్నిగంటలు నిద్రపోతారన్నది చాలా అవసరం. మన శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రుల్లో నిద్రపోవడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. సూర్యరశ్మి ప్రభావం వల్ల మన శరీరంలో పగలు మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల అవదు. రాత్రుల్లో మాత్రమే అవుతుంది. అందుకే రాత్రుల్లో బాగా నిద్రపడుతుంది.

బరువు తగ్గడానికి:

బరువు తగ్గడానికి:

సూర్యరశ్మి వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం , ఉదయం సూర్యదోయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరం యొక్క బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అది కూడా మీకు సరైన నిద్రపొందడం కూడా ఒక రకంగా సమాయడపుతుంది. అందుకు మీ బరువును కూడా సరిగా మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం సన్ లైట్ మరియు బిఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్)కు మద్య అవినాభావ సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు.

వింటర్ డిప్రెషన్ తో పోరాడుతుంది:

వింటర్ డిప్రెషన్ తో పోరాడుతుంది:

ఇది మీరు ఏ ప్రదేశంలో నివసిస్తున్నారో, ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రోజులో ఎక్కువ సమయంలో డార్క్ గా ఉంటుందో, ముఖ్యంగా మలేషియాలో వంటి ప్రదేశంలో వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. దాంతో చాలా త్వరగా డిప్రెషన్ కు లోనవుతుంటారు. ఈ సమస్యకు చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ నేచురల్ సన్ లైట్.

హెల్తీ బోన్స్:

హెల్తీ బోన్స్:

సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి మరో ముఖ్య ప్రయోజనం ఎముకలకు కావల్సినంత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం శోషణ చెందడానికి సహాయపడుతుంది. నేచురల్ సన్ లైట్ వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డిని సాల్మన్ చేపల్లో మరియు ఫోర్టిఫైడ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా కనుగొనపబడినది. అయితే సన్ లైట్ లో ఉండటం వల్ల చాలా సులభంగా మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

ఇతర రోగాల నుండి రక్షణ కల్పిస్తుంది:

ఇతర రోగాల నుండి రక్షణ కల్పిస్తుంది:

తాజా పరిశోధన ప్రకారం శరీరంలో సరిపడా విటమిన్ డి ఉన్నట్లైతే అది కొన్నిప్రమాధకరమైన జబ్బులు హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ వంటి వాటిని రక్షణ కలిగిస్తుంది . కాబట్టి, ఈ నేచురల్ విటమిన్ డి ని సన్ లైట్ నుండి పొందవచ్చు. ఇది విటమిన్ డి సప్లిమెంట్ కంటే చాలా ఎక్కువ విలువలు కలిగి ఉంటుంది.

అటోఇమ్యూన్ డిసీజ్ ను నివారిస్తుంది:

అటోఇమ్యూన్ డిసీజ్ ను నివారిస్తుంది:

సూర్యరశ్మి వల్ల మన ఆరోగ్యానికి మరొక అద్భుతమైన ప్రయోజనం ఆటో ఇమ్యూన్ డీసీజ్ నుండి మనల్ని రక్షిస్తుంది . సూర్య రశ్మిలోని యూవిరేస్ హైపరాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ నివారించడానికి సహాయపడుతుంది. దాంతో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ను కూడా నివారించడానికి సహాయపడుతుంది.

రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది:

రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది:

రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమంలోని బీటా కణాల మీద పని చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగుతుండేలా చేస్తుంది. ఇన్సులిన్‌ తయారు చేసే కణాల విభజననూ నియంత్రిస్తుంటుంది. శరీర కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చూడటంలో కూడా దీనిది కీలక పాత్ర. చిన్న పిల్లల్లో టైప్‌-1 మధుమేహం రావటానికి విటమిన్‌-డిలోపమూ ఒకప్రధాన కారణమని గుర్తించారు. దీనిపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి.

 క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతుంది:

క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతుంది:

శరీరంలో కణ విభజనను నియంత్రిస్తుంటుంది. ఇది లోపించి కణ విభజన శ్రుతి తప్పితే.. పరిస్థితి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా విటమిన్‌-డిలోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేటు గ్రంధి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి స్థాయిలు సజావుగా ఉండేలా చూసుకోవటమన్నది క్యాన్సర్ల నివారణలో కూడా ముఖ్యమైన అంశం.

ఓబేసిటి:

ఓబేసిటి:

చాలా మంది ఎండలకు ఎండ వేడిమికి, అధిక ఉష్ణోగ్రతలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతుంటారు. ఎండలను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్‌ అందక ఊబకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

మరికాస్త ఎండ తగలనివ్వండి! :

మరికాస్త ఎండ తగలనివ్వండి! :

రోజులో ఎంత సమయం ఎండలో నిలబడితే మన శరీరానికి సరిపడినంత విటమిన్‌-డి తయారవుతుందన్నది కీలకమైన ప్రశ్నేగానీ దీనికి స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. చర్మం కింద కొలెస్ట్రాల్‌ నుంచి ఈ 'కోలీ కాల్సిఫెరాల్‌' తయారవ్వటానికి తెల్లటి చర్మం గల పాశ్చాత్య దేశీయులు సుమారు 20-30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా ఉండాలని గుర్తించారు. అదే మనం, నల్లజాతీయులు దానికి ఆరు రెట్లు ఎక్కువ సమయం సూర్యరశ్మిలో నిలబడితేనేగానీ ఆ మాత్రం విటమిన్‌-డి తయారవ్వదని తేలింది. ఇది పూర్తిగా సాధ్య మయ్యే విషయం కాదు. కానీ రోజులో కొన్ని గంటలపాటైనా సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట గడప టం అన్ని విధాలా శ్రేయస్కరం.

English summary

TOP 10 Reasons Why Sunlight Is Good For Health

The health benefits of sunlight are not concentrated only on Vitamin D, though this is one of the most important benefits of sunlight. However, receiving extreme amount of sunlight can lead to other problems such as heat stroke and sometimes even death.
Story first published:Saturday, December 26, 2015, 17:13 [IST]
Desktop Bottom Promotion