For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని రకాల జీర్ణసమస్యలకు ఒకటే మార్గం: ఫైబర్ రిచ్ ఫుడ్

By Super
|

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలలో సాధారణంగా కనిపించే లక్షణాలు అజీర్తి, గ్యాస్, తేన్పులు, కడుపు నొప్పి, కడుపులో మంట, మలబద్దకం, విరేచనాలు. ఒక్కోసారి మలంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్దకం, బరువు తగ్గటం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి పనితీరు వల్ల కూడా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరిలో రోజువారి విరేచనాలు సాఫీగా జరగవు. దీనినే మలబద్దకం అంటారు. విరేచనం అయిన తరువాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం మలబద్దకం లక్షణమే.

READ MORE: జీర్ణక్రియకు హాని కలిగించి, హార్ట్ బర్న్, ఎసిడిటికి గురిచేసే10 ఆహారాలు

దీన్ని బట్టి చూస్తే జీర్ణక్రియ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక కీలక ప్రక్రియ జరుగుతుందని తెలుస్తున్నది. మనం తీసుకొన్న ఆహారం విచ్చిన్న చేసి జీర్ణం అయ్యే లా చేసి శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందివ్వడంలో కీలకపాత్రను పోషిస్తుంది. జీర్ణవ్యవస్తు శరీరంలో ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మనం తీసుకొనే ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే అది మాల్ న్యూట్రీషిన్ గా మారుతుంది. ఒత్తిడి, సరైన ఆహారా అలవాట్లు లేకపోవడం, వైరల్ వ్యాధులతో, పరాన్నజీవులు మరికొన్ని మందులు జీర్ణ వ్యవస్థ మీద నెగటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి .

READ MORE: తిన్న ఆహారం జీర్ణం కావడం లేదా..? మరైతే భోజనంతో పాటు ఇవి తినండి....

ఒక వేళ మనం తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వనప్పుడు, అది రక్తంలోకి షోశింపబడి, మాల్ న్యూట్రీషియన్ గా మార్పుచెందుతుంది. ముఖ్యంగా అజీర్తి వల్ల చాల అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు, పొట్ట నిండుగా ఉన్నట్లు, వికారం మరియు వాంతులకు దారి తీస్తుంది. ప్రస్తుత రోజుల్లో అజీర్తి చాలా సాధారణ సమస్యగా మారుతున్నది ఈ సమస్యను నివారించుకోవడానికి ఏదో ఒక హోం రెమెడీని వెతుకుతూనే ఉంటారు. అయితే అజీర్తిని నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. తాజా పండ్లు మరియు కూరగాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇవి డైజెషన్ ప్రొసెస్ ను మెరుగుపరుస్తుంది . అలాగే బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది.

మరి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ....

1. అల్ల:

1. అల్ల:

వివిధ రకాల జీర్ణాశయ రుగ్మతలను నివారిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణాశయంలో గ్యాస్, అజీర్తి, వికారం మరియు కడుపుబ్బరాన్ని నివారిస్తుంది . కాబట్టి, మంచి ఫలితం పొందాలంటో రోజులో రెండు కప్పులు జింజర్ టీని త్రాగాలి.

2. పెప్పర్ మింట్:

2. పెప్పర్ మింట్:

పుదీనాలో ఉండే యాంటీ ఆన్ఫ్లమేటీరి లక్షనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది . ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పెప్పర్ మింట్ ఆయిల్ ను వేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

3. పెరుగు:

3. పెరుగు:

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. దాంతో అజీర్థి, డయోరియా మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.

4. అవొకాడో:

4. అవొకాడో:

అవొకాడో లో ఫైబర్ మరియు అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ ఫ్రూట్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది ప్యాంక్రీస్, లివర్ మరియు గాల్ బ్లాడర్ యొక్క పనితీరును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

5. స్వీట్ పొటాటో:

5. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి6, మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరియు ఇది పెక్టిక్ అల్సర్ ను మరియు ఇన్ఫ్లమేటరీ బౌల్ సమస్యలను నివారించడలో గ్రేట్ పెప్టిక్ అల్సర్ మరియు ఇన్ఫ్లమేటరీ బౌల్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఓట్స్:

6. ఓట్స్:

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది . ఇది బౌల్ మూమెంట్ మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. దాంతో మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. ఇంకా హార్ట్ బర్న్ మరియు జీర్ణాశయాంతర అసౌకర్యాన్ని నివారిస్తుంది.

7. ఆపిల్స్ :

7. ఆపిల్స్ :

భోజనం చేసిన తర్వాత ఒక ఆపిల్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆపిల్స్ లో ఉండే ఫొల్లెట్, విటమిన్ సి, మరియు విటమిన్ ఎ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో పొటాసియం, మెగ్నీషియం వంటి మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాదు ఇందులో ఉండే పెక్టిన్ అనే అంశం ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ మెరుగ అవ్వడానికి సహాయపడుతుంది.

8. ఆరెంజ్, కలబంద మరియు స్పినాచ్ స్మూతీ:

8. ఆరెంజ్, కలబంద మరియు స్పినాచ్ స్మూతీ:

ఈ జ్యూస్ లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి, ఇది పొట్టలో అసిడ్ కు పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది . ఇది మలబద్దకాన్ని నయం చేసి డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది . మరియు ఇది అల్సర్ మరియు అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది.

9. క్యాబేజ్, పుదీనా మరియు పైనాపిల్ స్మూతి:

9. క్యాబేజ్, పుదీనా మరియు పైనాపిల్ స్మూతి:

ఈ స్మూతీ ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . వీటిలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఫోలిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగ్గా ుంచుతుంది.

10. అరటిపండ్లు:

10. అరటిపండ్లు:

అరటిపండ్లు నార్మల్ బౌల్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది . అందువల్ల వీటిని ఉదయం పరగడపున తినడం లేదా భోజనం తర్వాత తినడం మంచిది . ఏవిధంగా తీసుకొన్నా, తిన్న ఆహారంను సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

11. బొప్పాయి:

11. బొప్పాయి:

మీరు తిన్న ఆహారం 24గంటల్లో జీర్ణం అవ్వడాినకి పచ్చిబొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లూజ్ మోషన్ అయినప్పుడు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది. మరియు బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ గా విచ్చిన్నమై, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

English summary

Top 11 Super Foods That Promote Digestion

Digestion is a crucial process that improves the overall health of the body. Our digestive system helps in breaking down the foods that we eat into the nutrients that our body requires.
Story first published: Friday, November 27, 2015, 9:36 [IST]
Desktop Bottom Promotion