For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు నొప్పికి ఉపశమనం కలిగించే ఉత్తమ హోం రెమెడీలు

కడుపు నొప్పికి ఉపశమనం కలిగించే ఉత్తమ హోం రెమెడీలు

|

కడుపు నొప్పి గురించి వినే ఉంటారు. అయితే, కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటి అనేగా మీ సందేహం? అజీర్తి, ఎసిడిటి, మలబద్దకం, ఫుడ్ అలర్జీ, పొట్టలో గ్యాస్, ఫుడ్ పాయిజన్, అల్సర్ , ప్రేగులో అపెండిసైటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ మొదలగునవి కడుపునొప్పి కారణాలు కావచ్చు.

పొట్ట ఉదరంలో ఏ భాగంలో అయినా వ్యాధి సోకినప్పుడు, పొట్ట ఉదరంలో నొప్పి వస్తుంది. నొప్పి ఎలాంటిదైనా అరికట్టడానికి స్టొమక్ పెయిన్ నివారించడానికి కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొనే ముందు కడుపు నొప్పికి కొన్ని లక్షణాలు బహిర్గతం అవుతాయి. అవేంటంటే...

పొట్టలో నొప్పి అనిపించినప్పుడు కొన్ని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, జ్వరం, వాంతి, పొట్ట తిమ్మెర్లుగా లేదా పొట్టలో వాపు వంటి లక్షణాలు కనబడుతాయి . పొట్ట ఉదర భాగంలో ఏ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకినా ఇది పొట్టనొప్పికి దారితీస్తుంది.

పొట్టనొప్పితో పాటు ఇతర లక్షణాలు జ్వరం వంటి లక్షనాలు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం. కానీ కడుపు నొప్పికి కారణం అజీర్తి, హైపర్ ఎసిడిటి, మలబద్దకం, గ్యాస్ మరియు అల్సర్ వంటి కారణం అయితే వాటకి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి...

కడుపునొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే బెస్ట్ హోం రెమెడీస్


ఇంట్లోనే మనం కడుపు నొప్పిని తగ్గించుకోవడం ఎలా? అందుకోసం తెలుగు బోల్డ్ స్కై. కామ్ మీకోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ పరిచయం చేస్తున్నది. వీటిని పరిశీలించి పొట్టనొప్పి నుండి ఉపశమనం పొందండి...

అల్లం

అల్లం

ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . మరియు ఇది వికారం, మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది . దీనికి కొద్దిగా తేనె కూడా చేర్చి తీసుకోవచ్చు.

గోరువెచ్చని ఉప్పు నీరు

గోరువెచ్చని ఉప్పు నీరు

స్టొమక్ అప్ సెట్ నివారించడానికి ఈ చిట్కా గ్రేట్ గా సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, ఆ నీటిని త్రాగాలి . ఇది స్టొమక్ అప్ సెట్ ను తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . స్టొమక్ పెయిన్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ మార్గం.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

పొట్టనొప్పి నుండి ఉపశమనం కలిగించే చిట్కాల్లో యాపిల్ సైడర్ వెనిగర్ ను . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు ఇది విటమిన్స్ మరియు మినిరల్స్ ను గ్రహిస్తుంది. మరియు ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపు నొప్పి నివారించడంలో చాలా గ్రేట్ గా సమాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి దీన్నీ రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.

తాజా పుదీనా జ్యూస్

తాజా పుదీనా జ్యూస్

అజీర్తిని, వికారాన్ని మరియు వాంతులను నివారించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. స్టొమక్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను నోట్లో వేసుకొని బాగా నమిలి మ్రింగాలి. తిన్న తర్వాత పొట్టనొప్పి నుండి ఉపవమనం కలిగిస్తుంది.

లెమన్ వాటర్

లెమన్ వాటర్

స్టొమక్ పెయిన్ నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా వికారం మరియు వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది . మూడు చెంచాలి నిమ్మరసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి రోజులో మూడు సార్లు త్రాగాలి.

చమోమెలీ టీ

చమోమెలీ టీ

కడుపు నొప్పి నివారించుకోవడానికి చమోమెలీ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది పొట్టకు ప్రశాంతతను చేకూర్చుతుంది. ఇది కడుపు నొప్పి మరియు పొట్ట తిమ్మెరలను నివారిస్తుంది. ఈ టీకి కొద్దిగా ినమ్మరసం జోడించుకోవాలి.

యాలకల విత్తనాలు

యాలకల విత్తనాలు

అజీర్తి, వికారం, వాంతులు మరియు పొట్టనొప్పి నివారించే చిట్కాల్లో ఉత్తమమైనది యాలకల విత్తనాలు టీలో వేసి బాగా మరిగించి తీసుకోవాలి . అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి మరిగించి రోజులో మూడు సార్లు తీసుకోవాలి.

కలబంద రసం:

కలబంద రసం:

కలబందలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇది ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది మరియు ఇంటర్నల్ బ్లీడింగ్ ను నివారిస్తుంది. ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్దకంను నివాిరస్తుంది. స్టొమక్ పెయిన్ మరియు క్రాంప్స్ ను నివారిస్తుంది . ఒక గ్లాసు నీళ్ళలో అలోవెరా జ్యూస్ ను మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం త్రాగాలి.

అజ్వైన్ సీడ్స్

అజ్వైన్ సీడ్స్

పొట్టనొప్పి నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. కొన్ని అజ్వైన్ విత్తనాలను ఉడికించి ఆ నీటిని త్రాగడం వల్ల పొట్టనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ద్రవాన్ని భోజనానికి ముందు తీసుకోవాలి.

సోంపు:

సోంపు:

ఇది పొట్టనొప్పి, పొట్ట ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . వేడి నీటిలో కొద్దిగా సోంపు మరియు నిమ్మరసం మిక్స్ చేసి, భోజనానికి ముందు తీసుకోవడం ద్వారా అజీర్తిని నివారిస్తుంది మరియు పొట్టనొప్పిని అరికడుతుంది.

బ్లాండ్ ఫుడ్స్

బ్లాండ్ ఫుడ్స్

కారం ఉన్న ఆహారాలను పూర్తిగా తినకుండా ఉండాలి. అలాగే కొన్ని ఆయిల్ ఫుడ్స్ ను నివారించాలి. కడుపునొప్పికి ఇవి కూడా ఒక కారణం. కాబట్టి, చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

హీట్ కంప్రెసర్:

హీట్ కంప్రెసర్:

పొట్ట నొప్పిగా ఉన్న ప్రదేశంలో హాట్ బాటర్ బాటిల్ లేద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టడం ద్వారా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 5నిముషాలు అలాగే ఉంచి, తర్వాత తిరిగి ఇదే ప్రొసెస్ ను చేయాలి.

English summary

Top 12 Home Remedies For Stomach Pain

Pain in the stomach may be caused by different reasons such as indigestion, acidity, constipation, food allergy, gases in stomach, food poising, diarrhea, ulcers in stomach or intestines, appendicitis, stones in gall bladder, kidney stones etc.
Desktop Bottom Promotion