For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయి ఆకులో మనకు తెలియని ఆరోగ్య రహస్యాలెన్నో..ఎన్నెన్నో...

ఫ్లోరిడా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేసిన పరిశోధనల్లో క్యాన్సర్‌, ముఖ్యంగా గర్భాశయ, ప్రోస్టేట్‌, కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించే గుణాలు బొప్పాయిలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రస్త

|

బొప్పాయి ఒక వండర్ ఫుల్ స్వీట్ ఫ్రూట్ . ఇది మనకు నేచర్ ప్రసాధించిన ఒక వరం. బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా బొప్పాయి చెట్టు ఆకుల్లో మనకు తెలియని మరెన్నో ఔషధగుణాలున్నాయి . బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉన్నాయి . వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రీషియన్స్ బొప్పాయి ఆకులలో అద్భుతంగా ఉన్నాయి . బొప్పాయి ఆకులో వున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. బొప్పాయి ఆకుల్లోవిటమిన్ ఎ, బి, సి, డి మరియు ఇ, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రాణాంతక క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ అటాక్ సమస్యల భరతం పట్టే బొప్పాయ సీడ్స్

చాలా మంది బొప్పాయి గురించి తెలుసు కానీ బొప్పాయి ఆకులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలియదు. ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఆదివాసీలు ఎక్కువగా బొప్పాయి ఆకులను ఔషధాలు వాడతారు. బొప్పాయి ఆకుల్లోని ఔషధ గుణాల గురించి జపాన్‌లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేసిన పరిశోధనల్లో క్యాన్సర్‌, ముఖ్యంగా గర్భాశయ, ప్రోస్టేట్‌, కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించే గుణాలు బొప్పాయిలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రస్తుత రోజుల్లో బొప్పాయి ఆకులకు చాలా పాపులారిటి పెరుగుతున్నది. కార్డియో వాస్కులర్ డిసీజ్ నుండి ప్రేగుల్లోని పరాన్న జీవులను నివారించడం వరకూ చాలా గొప్పగా సహాయపడుతుంది.

ఉదర సంబంధ జబ్బులను మటుమాయం చేసే బొప్పాయి

అంతే కాదు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . మన శరీరానికి అవసరం అయ్యే వ్యాధినిరోధక శక్తిపెంచుతుంది . ప్రాణాంతక, క్యాన్సర్, డేంగ్యును నివారిస్తుంది. బొప్పాయి ఆకులను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇది కొద్దిగా చేదుగా ఉన్నా, దీన్ని ఇతర ఫ్రూట్ జ్యూసులతో కలిపి తీసుకోవచ్చు . బొప్పాయి ఆకుల రసాన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మరియు దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని మనకు తెలియని అనేక అనారోగ్య సమస్యలనుండి రక్షిస్తుంది. మరి బొప్పాయి ఆకుల వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి..

1. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి..

బొప్పాయిలో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం బొప్పాయి ఆకుల్లో యాంటీక్యాన్సేరియస్ గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాక్రియాటిక్, లివర్ మరియు లంగ్ క్యాన్సర్ లకు కారణం అయ్యే వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో ఈ ఆకులుగ్రేట్ గా సహాయపడుతాయి.

2. బ్యాక్టీరియా డెవలంప్ కాకుండా నిరోధిస్తుంది:

2. బ్యాక్టీరియా డెవలంప్ కాకుండా నిరోధిస్తుంది:

బొప్పాయి ఆకులో దాదాపు 50 యాక్టివ్ పదార్థాలు ఉన్నాయి . ముఖ్యంగా కార్పిన్ అనే కంటెంట్ ఫంగస్, వార్మ్స్, పరాన్నజీవులు మరియు ఇతర క్యాన్సర్ సెల్స్ వంటి అతి సూక్ష్మక్రిములు శరీరంలో వ్రుద్ది కాకుండా నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

3. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

3. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడే గుణాలు బొప్పాయి ఆకులో మెండుగా ఉన్నాయి . ఇది కోల్డ్ మరియు ఫ్లూ వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ మరియు ప్లేట్ లెట్స్ ను పునరుత్పత్తి చేస్తుంది.రోగనిరోధకశక్తిని పెంచడానికి బొప్పాయి ఆకులు ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు, ఫినిలాలైన్‌, లైసిన్‌, హిస్టిడైన్‌, టైరోసిన్‌, అలనిన్‌ వంటి ఎంజైమ్స్‌ యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తాయి.

4. యాంటీ మలేరియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:

4. యాంటీ మలేరియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:

బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . చాలా ఎఫెక్టివ్ గా మలేరియాను నివారిస్తుంది . బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల మలేరియా లక్షణాలను నివారిస్తుంది.

5. డేంగ్యూ నివారిస్తుంది:

5. డేంగ్యూ నివారిస్తుంది:

డేంగ్యును నివారించడంలో ఒక ట్రెడిషినల్ పద్దతి. బొప్పాయి ఆకుల రసాన్నిత్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డేంగ్యూను నివారించుకోవచ్చు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది. బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది మరియు డేంగ్యు వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

6. మెనుష్ట్యువల్ పెయిన్ నివారిస్తుంది:

6. మెనుష్ట్యువల్ పెయిన్ నివారిస్తుంది:

బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ఇది మెనుష్ట్ర్యువల్ పెయిన్ ను నివారిస్తుంది . ఒక బొప్పాయి ఆకును తీసుకొని, దానికి ఉప్పు, కొద్దిగా చింతపండు మిక్స్ చేసి , నీళ్ళు పోసి బాగా ఉడికించాలి . ఈనీరు చల్లబడిన తర్వాత, చల్లార్చి, వడగట్టి త్రాగాలి . మెరుగైన ఫలితాన్ని మీరే గమనిస్తారు.

7. బ్లడ్ ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది :

7. బ్లడ్ ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది :

బొప్పాయి ఆకులు బ్లడ్ ప్లేట్ లెట్ పెంచే శక్తిసామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ బొప్పాయి ఆకు బ్లడ్ కౌంట్ ను చాలా వేగంగా పెంచుతుంది . ప్రతి రోజూ రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను నేచురల్ గా పెంచుతుంది.

8. టాక్సిన్స్ నివారిస్తుంది:

8. టాక్సిన్స్ నివారిస్తుంది:

సాధారణంగా దొరికే బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే చాలా మంచిది. ఇది శరీరంలోని విషపదార్థాను తొలగిస్తుంది. అంతేకాదు... వళ్లు నెప్పులను, తొందరగా అలిసిపోవడం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్యను కూడా పెంచుతుంది.

9. హై ఫీవర్ ను తగ్గిస్తుంది:

9. హై ఫీవర్ ను తగ్గిస్తుంది:

బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది.

10. హార్ట్ రిలేటెడ్ సమస్యలను నివారిస్తుంది:

10. హార్ట్ రిలేటెడ్ సమస్యలను నివారిస్తుంది:

ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.అజీర్ణం, గుండెల్లో మంట సమస్యతో బాధపడేవారికి బొప్పాయి ఆకుల్లో ఉంటే ఆమ్లాలు ఉపశమనం ఇస్తాయి.

11. చర్మ సమస్యలను నివారిస్తుంది:

11. చర్మ సమస్యలను నివారిస్తుంది:

బొప్పాయి ఆకులు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి మొటిమలున్న చోట రాయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేస్తే.. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మవ్యాధులను నివారించే గుణం బొప్పాయిలో ఉంది.

12. ఎముకలను బలోపేతం చేస్తుంది

12. ఎముకలను బలోపేతం చేస్తుంది

ఎముకలు దృఢంగా మారడానికి వీటిలో ఉండే కాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ కె ఉపయోగపడుతాయి. ఎముకలను బలోపేతం చేసే విటమిన్ డి కూడా ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

English summary

Top 12 Unknown Health Benefits Of Papaya Leaves

Papaya is a wonder fruit that nature has blessed us with. Papaya has myriad benefits for the skin and health. Even the leaves of papaya have rich unknown medicinal values. The bitter-tasting papaya leaves have magnificent health values. It is rich in nutrients that can cure various health ailments. Papaya leaves are a good source of vitamins A, B, C, D and E and calcium.
Desktop Bottom Promotion