For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యాపీ మూడ్ కోసం ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోండి

By Super
|

ప్రపంచంలో మనుషులంతా ఒకే తీరులో ఉండరు. ఇందుకు వారి స్వభావాలే కారణమైనా, మారే మానసిక స్థితిని ప్రతి బింబించే ‘మూడ్స్‌' కూడా హేతువులే. నిన్నటి దాకా నవ్వుతూ మాట్లాడిన పక్కింటావిడ ఇవాళ ముఖం ముడుచుకుందన్నా, ఆఫీసులో బాస్‌ అకారణంగా తిట్టారన్నా, అత్తగారు అలిగిందన్నా, ఆడపడుచు మూతి ముడుచుకున్నా అంతా ‘మూడ్‌'మహత్యమే! ఇలా రకరకాలుగా ఎదుటివారిని వేధించి బాధించే ‘మూడ్‌' సదరు వ్యక్తులు సరిగా ఉంచుకోవడం కొన్ని పద్ధతుల ద్వారా సాధ్యమే. వీటిని చదివి వదిలేయకుండా ‘మూడ్‌' తెచ్చుకుని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది సుమా!

READ MORE: ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుట కొరకు 17 సహజ నివారణలు

మూడ్ బాగోలేనప్పుడు మరేదో మార్పును మనసు కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడు నుంచి బయటకు రావాలంటే వెంటనే మనసుకు మార్పు కావాలి. తద్వారా కొత్త ఉత్సాహం కలుగుతుంది. తరచుగా మూడ్ స్వింగ్ లా? మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణాన్ని బట్టి కూడా మారుతుంటుంది. పరిస్థితులను బట్టి మారుతుంటుంది.

READ MORE: ఒత్తిడి నుండి తక్షణ ఉపశనం కలిగించే 10 బెస్ట్ బాడీ మసాజ్...!

కారణం ఏదైనప్పటికి, మీ మూడ్ ఆనందంగా మార్చేటందుకు కొన్ని ఆహారాలు పరిశీలించండి. మంచి ‘మూడ్‌'కు మంచి ఆహారం కూడా అవసరమే. ఇవి తక్షణం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సాధారణంగా తినే ఆహారమే కాకుండా, అదనంగా కూడా వీటిని తినవచ్చు. దాంతో మనసునూ, శరీరాన్ని ఉల్లాసకరమైన ‘మూడ్‌'లోకి తెచ్చేందుకిది ఎంతో తోడ్పడుతుంది. మరి మంచి మూడ్ కు తీసుకోవల్సిన ఆహారాలేంటో చూద్దాం...

సాల్మన్:

సాల్మన్:

కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా డి విటమిన్, 180మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయి. శరీరానికి సరిపడా విటమిన్ డి గనుక లభించకుంటే ఆకలిని కలిగించే లెప్టిన్ హార్మోన్ తన విధులు సరిగా నిర్వర్తించదట. చేపలు కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే చేపలు ట్యూనా, సాల్‌మన్, స్వార్డ్‌ఫిష్, ప్లాడర్. డిప్రెషన్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎటుంటి మూడ్ లో ఉన్నా సరే సంతోకరంగా మారేందుకు ఉపయోగపడే సప్లిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనేక ప్రయోజనాలున్నాయని చెపుతారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుంది, చర్మం మెరుపు పెరుగుతుంది, జుట్టు రాలుడు తగ్గుతుంది. మంచి మూడ్ ను అందిస్తుంది. తలనొప్పి నుంచి ఒత్తిడి వరకూ ఆజీర్తి నుంచి అల్జీమర్స్ వరకు ఏ వ్యాధికైనా ఇది అద్భుతమైన మందు అంటారు చైనీయులు. ఊబకాయం నియంత్రణకు గ్రీన్ టీను మించిన ఔషుధం లేదు.

ఓట్స్:

ఓట్స్:

మీరు డైలీ కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఓట్స్ సహాయపడుతాయి. ఎందుకంటే ఓట్స్ లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి . ఇవి స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గిస్తాయి.

జీడిపప్పు:

జీడిపప్పు:

ఇటీవలి కాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ లో వున్న లాభాలను గ్రహించారు. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. వాల్ నట్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. మెగ్నీషియం వుంటుంది. ఇవి శరీరంలో సెరోటోనిన్ స్ధాయి పెంచుతాయి. అందుకనే డిప్రెషన్ కలిగి వున్న వారికి మెగ్నీషియం అధికంగా వుండే విటమిన్లు, మినరల్స్ ఇస్తారు. ఈ సూక్ష్మ పోషకాలు నెగెటివ్ మూడ్ ను, నిద్ర సమస్యలను, సాధారణంగా వచ్చే చికాకు, కోపం వంటివాటిని తగ్గిస్తాయి.

కోకనట్ మిల్క్:

కోకనట్ మిల్క్:

కొబ్బరికాయలో మధ్యస్థ-చెయిన్ ట్రిగ్లేసెరైడ్స్ ఉన్నాయి. ఇవి మంచి మనోభావాలు పెంపొందించటానికి దోహదం చేసే ప్రత్యేక క్రొవ్వు పదార్థాలు మరియు మనిషి మెదడు సాధారణ ఆరోగ్యానికి మంచివి.

నట్స్:

నట్స్:

బాదంలో అత్యధికంగా విటమిన్లు కలిగి ఉండి, మీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది . అలాగే ఇది హెల్తీ బ్రెయిన్ ఫుడ్. గుప్పెడు బాదం పప్పులు తీసుకోవడం వల్ల మీ మూడ్ ను పెంచుతుంది.

పెరుగు

పెరుగు

ఈ ఆహారం ప్రత్యేకించి మహిళలకు నెలసరి పిరీయడ్స్లో సమస్యలకు మనోభావనల మార్పుకు బాగా పనిచేస్తుంది. పెరుగులోని కాల్షియం, శరీరంలోకి ఇతర ఆహారాలను బాగా పీల్చుకునేలా చేస్తుంది. మహిళలలో హార్మోన్ల మార్పు జరిగేటపుడు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ బేలన్స్ మారుతుంది. దానితో జీవక్రియ తగ్గుతుంది. కాల్షియం కనుక చేరిస్తే అది హార్మోన్ల బ్యాలన్స్ కాపాడుతూ, సరైన రీతిలో వారి నరాల వ్యవస్ధను పనిచేయించి వారు మూడ్ స్వింగ్ లకు, ఏడ్పులకు దూరం వుండేలా చేస్తుంది.

క్యారెట్:

క్యారెట్:

బీట్ రూట్ వలె క్యారెట్ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. క్యారెట్స్ లో బీటాకెరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎనర్జీని అంధిస్తాయి మరియు మెదడకు కూడా మంచి ఆహారం.

బెర్రీస్:

బెర్రీస్:

మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి తక్షణమే భావాలను మార్చేస్తాయి. బ్లాక్ బెర్రీస్ విటమిన్ సి మరియు ఇ వల్ల పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ వల్ల ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇందులో మూడ్ ను మార్చే యాంథోసియనిడ్స్ పుష్కలంగా ఉండి, బ్రెయిన్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ మన శరీరంకు అవసరం అయ్యే విటమిన్ బి మరియు సిని అందిస్తాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కు బూస్ట్ వంటివి.

రా పెప్పర్(క్యాప్సికమ్):

రా పెప్పర్(క్యాప్సికమ్):

ఎర్రని లేదా గ్రీన్ క్యాప్సికమ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి స్ట్రెస్ హార్మోనులను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. ఈ విటమిన్ సి మరికొన్ని పచ్చి తాజా పండ్లు(ఆరెంజ్, దోసకాయ, బొప్పాయి మరియు కివి)లో కూడా లభ్యం అవుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కు ఉంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. వారంలో కనీసం రెండు సార్లైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ డిప్రెషన్ కు లోనుకాకుండా కాపాడీ మంచి మూడ్ లో ఉండేందుకు సహాయపడుతాయి.

ఖర్జూరం:

ఖర్జూరం:

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండు ఖర్జూరం: ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.

ఓస్ట్రెస్:

ఓస్ట్రెస్:

సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వీటిలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

ఆపిల్:

ఆపిల్:

ఆపిల్స్ లో పెక్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనిషిలో మూడ్ ను క్రమబద్దం చేస్తుంది. అలాగే ఆపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిల్లో ఉండే న్యూట్రోట్రాన్స్మీటర్స్ మీద ప్రధాణ పాత్రపోషిస్తుంది. ఆపిల్స్ స్ట్రెస్ బూస్టింగ్ ఫుడ్స్.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు-వీటిలో కూడా స్ట్రాబెర్రిస్ లాగానే ఎక్కువ పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి మెగ్నీషియంను కూడా కలిగి ఉంటాయి. అరటిపొండులో ఉన్న సహజమైన షుగర్ త్వరగా మన రక్తప్రసరణలో విడుదల అవటంవలన మనకు త్వరగా శక్తి చేకూరుతుంది. మన మానసిక స్థితిని మంచిగా ఉంచే 'కార్బోహైడ్రేట్' అరటిపండు కలిగిఉన్నది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

చాలా పరిశోధన ప్రకారం ప్రస్తుత కాలంలో చాల మంది పండ్లు, నట్స్, చేపలు, వెజిటేబుల్స్ మరియు ఆలివ్ ఆయిల్ కంటే ఫాస్ట్ ఫుడ్స్ కు, కమర్షియల్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా డిప్రెషన్ కు దారితీస్తాయి. కాబట్టి కనీసం ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరి డిప్రెసివ్ డిస్ ఆడర్ ను తగ్గిస్తుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

విటమిన్ డి:

విటమిన్ డి:

డిప్రెషన్ తో బాధపడేవారికి విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అయితే విటమిన్ డి ఆహారాలు దొరకడం చాలా కష్టం. విటమిన్ డి ఆహారాలు చాలా అరుదు. విటిమన్ డి ని సూర్య రశ్మినుండి పొందవచ్చు. లేదా డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు. విటమిన్ డీ వల్ల చెడు మూడ్ ను తొలగించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది.

నీళ్ళ:

నీళ్ళ:

నీళ్ళు బాగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. నీళ్ళను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల వ్యక్తుల యొక్క మూడ్ మారుతుంది. ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి. మెంటల్ ఫంక్షన్స్ కు ఉపయోగపడుతుంది.

English summary

Top 20 Common Foods That Improve Your Mood: Health Tips in Telugu

In today’s fast and cutthroat competitive world, depression is a common problem. It begins with little anxieties, and then spreads into a big health issue. Well, there are many things that you can do to make sure that you find your way out of such feelings as quickly and 'positively' as possible.
Desktop Bottom Promotion