For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్టీరియాతో వచ్చే చెమట వాసనను నివారించే 10 అద్భుతమైన నేచురల్ రెమెడీస్..!

బహుమూలల్లో బ్యాక్టీరియా కారణంగా వచ్చే చెమట వాసన కాకుండా, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల , డయాబెటిస్, లివర్ సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సమస్యలు, జెనెటిక్ సమస్యల వల్ల కూడా శరీరం నుండి దుర్వాసనకు క

By Lekhaka
|

చర్మ రంద్రాలు, చర్మతత్వాన్ని బట్టి చమటలు పట్టడం సహజం కొంత మందికి చెమటలు పట్టినా ఎలాంటి సమస్య ఉండదు, మరికొందరిక చెమటలతో పాటు, ఇబ్బందికరమైన దుర్వాసన కూడా వస్తుంది. బహుమూలనుండి వచ్చే చెమటలు బ్యాక్టీరియాతో కలిసినప్పుడు వేడికి భరించలేని దుర్వాసనను విడుదల చేస్తుంది.

స్నేహితుల పార్టీకో లేదా డేట్ కో వెళ్లాలనుకున్నప్పుడు, అన్ని రకాలు చిట్కాలను ప్రయత్నించి ఉంటారు.స్ట్రాంగ డియోడరేంట్స్, మరియు వివిధ రకాల ఫెర్ఫ్యూమ్స్ వాడుంటారు. కానీ అది కొద్దిసేపటి వరకూ మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి. రోజంతా తాజా ఉండవు. తిరిగి అదే పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుంది. ఇతరులతో లేదా స్నేహితులను, ప్రియులతో ఉన్నప్పుడు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో వారితో గడపడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

అటువంటి వారిలో మీరు ఒక్కరైతే, వేంటనే బహుమూలల్లో చెమట వాసనను నివారించుకోవడానికి, కొన్ని నేచురల్ రెమెడీస్ సహాయపడుతాయి. బహు మూలల్లో చెమట వల్ల వచ్చే దుర్వాసను నివారించుకోవడానికి నేచురల్ రెమెడీస్ ఉత్తమమైనవి , వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

బహుమూలల్లో బ్యాక్టీరియా కారణంగా వచ్చే చెమట వాసన కాకుండా, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల , డయాబెటిస్, లివర్ సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సమస్యలు, జెనెటిక్ సమస్యల వల్ల కూడా శరీరం నుండి దుర్వాసనకు కారణమవుతాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. అవేంటో ఒక సారి చూద్దాం..

1. యాపిల్ సైడర్ వెనిగర్ :

1. యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాతో పోరాడుతుంది, ఫ్యూయల్ స్మెల్ ను నివారిస్తుంది. కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ ను కొద్దిగా తీసుకుని అందులో కాటన్ డిప్ చేసి బహుమూలల్లో అప్లై చేయడం వల్ల చెమట వాసన నుండి ఉపశమనం పొందవచ్చు.

2. నిమ్మరసం:

2. నిమ్మరసం:

నిమ్మరసంలో అసిడిక్ స్వభావం కలిగి ఉండటం వల్ల బ్యాక్లీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది. దాంతో చంకల్లో చెడువాసన రాకుండా నివారించుకోవచ్చు. నిమ్మకాయను కట్ చేసి, దీన్ని బహుమూల్లో అప్లై చేసి మర్ధన చేయాలి.

3. రోజ్ వాటర్ :

3. రోజ్ వాటర్ :

కొన్ని చుక్కల రోజ్ వాటర్ తీసుకుని, చంకబాగంలో అప్లై చేయాలి. రోజ్ వాటర్ ను స్నానం చేసే నీటిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది బహుమూలల్లో చెమటవాసనను తగ్గిస్తుంది.

4. టమోటో గుజ్జు:

4. టమోటో గుజ్జు:

టమోటో గుజ్జు తీసుకుని సగానికి కట్ చేయాలి. గుజ్జును బహు మూలల్లో(చంక బాగంలో అప్లే చేసి, 10 నుండి 15 నిముషాలు అలాగే ఉండనివ్వాలి. తర్వాత స్నానం చేస్తే చంకల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే దుర్వాసనను నివారించుకోవచ్చు.

5. ల్యావెండర్ ఆయిల్ :

5. ల్యావెండర్ ఆయిల్ :

చెమట వాసనను నివారించుకోవడానికి ఒక బెస్ట్ నేచురల్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ , కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను చేతులకు అప్లై చేసి, రెండు చంకల్లో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసి బాడీ మీద స్ప్రే చేసుకోవచ్చు.

6. పెప్పర్మింట్ ఆయిల్:

6. పెప్పర్మింట్ ఆయిల్:

కొన్ని చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ ను తీసుకుని, సున్నితంగా బహుమూలల్లో అప్లై చేసి , మర్దన చేసుకోవాలి. మరియు కొన్ని చుక్కలు నీటిలో కలిపి, స్ప్రే బాటిల్లో వేసి బాడీ స్ప్రేగా ఉపయోగించుకోవచ్చు.

7. సాండిల్ ఉడ్ పౌడర్:

7. సాండిల్ ఉడ్ పౌడర్:

సాండిల్ ఉడ్ పౌడర్ లోని ఆరోమా వాసన, చంకలో చెమట, బ్యాక్టీరియా వల్ల వచ్చే వాసనను నివారిస్తుంది. సాండిల్ ఉడ్ పౌడర్ లో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చంకబాగంలో అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత దీన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. టర్నిప్ జ్యూస్ :

8. టర్నిప్ జ్యూస్ :

టర్నిప్ తీసుకుని, తురుమి దాని నుండి రసం తియ్యాలి. ఈరసాన్ని చంకబాగంలో అప్లై చేయాలి. ఇది బహుమూలల్లో వాసనను తగ్గిస్తుంది. దుర్వాసనను పోగొడుతుంది.

9. బేకింగ్ సోడ:

9. బేకింగ్ సోడ:

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, పేస్ట్ లా కలుపుకుని చంకబాగంలో అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత నీళ్ళతో కడిగేసుకోవాలి. చెడువాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

10. టీట్రీ ఆయిల్ :

10. టీట్రీ ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని అరగ్లాసు నీటిలో మిక్స్ చేసి, చంకబాగంలో స్ప్రే చేసుకోవాలి. ఈ నేచురల్ చిట్కాలను అనుసరించడం వల్ల బహుమూలల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే చెడు వాసనను నివారించుకోవచ్చు.

English summary

10 Amazing Natural Remedies For Smelly Armpits Caused By Bacteria

Having smelly underarms is one of the most embarrassing feelings one could have. There are certain natural remedies to get rid of this bad odour.
Story first published: Thursday, November 17, 2016, 17:07 [IST]
Desktop Bottom Promotion