For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞానదంతాల నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే 10 ఆయుర్వేదిక్ రెమెడీస్

|

జ్ఞానదంతాల నొప్పి అనేది సాధారణంగా 15 నుండి 25 ఏళ్ళలో వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత మంది జీవితంలో 25ఏళ్ల తర్వాత దశలో కూడా జ్ఞానదంతాల నొప్పిని కలిగి ఉంటారు. దీన్ని థర్డ్ మోలార్స్ అని కూడా పిలుస్తారు, అది చివరిగా దంతాలు మరియు ఈ దంతాలు నోట్లో చివరలో ఉంటాయి. ఇవి నాలుగు భాగాలుగా కనబడుతుంటాయి.

జ్ఞానదంతం చివరగా వస్తుంటాయి, దంతాలన్ని వచ్చిన తర్వాత ఇవి మొలవడం వల్ల, ఇవి నోట్లో పెరగడానికి వాటికి సరైన స్థలం సరిపోకపోవడం వల్ల జ్ఞానదంతం వచ్చేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. స్థలంను సమకూర్చుకోవడానికి పక్కపళ్ళను లేదా లోపలికండరాలను ముందుకు, వెనకకు నెట్టుకుంటూ పెరగడం వల్ల ఈ నొప్పి ప్రతి ఒక్కరిలోనూ సహజంగా వస్తుంటుంది. దీని ఫలితంగా జ్ఞానదంతాల నొప్పి, వాపుకు కారణం అవుతుంది.

ఈ నొప్పితో పాటు, చెడు శ్వాస, నమలడంలో మరియు ఆహారాన్ని మ్రింగడంలో కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. ఇంకా, తలనొప్పి, మరియు దంతాల మద్య నొప్పి కలిగి ఉంటుంది. అది క్రమంగా అలా గడ్డం, చెవులకు, గడ్డం పక్కటెములకు నొప్పి పాకుతుంది. పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది.

జ్ఞానదంతాల నొప్పికి అనుకోకుండా ఎలాంటి లక్షణాలు లేదా సంకేతాలు లేకుండా నొప్పికి గురిచేస్తుంటుంది. లేదా క్రమంగా నొప్పి పెడుతూనే ఉంటుంది. ఈ జ్ఞానదంతాల నొప్పిని భరించలేకున్నంతగా మరియు మీ దినచర్యలు దినదినానికి మరింత తీవ్రంగా కష్టంగా మార్చేస్తుంది.

జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పురాతన కాలం నుండి పెయిన్ రిలీష్ కోసం ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అదేవిధంగా, నొప్పి తిరిగి పునరావ్రుతం అవుతుంటే, ఆ దంతాన్నిడెంటిస్ట్ ద్వారా తొలగించడం ఒక ఉత్తమ మార్గం. అయితే, డెంటిస్ట్ ను కలవాడనికి ముందుగా జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని ఉత్తమ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

లవంగం ఆయిల్:

లవంగం ఆయిల్:

లవంగం నూనె ఒక ముఖ్యమైన ఆయుర్వేదిక్ రెమెడీ. దీన్ని పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు . ఇది జ్ఝాన దంతాల నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . లవంగం నూనెలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . కొన్ని చుక్కల లవంగం నూనెలో కాటన్ బాల్ డిప్ చేసి నొప్పి ఉన్న దంత మీద పట్టి అలాగే కొద్దిసేపు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను తీసుకుని, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, నొప్పి ఉన్న దంత మీద పెట్టాలి. కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్:

ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి పుదీనాకు కూడా ప్రత్యేక స్థానం ఉంది, . జ్ఝాన దంతాల నొప్పిని నివారించుకోవడంలో పెప్పర్ మింట్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పిని మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాటన్ బాల్ ను పెప్పర్ మింట్ ఆయిల్లో డిప్ చేసి నొప్పి ఉన్న దంత మీద అప్లై చేసి అలాగే ఉంచడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

జామఆకులు:

జామఆకులు:

జామ ఆకు జామ ఆకు జ్ఞానదంతాల నొప్పి నుండి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇందులో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాల వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఇంకా ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు అనాలజీస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పచ్చగా మరియు తాజాగా ఉండే జామ ఆకులు ఒకటి లేదా రెండు ఆకులను నోట్లో వేసుకొని నమలడం ద్వారా జ్ఞానదంతాల నొప్పినుండి ఉపశమనం పొందవచ్చు.

వీట్ గ్రాస్ జ్యూస్ :

వీట్ గ్రాస్ జ్యూస్ :

గోధుమ గడ్డి గోధుమ గడ్డి మరో నేచురల్ హోం రెమెడీ. జ్ఞానదంతాల నొప్పినివారించడంలో సహాయపడుతుంది. ఇందులో నేచులర్ యాంటీ బయోటిక్, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది మరియు నోట్లోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. నొప్పిని అరికడుతుంది. కొద్దిగా గోధుమ గడ్డిని నోట్లో వేసుకొని నమలాలి, తర్వాత వాటిని ఉమ్మివేయాలి . అవసరం అయినప్పు ఇలా చేస్తుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు.

ఇంగువ:

ఇంగువ:

దీన్ని హింగ్ అనికూడా పిలుస్తారు.ఇది ఒక పాపులర్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఇది జ్ఝాన దంతాల నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . ఇంగువ పొడిని దంతాల మీద వేసుకోవడం లేదా ఇంగువ పలికను నొప్పి ఉన్నదంతం మీద పెట్టుకుని కొరకడం చేయాలి. నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతంది.

 ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని పురాతనకాలం నుండి వ్యాధుల నివారణకు గొప్పగా ఉపయోగిస్తున్నారు. సన్నగా కట్ చేసి నొప్పి ఉన్న దంతాల మద్య ఉంచడం వల్ల త్వరిత ఉపశమనం కలుగుతుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి రెబ్బలను ఒకటి రెండు తీసుకిని నొప్పున్న దంత మీద పెట్టి నములుతుండాలి . ఇలా నమలడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ పొందుతారు. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నివారనిగా గ్రేట్ గా పనిచేస్తుంది.

 అల్లం :

అల్లం :

కొద్దిగా అల్లం తీసుకొని, పొట్టు తీసి, శుభ్రంగా కడిగి, నొప్పి ఉన్న దంతాల మద్య ఉంచి నమలడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, చల్లారిన తర్వాత కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను చెవిలో పోయాలి. ఇలా చేయడం వల్ల జ్జానదంతల నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

English summary

10 Best Ways To Relieve Wisdom Tooth Pain With Ayurveda

10 Best Ways To Relieve Wisdom Tooth Pain With Ayurveda,In order to get off the terrible pain, most of them immediately go in for a tooth extraction, but few of them have these wisdom teeth embedded in jawbones, making it complicated for the extraction process. For such wisdom tooth pain, Ayurveda is seen to
Story first published: Friday, June 10, 2016, 18:32 [IST]
Desktop Bottom Promotion