For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు..!!

By Swathi
|

మీరు తరచుగా తలనొప్పి, వికారం, బ్లర్ గా కనిపిస్తుండటం వంటి లక్షణాలు ఫేస్ చేస్తున్నారా ? అయితే ఇలాంటి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇవన్నీ.. బ్రెయిన్ ట్యూమర్ కి కారణం అయి ఉండవచ్చు. మెదడులో అసాధారణంగా కణాలు పెరగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది.

తరచుగా మీకు వచ్చే తలనొప్పి దేనికి సంకేతమో తెలుసా ?

సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ రెండు రకాలు. కాన్సరస్, నాన్ కాన్సరస్ అని రెండు రకాలు. ఈ రెండు రకాల బ్రెయిన్ ట్యూమర్ల వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ కి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోవడం పెద్ద సమస్యగా మారింది.

బ్రెయిన్ ట్యూమర్ ఏ వయసు వాళ్లకైనా రావచ్చు. కొన్ని కేసులు వారసత్వంగా ఫైల్ అయితే.. మరికొన్ని ఎక్కువగా కెమికల్స్, రేడియేషన్స్ కి ఎక్స్ పోజ్ అయిన వాళ్లకు సంబంధించి ఉన్నాయి. చాలామందికి వాళ్లు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నామని తెలియదు. అంటే వాళ్లకు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, సంకేతాలు తెలియకపోవడం, కనిపించకపోవడం కారణంగా చెప్పవచ్చు.

తలనొప్పి &మైగ్రేన్ తలనొప్పికి గురిచేసే ఆహారాలు

కేవలం ట్యూమర్ పెద్దగా పెరిగిన తర్వాత మాత్రమే.. వాళ్లు చెక్ చేయించుకుని.. దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. కాబట్టి.. సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ ని సూచించే కొన్ని లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిది. దీనివల్ల వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడమో, చెకప్ కి వెళ్లడం ద్వారానో.. దీన్ని ముందుగా గుర్తించడం తేలికవుతుంది.

తలనొప్పి

తలనొప్పి

బ్రెయిన్ ట్యూమర్ కి తలనొప్పి చాలా కామన్ సంకేతం. తలనొప్పి ఉదయాన్నే రావడం, చాలా తరచుగా రావడం, తలనొప్పి వచ్చిందంటే నొప్పి విపరీతంగా ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా.. చెక్ చేయించుకోవడం మంచిది.

వికారం, వాంతులు

వికారం, వాంతులు

తలనొప్పి వచ్చినప్పుడు వికారంగా అనిపించడం, వాంతులు అవడం.. ముఖ్యంగా ఉదయం ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే.. బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతమని గుర్తించండి. ఒకవేళ తమ భంగిమ మార్చితే.. వాంతులు, వికారం అనిపిస్తోందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.

చూపు సమస్యలు

చూపు సమస్యలు

ముఖ్యంగా కనుబొమ్మల కింది భాగంలో ట్యూమర్ ఉందంటే.. వాళ్లకు చూపు సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. బ్లర్ గా కనిపించడం, వస్తువులు, రంగులు గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు.. బ్రెయిన్ ట్యూమర్ ని సూచిస్తాయి.

స్పర్శ కోల్పోవడం

స్పర్శ కోల్పోవడం

ఎవరికైతే బ్రెయిన్ లో కణత దగ్గర ట్యూమర్ ఉంటుందో వాళ్లు.. చేతులు, కాళ్ల చుట్టూ స్పర్శ కోల్పోతారు. ఎందుకంటే.. ఇలాంటి ప్రదేశంలో ట్యూమర్ ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి.

బ్యాలెన్స్

బ్యాలెన్స్

చిన్న మెదడులో ట్యూమర్ ఉన్నప్పుడు వాళ్ల శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారుతుంది. కదలికలకు కూడా ఇబ్బందిగా మారుతుంది.

మాటలో సమస్యలు

మాటలో సమస్యలు

కణత నరాలలో ట్యూమర్ ఏర్పడినప్పుడు.. మాట్లాడటానికి కూడా సమస్యగా ఉంటుంది. మాటలు రావడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి సంకేతం బ్రెయిన్ ట్యూమర్ ని సూచిస్తుంది.

అయోమయం

అయోమయం

బ్రెయిన్ లో కణతి దగ్గర ట్యూమర్ ఏర్పడితే.. చాలా కన్యూజన్ గా మారతారు. ప్రతిరోజూ చేసే పనుల్లోనే ఇబ్బందికరంగా, అయోమయంగా వ్యవహరిస్తారు. ఇలాంటి లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి.

ప్రవర్తనలో మార్పులు

ప్రవర్తనలో మార్పులు

ఒకవేళ నుదుటి భాగంలో ట్యూమర్ ఏర్పడి ఉంటే.. వాళ్ల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.

అనారోగ్యాలు

అనారోగ్యాలు

అనారోగ్యం, ఫిట్స్ వంటి లక్షణాలు.. బ్రెయిన్ ట్యూమర్ ని సూచించే కామన్ సంకేతం. ఫిట్స్ వచ్చిన వాళ్లు.. కాన్సియస్ నెస్ కోల్పోతారు. కాబట్టి.. అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

వినికిడి సమస్యలు

వినికిడి సమస్యలు

బ్రెయిన్ దగ్గర కణతల్లో ట్యూమర్ ఉన్న వాళ్లకు వినికిడి సమస్య కనిపిస్తుంది. వినడంలో ఇబ్బంది, పూర్తీగా వినపడకపోవడం వంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ ని సూచిస్తాయి.

English summary

10 Common Symptoms of Brain Tumour You Need To Know (World Brain Tumour Day)

10 Common Symptoms of Brain Tumour You Need To Know (World Brain Tumour Day). Are you suffering from frequent headaches, nausea, blurred vision or difficulty in balancing yourself? Do not ignore these symptoms.
Story first published:Wednesday, June 8, 2016, 12:21 [IST]
Desktop Bottom Promotion