Latest Updates
-
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది?
చలికాలంలో ..టాన్సిల్స్ కు ఫాస్ట్ రిలీఫ్ ను కలిగించే 10 ఎఫెక్టివ్ రెమెడీస్ ..!!
గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక క్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్ కు గురై గొంతునొప్పి మొదలవుతుంది.అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపోకపోవడం వల్ల కూడా టాన్సిల్స్ సమస్య మొదలవుతుంది
టాన్సిలైటీస్(టాన్సిల్స్ )అనేది గొంతులో ఇన్ఫెక్షన్. టాన్సిల్స్ గొంతులో రెండు వైపులా ఉండి, శరీరానికి రక్షక కవచంలా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములను, కాలుష్యకారక పదార్థాలను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ టాన్సిల్స్ సమస్య పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ టాన్సిల్స్ శోషరస కణజాలానికి ఇరువైపులా చిన్న గడ్డల్లా ఉంటాయి. టాన్సిల్స్ సైజు పెరిగి వాపు రావడం వల్ల గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు.
గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక క్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్ కు గురై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపోకపోవడం వల్ల కూడా టాన్సిల్స్ సమస్య మొదలవుతుంది. టాన్సిల్స్ ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి?

గొంతు భాగంలో టాన్సిల్స్ వాపు ఎర్రగా కనిపిస్తుంది. దాంతో గొంతు నొప్పి, చెవినొప్పి, తలనొప్పి, జలుబుతో కూడిన జ్వరం, ఆహారం మింగడం, నీళ్ళు త్రాగడానికి, గాలిపీల్చడానికి, బాగా మాట్లాడటానికి కష్టమౌతుంది. ఒక్కో సందర్భంలో నోరు బొంగురుపోతుంది. గొంతు తడిఆరిపోతుంది. గొంతు ఎర్రబారుతుంది. నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణలు ఎక్కువగా కనిపిస్తాయి.
టాన్సిల్ ఉన్నప్పడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా నయం అవుతుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు కొన్ని సాప్ట్ ఫుడ్స్ ను ఉదాహరణకు పాస్తా, అన్నం, పెరుగు, పుడ్డింగ్ వంటివి నోట్లో మింగడానికి స్మూత్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలి. కొన్ని రకాల సిట్రస్ పండ్లు, కొన్ని చల్లని లేదా పుల్లని పండ్లు మరియు స్నాక్స్ తినడం వల్ల గొంతు నొప్పి తీవ్రం కావడమే కాక, గొంతులోపల దురదగా అనిపిస్తుంది.
కాబట్టి, మీరుటాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్నట్లైతే అందుకు కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ నేచురల్ ఆల్టర్ నేటివ్స్ మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది. దాంతో శరీరంలో వైరస్, బ్యాక్టీరియతో పోరాడే శక్తి పెరుగుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యంగా, హాపీగా ఉండటానికి మీరు కొన్ని సూచనలను పాటిస్తే సరిపోతుంది . టాన్సిలైటీస్ నివారించడానికి ఇక్కడ కొన్ని సులభ చిట్కాలున్నాయి...

ఉప్పు నీటితో గార్గిలింగ్ :
టాన్సిలైటీస్ లక్షణాలు మీరు గుర్తించిన వెంటనే మీరు మౌత్ వాష్ తో పాటు, గార్గిలింగ్ చేయడం చాలా అవసరం. అందుకు గోరువెచ్చని నీటిలో ఉప్పు మిక్స్ చేసి , నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేసినప్పుడు బ్యాక్టీరియా నాశనం చేయబడి, టాన్సిలైటీస్ నివారించుకోవచ్చు.

నిమ్మరసం :
టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ.. విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల టాన్సిల్ తగ్గడంతో పాటు, ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

పసుపు:
పసుపు నేచురల్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతులో ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ నివారించడానికి సహాయపడుతుంది. గోరెవెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు మిక్స్ చేసి, ఆనీటిని నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేయాలి. ఉదయం మరియు నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు మిక్స్ చేసి రాత్రినిద్రించడానికి ముందు తాగాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తులసి:
మరో నేచురల్ రెమెడీ తులసి,ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, గొంతు వాపు తగ్గిస్తుంది. టాన్సిల్స్ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. నీళ్ళలో 10 తులిసి ఆకులు వేసి 10 నిముషాలు ఉడికించి, వడగట్టి, అందులో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి.

దాల్చిన చెక్క పౌడర్ :
దాల్చిన చెక్క టాన్సిల్స్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. అదే విధంగా గొంతు నొప్పి, వాపును తగ్గిస్తుంది.టాన్సిల్స్ కు బెస్ట్ హోం రెమెడీస్. ఒక గ్లాసు వేడినీళ్ళలో దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి తాగాలి. అలాగే తాగడానికి ఇష్టపడని వారు తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. దీన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మేతి :
మేతి లేదా మెంతులు. టాల్సిల్స్ నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు టాన్సిల్స్ కు కారణమైయ్యే హానికరమైన ప్యాథోజన్స్ ను నివారిస్తుంది. దాంతో గొంతు వాపు, మంట,గొంతు నొప్పి నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

ఫిగ్స్ :
ఫిగ్స్ లో మస్లేజ్ అనే కంటెంట్ టాన్సిల్స్ నివారిచడంలో గ్రేట్ హోం రెమెడీ. గొంతు నొప్పి, సోర్ నెస్ ను తగ్గించడంలో గ్రేట్ రెమెడీ. డ్రై ఫిగ్స్ లేదా ఫ్రెష్ ఫిగ్స్ ను తీసుకోవచ్చు.

మింట్ టీ:
టాన్సిల్స్ తగ్గించడానికి మింట్ టీ గ్రేట్ గా సహాపడుతుంది. మింట్ టీలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది టాన్సిల్స్ కు కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియాను నివారిస్తుంది.

జీలకర్ర:
జీలకర్ర చాలా ఫాస్ట్ గా రిలీఫ్ కలిగిస్తుంది. జీలకర్రలో ఉండే ఆల్కహాల్ లక్షణాలు టాన్సిల్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మూడు స్పూన్స్ జీలకర్రను నీటిలో వేసి బాయిల్ చేసి, వడగట్టి పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు తిరిగి వేడి చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ విస్కీ మిక్స్ చేసి చల్లారిన తర్వాత ప్రతి అరగంట కొకసారి తీసుకోవాలి.

మిరియాలు
ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే.. టాన్సిల్స్ నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications