For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండ నుంచి ఉపశమనం కలిగించే న్యాచురల్ సన్ ప్రొటెక్షన్ ఫుడ్స్

By Swathi
|

ఎండలోకి వెళ్లిన ప్రతిసారీ.. గొడుగు పట్టుకెళ్లాల్సిందేనా ? ఎస్ పీ ఎఫ్ లేదా సన్ ప్రొటెక్షన్ క్రీమంలు అప్లై చేయాల్సిందేనా ? అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకు సూర్య కిరణాలు మన శరీరం, ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం చూపుతాయి. యూవీ కిరణాల వల్ల.. సన్ బర్న్స్, ట్యాన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్, కళ్ల సమస్యలు, ఇమ్యునిటీ పవర్ తగ్గడం, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

సన్ స్ట్రోక్ ( వడదెబ్బ ) గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు

ఇక్కడ చెప్పిన కొన్ని హెల్త్ కండీషన్స్ చాలా పెద్ద సమస్యగా మారుతాయి. కాబట్టి.. సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించుకోవడం చాలా అవసరం. అలాగే పిగ్నెంటేషన్, మచ్చలు కూడా ఎండవల్ల ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి హానికారక కిరణాల నుంచి రక్షించుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే.. కేవలం సన్ స్క్రీన్ లోషన్స్ మాత్రమే కాకుండా.. కొన్ని రకాల హెల్తీ ఫుడ్స్ వల్ల.. సన్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఆహారాలు ఇమ్యునిటీని పెంచి.. ఎండ వల్ల వచ్చే సమస్యలను నివారిస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమ్మర్ లో ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే.. ఎండ వల్ల వచ్చే సమస్యలు నివారించవచ్చు. మరి ఆ ఆహారాలేంటో చూద్దామా..

క్యారట్

క్యారట్

క్యారట్స్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఎండ వల్ల కలిగే హాని నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో విటమిన్ ఈ ఉండటం వల్ల ఎండకు కమిలిన చర్మాన్ని కూడా క్యారట్స్ చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్

నారింజ, నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి స్కిన్ క్యాన్సర్ ని అరికడతాయి. అలాగే పిగ్మెంటేషన్, సన్ బర్న్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సూర్య కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి ఎస్ పీ ఎఫ్ వంటి కెమికల్ క్రీముల కంటే.. ఎక్కువగా న్యాచురల్ సన్ ప్రొటెక్షన్ అందిస్తాయి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీలో టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది సన్ బర్న్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరాన్ని యూవీ రేస్ నుంచి రక్షణ కల్పిస్తూ.. ఇమ్యునిటీ పెంచుతాయి. ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది. అలాగే న్యాచురల్ ఎస్ పీ ఎఫ్ లా పనిచేస్తుంది.

బాదాం

బాదాం

బాదాంలో క్వెర్సిటిన్ ఉంటుంది. ఇది ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది. హానికారక యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ ఈ సన్ బర్న్స్, సన్ ట్యాన్ నివారిస్తాయి.

టొమాటొ

టొమాటొ

టమోటాల్లో విటమిన్ సి, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ ఇమ్యునిటీని స్ట్రాంగ్ గా చేస్తాయి. అలాగే యూవీ రేడియేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.

వాటర్ మిలాన్

వాటర్ మిలాన్

వాటర్ మిలాన్ లో న్యాచురల్ కూలింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది బాడీ హీట్ ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో 40 శాతం ఎక్కువ లైకోపిన్ ఉంటుంది.

పసుపు

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి హానికాకుండా కాపాడతాయి.

లీఫీ గ్రీన్స్

లీఫీ గ్రీన్స్

స్పినాచ్, లిట్యుస్ వంటి ఆకుకూరలు.. చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు.. కణాల పెరుగుదలను పెంచుతాయి. స్కిన్ క్యాన్సర్ ని నివారిస్తాయి.

English summary

10 Foods That Give Natural Sun Protection

10 Foods That Give Natural Sun Protection. These foods can also improve the natural sun-protection property in your body. So, let us have a look at some of these exceptional sun-protection foods here.
Story first published:Monday, May 2, 2016, 15:35 [IST]
Desktop Bottom Promotion