For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో ఉదయాన్నే పుదిన వాటర్ తాగడం వల్ల పొందే హెల్త్ బెన్ఫిట్స్

By Swathi
|

సమ్మర్ అంటేనే వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బయటకు వెళ్లకపోయినా.. ఆ వేడి శెగ తగులుతూనే ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎండాకాలంలో ఉంటుంది. ఎండతోపాటు, వేడిగాలులు.. మనుషుల్లో ఎనర్జీ కోల్పోయేలా చేస్తుంది. రోజూ చెమట, ఎండతో ఇబ్బందిపడాల్సి వస్తుంది.

కానీ సమ్మర్ లో ఫ్రెష్ గా, తాజాగా ఉండాలని కోరుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ అది సాధ్యంకాని పని అనుకుంటారు. అయితే.. చిన్న చిటుకు మిమ్మల్ని రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉండేలా సహాయపడుతుంది. ఘుమఘుమవాసన కలిగిన పుదీన సమ్మర్ లో చల్లచల్లగా ఉండేలా చేస్తుంది. సలాడ్స్, డ్రింక్స్ లో పుదీనను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే సమ్మర్ లో ఎదురయ్యే అనేక అనారోగ్య సమస్యలను.. పుదీన ద్వారా పరిష్కరించుకోవచ్చు.

పుదీనాతో ఫేస్ ప్యాక్స్ : చర్మం రంగులో తక్షణ మార్పులు

ఒక గాజు జార్ తీసుకుని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, దోసకాయ లేదా వాటర్ మిలాన్ ముక్కలు, కొద్దిగా అల్లం తురుము కలుపుకుని.. మింట్ వాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి.. చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఈ జార్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సమ్మర్ లో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జీర్ణక్రియ

జీర్ణక్రియ

సమ్మర్ లో జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. దీనికి చక్కటి పరిష్కారం పుదినా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్టలో జీర్ణసమస్యలను నివారిస్తుంది.

వికారం

వికారం

సమ్మర్ లో మింట్ వాటర్ తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు సమ్మర్ లో తప్పనిసరిగా ఈ నీటిని తీసుకోవడం వల్ల.. మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడవచ్చు.

యాక్నె

యాక్నె

సమ్మర్ లో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చర్మం నిర్జీవంగా మారిపోతుంది. మొటిమలు, యాక్నె సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా మింట్ వాటర్ తీసుకుంటూ ఉండటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే. అలాగే చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

ఆస్త్మా

ఆస్త్మా

ఆస్తమా పేషంట్స్ కి పుదిన న్యాచురల్ రిలాక్సేషన్ ని ఇస్తుంది. ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి అయినా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

రుతుక్రమ సమస్యలు

రుతుక్రమ సమస్యలు

సమ్మర్ వచ్చిందంటే అమ్మాయిల సమస్యలు అంతా ఇంతా కాదు. రుతుక్రమం సమయంలో.. కడుపునొప్పి, బ్లీడింగ్ కారణంగా చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువ మోతాదులో మింట్ వాటర్ తీసుకోవడం వల్ల.. రుతుక్రమం సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

సమ్మర్ వచ్చిందంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ జ్యూస్ లు, కూల్ డ్రింగ్స్ తీసుకోవడం వల్ల మరిన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వేధిస్తాయి, ఉదయాన్నే ఒక గ్లాస్ మింట్ వాటర్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఒత్తిడి, డిప్రెషన్

ఒత్తిడి, డిప్రెషన్

పుదినా మీ మూడ్ ని మార్చేసి, యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి.. నీటిని వేడి చేసి.. అందులో పుదినా ఆకులు వేసి తాగాలి. ఇలా రెగ్యులర్ గా ఈ నీటిని తీసుకుంటే.. ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి సమ్మర్ మంచి సీజన్. ఒకవేళ పుదినా వాటర్ మీరు సమ్మర్ లో తీసుకుంటే.. బరువు తగ్గడం మరింత తేలికైన పని. పుదిన తీసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలోని ప్రొటీన్స్ ని శరీరానికి అందించి.. ఫ్యాట్స్ ని ఎనర్జీగా మార్చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గడం చాలా సులువవుతుంది.

పంటి ఆరోగ్యానికి

పంటి ఆరోగ్యానికి

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటర్ గుణాలు కలిగి ఉన్న పుదినా తీసుకోవడం వల్ల చిగుళ్లు, పంటి సమస్యలు తగ్గిపోతాయి. మింట్ వాటర్ తీసుకోవడం వల్ల తాజా శ్వాసతోపాటు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

జ్వరం

జ్వరం

సమ్మర్ లో రకరకాల అలర్జీలతో సతమతమవుతుంటే.. మింట్ వాటర్ మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. పుదినా తీసుకోవడం వల్ల.. సీజనల్ అలర్జీలు, జ్వరం తగ్గిస్తుంది.

Story first published:Monday, April 11, 2016, 9:47 [IST]
Desktop Bottom Promotion