For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్ర సమస్యలను దూరం చేసే టాప్ 10 నేచురల్ డ్రింక్స్

|

ప్రతి రోజూ ప్రతి వ్యక్తికి నిద్ర చాలా అవసరం. ఒక రోజుకు ప్రతి ఒక్కరికీ కనీసం 8గంటలు అవసరం. నిద్రలేమి వల్ల బరువు పెరగడం, ఆందోళన, అలసట చెందడం, ఏకాగ్రత లేకపోవడం, నిర్జీవం లేని జుట్టు, డార్క్ సర్కిల్స్, శరీరంలోని జీవక్రియలు సరిగా పనిచేయకపోవడం. ముఖ్యంగా కిడ్నీలు మరియు లివర్ చురుకుగా పనిచేయవచ్చు.

నిద్రలేమి సమస్య ప్రస్తుత రోజుల్లో చాలా సాధారణ సమస్య అయ్యింది. నిద్రపట్టడానికి నిద్రమాత్రలు తీసుకుంటుంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ మందు అలవాటుగా మారిపోతుంది. తర్వాత రోజుల్లో నిద్రమాత్రలు వేసుకొన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో మరింత ఎక్కవు డోస్ తీసుకోవడానికి ప్రారంభించి సమస్యల్లో చిక్కుకుంటాడు. నిద్రలేమి సమస్యలు ఒక్కోవ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యకు ముఖ్య కారణం, ఆందోళన, ఎమోషనల్ ట్రూమ, మందులు, పడక సరిగా లేకపోవడం వంటివన్నీ నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.

నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆహారపానియాలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించి నిద్రపోయేందుకు బాగా సహాయపడుతాయి. కొన్ని ప్రత్యేకమైన పానియాలను రాత్రుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి.

మరి ఆ డ్రింక్స్ ఏంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ లో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా కండరాలను రిలాక్స్ చేస్తుంది . ఇది విటమిన్ బి ని కూడా ఇస్తుంది . ఆందోళన మరియు ఒత్తిడి తగ్గిస్తుంది.

హేర్బల్ టీ:

హేర్బల్ టీ:

ప్యాషన్ ఫ్లవర్, హాప్స్, లెమన్ బామ్ మరియు ఇతర హెర్బ్స్ ను చేర్చి టీ తయారుచేసి తాగడం వల్ల నిద్రబాగా పడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో అమినోయాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది, స్ట్రెస్ తగ్గిస్తుంది మరియు నిద్రబాగా పట్టేలా చేస్తుంది . మరియు ఇందులో కెపిన్ కూడా ఉంటుంది కాబట్టి త్వరగా నిద్రపట్టేందుకు సహాయపడుతుంది.

. లెమన్ జింజర్ హనీ టీ:

. లెమన్ జింజర్ హనీ టీ:

ఒక గ్లాసు వేడి నీళ్ళలో నిమ్మ, అల్లం, తేనె మరియు అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. తర్వాత నిద్రించడానికి ముందు ఈ టీని తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.

చియా సీడ్ మిల్క్:

చియా సీడ్ మిల్క్:

చియా సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది బాగా నిద్రపట్టేలా చేయడం మాత్రమే కాదు, ఇది నిద్రయొక్క క్వాలిటిని పెంచుతుంది. చియాసీడ్స్ ను వేడి నీటిలో ఉడికించి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టి , మరుసటి రోజు రాత్రి నిద్రించే ముందు తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.

హాట్ చాక్లెట్ మిల్క్:

హాట్ చాక్లెట్ మిల్క్:

దీన్నే హెల్తీ కార్బో పౌడర్ అనికూడా పిలుస్తారు . ఈ కార్బో పౌడర్ లో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

పిప్పర్ మింట్ టీ:

పిప్పర్ మింట్ టీ:

నిద్రలేమి సమస్యను, డిప్రెషన్ లేదా ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేసే వాటిలో మింట్ టీ ఒకటి. నిద్రించడానికి ముందు మింట్ టీ తాగడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది, ముఖ్యంగా ఈ టీ తాగడం వల్ల మలబద్దకం, హార్ట్ బర్న్, మైగ్రేన్ సమస్యలను నివారించుకోవచ్చు.

గోరువెచ్చని పాలు, తేనె-బాదంతో తీసుకోవచ్చు:

గోరువెచ్చని పాలు, తేనె-బాదంతో తీసుకోవచ్చు:

గోరువెచ్చని పాలలో కొద్దిగా తేనె మరియు బాదం పౌడర్ మిక్స్ చేసి తాగడం వల్ల తర్వాత నిద్రపట్టేలా చేస్తుంది . తేనె బాదం వల్ల శరీరానికి అమినో యాసిడ్స్ అందిస్తుంది . వీటి కాంబినేషన్ లో ఉండే క్వాలిటీస్ నిద్రపట్టేందుకు సహాయపడుతుంది.

చమోమెలీ ల్యావెండర్ టీ:

చమోమెలీ ల్యావెండర్ టీ:

చమోమెలీ మరియు ల్యావెండర్ టీ రెండూ మనస్సుకు విశ్రాంతి కలిగిస్తాయి మరియు నిద్రబాగా పట్టేందుకు సహాయపడుతాయి. ఈ రెండు హెర్బ్స్ యాంటీ ఆక్సైటి పిల్స్ గా ఉపయోగించుకోవచ్చు.

చెర్రీ అండ్ వెనీలా జ్యూస్:

చెర్రీ అండ్ వెనీలా జ్యూస్:

చెర్రీస్ లో మెలనిన్ అధికంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల నిద్రకు సహాయపడే హార్మోన్స్ ఉత్పత్తి చేసి నిద్రబాగా పట్టేలా చేస్తుంది.

English summary

10 Natural Drinks To Get Better Sleep

Research shows there are 10 bedtime beverages one must consume an hour before hitting the sack. The effective drinks will not only make you sleep better but will also help you feel good the next morning. From warm teas, herbal teas, chocolate drinks and more, we have a list of options you can try out tonight to sleep and dream well.
Story first published: Wednesday, May 18, 2016, 17:53 [IST]
Desktop Bottom Promotion