For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రుల్లో చెమటలు తగ్గించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

By Super Admin
|

రాత్రుల్లో నిద్రకు అంతరాయం కలిగిస్తూ రోజు మిడ్ నైట్లో చెమటలు పడుతున్నాయా? విశ్రాంతి లేకున్నా చేస్తున్నదా? నైట్ స్వెట్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఏదో అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. ముఖ్యంగా మోనోపాజ్ లక్షణాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది. నైట్ స్వెట్ కు మరో పేరు హైపర్ హైడ్రోసిస్. నిద్రించేటప్పుడు ఎక్కువ చెమటలు పట్టడం.

మద్యరాత్రిలో చెమటలతో నిద్రలేవడం వల్ల హాపీ ఫీలింగ్ ఉండదు మరియు చికాకు కలిగిస్తూ...అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇది మెడికల్ ప్రాబ్లెమ్ కాకపోయినా మహిళల్లో ఇలాంటి లక్షణాలను మోనోపాజ్ ను సూచిస్తాయి. నైట్ స్వెట్ చాల మందిలో చూస్తుంటాము. మద్యరాత్రిలో చెమటతో తడిచిన జుట్టు, బెడ్ షీట్స్ తేమగా ఉండటం గమనిస్తుంటారు. రూమ్ టెంపరేచర్ నార్మల్ గా ఉన్నా.,.ఇలా రాత్రుల్లో చెమటలు పట్టడం మోనోపాజ్ ప్రధానకారణం అవుతుంది .

ఇంకా వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్, ఆందోళనతో, కోపంతో నిద్రపోయినప్పుడు, యాంటీడిప్రెజెంట్, యాంటీ పైరికెట్సి, బ్లడ్ షుగర్స్ లో హైపోగ్లిజిమిక్స్ ఏజెంట్ తగ్గడం , మోనోపాజ్ హాట్ ఫ్లాష్ వల్ల నైట్ స్వెట్ కు గురికావల్సి వస్తుంది.

ప్రీమోనోపాజ్ లో ప్రొజెస్ట్రిరాన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈస్ట్రోజెన్ వాల్యూమ్ తగ్గడం వల్ల కూడా రాత్రుల్లో చెమటలు పడుతాయి . మరి ఈ సమస్యను నివారించుకోవడం ఎలా? కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేసి, నైట్ స్వెట్ ను విముక్తి చేసి, రాత్రుల్లో బాగా నిద్రపట్టేలా చేస్తాయి. అయితే హోం రెమెడీస్ ఉపయోగించినా నైట్ స్వెట్ క్రమం తప్పకుండా వస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

కొన్ని చిట్కాలు :

టిప్ #1

టిప్ #1

రాత్రి నిద్రించడానికి ముందు చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రాత్రుల్లో చెమటలు పట్టకుండా మరియు బాగా నిద్రపట్టేలా చేస్తాయి.

టిప్ # 2

టిప్ # 2

హార్మోనులను క్రమబద్దం చేయడానికి, చెమటను కంట్రోల్ చేయడానికి వ్యాయామం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి వర్కౌట్ చేయడం మర్చిపోకండి.

టిప్ # 3

టిప్ # 3

వాతావరణ ఉష్ణోగ్రత కారణమైతే, బెడ్ ను సౌకర్యవంతమైన ప్రదేశంలోకి మార్చుకోవాలి. సరైన గాలి వెలుతురు లేని ప్రదేశంలో నిద్రించడం చాలా కష్టం, చెమటకు గురిచేస్తుంది. నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది.

టిప్ #4

టిప్ #4

పడక లేదా బెడ్ సౌకర్యవంతంగా ఉండాలి . పడక లేదా బెడ్ క్లీన్ గా..ఎటువంటి దుమ్ము ...ధూళి లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలి. లేదంటే నిద్రను మరింత పాడు చేస్తుంది.

టిప్ # 5

టిప్ # 5

రాత్రి తీసుకునే ఆహారాల్లో స్పైసీ ఫుడ్స్లేకుండా చూసుకోవాలి. బాడీ హీట్ కు గురి కాకుండా కూల్ గా ఉంచే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. హైడ్రేటింగ్ ఫుడ్స్ మరియు వెజిటేబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

టిప్ # 6

టిప్ # 6

రోజంతా బాడీకి సరిపడా నీరు తాగడం వల్ల శరీరంతో కూల్ గా ఉంటుంది. కెఫిన్ లేదా సోడాలకు దూరంగా ఉండాలి . ఇవి రాత్రుల్లో డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి.

టిప్ # 7

టిప్ # 7

నిద్రంచేటప్పుడు పడకగదిలోఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి. వెలుతు నిద్రాభంగిమ కలిగిస్తుంది. నిద్ర సమస్యకు దారితీస్తుంది.

టిప్ #8

టిప్ #8

నిద్రించడానికి ముందు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల నైట్ స్వెట్ ను నివారిస్తుంది. నిద్రించడానికి ముందు 10 నిముషాలు మెడిటేషన్ చేయడం వల్ల మంచి నిద్రపడుతుంది.

టిప్ # 9

టిప్ # 9

నైట్ వేసుకునే దుస్తుల విషయంలో మెలుకువలు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ దుస్తులు పరిస్థితిని మరింత ఎక్కువ చేస్తుంది.

టిప్ #10

టిప్ #10

నైట్ లో ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. రాత్రుల్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎక్కువ చెమటలు పడుతాయి.

English summary

10 Quick Tips To Reduce Night Sweats

There is another name for night sweats- sleep hyper-hydrosis. It is nothing but sweating too much when you are asleep.
Story first published:Wednesday, September 14, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion