For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీహైడ్రేషన్ కారణంగా ఫ్యాట్ మరియు సిక్ గా మారడానికి కారణాలు...

|

మన శరీరంలో 60శాతం వరకూ నీరే ఉంటుంది. శ్వాస తీసుకోకుండా మనం జీవించలేమన్న విషయం మీకు తెలిసిందే...అదే విధంగా నీరు లేకుండా కూడా మనం జీవించలేము.ఏ విధంగానైతే నీరు శరీరంపైవున్న మురికిని శుభ్రం చేస్తుందో అలాగే శరీరం లోపలి భాగంలోనున్న మలినాలను కూడా శుభ్రం చేయడానికి నీరు చాలా అవసరం

నీరు అధికంగా తీసుకోవడంవలన ఎలాంటి నష్టం కలగదు. ఎలాగైనా ఆనీరు బయటకు వచ్చేసేదే. దీంతో పాటు మన శరీరానికి అవసరంలేని వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా శరీరంలోనున్న మలిన పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.

ఒక యువకుని బరువులో దాదాపు 65శాతం నీరువుంటుంది. అలాగే యువతి తన శరీరంలోని బరువులో 52 శాతంవరుకు నీరువుంటుందని నిపుణులు వివరించారు. మానవుని శరీరంలోనున్న ఎముకలు చాలా దృఢంగావుంటాయి. కాని వీటిలో 22 శాతం నీరువుంటుంది. దంతాలలో 10 శాతం, చర్మంలో20శాతం, మస్తిష్కంలో 74.5 శాతం, రక్తంలో 83 శాతం, కండరాలలో 75.6 శాతం నీరువుంటుందని వైద్యులు తెలిపారు. శరీరంలోని ప్రతి కణం,అవయవం మరియు కణజాలం నీటి మీద ఆధారపడి ఉన్నాయి. శరీరంలో నీరు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

నీరు జీవమనుగడకు ముఖ్య ఆధారం. నీరు కీళ్ళలో లుబ్రికేషణ్ లాగా పని చేయటమే కాకుండా, శరీర అవయవాలు సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి, అంతేకాకుండా, శరీరంలో ఉండే విషపదార్థాలను భయటకు పంపటంతో పాటు, పేగు కదలికలను సరిగా నిర్వహించేలా చేస్తాయి. దాహమైనపుడు మాత్రమే నీరు తాగటం వలన చాలా రకాల అనారోగ్యలు కలుగుతాయి. దాహం అనిపించకముందే నీరు తాగటం వలన మీ శరీరం డీ హైడ్రేషన్ గురవకుండా కాపాడుకోవచ్చు. డీహైడ్రేషన్ కు గురైనప్పుడు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది మరి అవేంటో తెలుసుకుందా. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

1. జీర్ణ వ్యవస్థలో లోపాలు:

1. జీర్ణ వ్యవస్థలో లోపాలు:

నీరు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మానవులలో జీర్ణక్రియ సరైన విధంగా కొనసాగించబడుటకు నీరు తప్పని సరి. ఒకవేళ మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది, ఇంతటితో ఆగకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. అల్సర్, అసిడిక్ రిఫ్లెక్షన్, మరియు గ్యాస్టిక్ వంటి సమస్యలకు దారితీస్తుంది . ఇలాంటీ జీర్ణ సమస్యలతో బాధపడుకూడదనుకుంటే రోజుకు సరిడేంత వాటర్ ను తీసుకోవాలి. ఆల్కలైన్ మినిరల్స్ మెగ్నీషియం, క్యాల్షియంను ఎక్కువగా తీసుకోవాలి.

2. మలబద్దకం:

2. మలబద్దకం:

చాలా మంది ఎక్కువ సార్లు టాయిలెట్ కు వెళుతుంటారు మరియు పెయిన్ ఫుల్ గా బావిస్తుంటారు .అందుకు కారణం శరీరంలో నీరు లోపించడమే! కోలన్ ఎక్కువ నీరు గ్రహించడం వల్ల ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాంతో బాడీ ఫంక్షన్ ప్రొపర్ గా జరుగుతుంది . కోలన్ డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మలబద్దకం సమస్య ఉంటుంది.

3. కిడ్నీ సమస్యలు:

3. కిడ్నీ సమస్యలు:

ఇది కొద్దిగా భయపడాల్సిన విషయమే. మూత్రవిసర్జన సమయంలో కిడ్నీల్లో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది . ఇది కేవలం మీరు సరిగా నీరు త్రాగకపోవడం వల్ల, మూత్రపిండాల్లోని నీరు బయటకు పంపడానికి కష్టంగా మారినప్పుడు ఇలా జరుతుంటుంది, దాంతో అక్కడ బ్యాక్టీరియా చేరి యూరిన్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీర్ఘకాలంలో బ్లాడర్ కు కూడా ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది . కాబట్టి రోజులో ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది.

4. స్కిన్ డిజార్డర్స్:

4. స్కిన్ డిజార్డర్స్:

శరీరంలో నిల్వ ఉండే టాక్సిన్స్ కేవలం వాటర్ ద్వారా బయటకు వస్తాయి. మన శరీరంలో అత్యంత పెద్ద అవయం చర్మం అనే చెప్పవచ్చు . చర్మానికి తగినంత హైడ్రేషన్ అందకపోతే , చర్మంలో గ్లో తగ్గుతుంది మరియు చర్మరంగులో మార్పులు మరియు ముడుతలు ఏర్పడుతాయి . తర్వాత పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది .

5. హైబ్లడ్ ప్రెజర్:

5. హైబ్లడ్ ప్రెజర్:

రక్తంలో 92శాతం నీరుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే . డీహైడ్రేషన్ కారణంగా బ్లడ్ చిక్కగా మారుతుంది. ఫలితంగా హైబ్లడ్ ప్రెజర్ , రక్తనాళాల్లో మరియు కణాల్లో ఎక్కువ ఒత్తిడికి గురికావల్సి వస్తుంది.

6. కొలెస్ట్రాల్ అధికం:

6. కొలెస్ట్రాల్ అధికం:

డీహైడ్రేషన్ నుండి బయటపడటానికి ఇది శరీరంలో ఆటోమ్యాటిక్ మెకానిజం . . శరీరంలో కణాలు ఎక్కువ కొలస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి కావడం వల్ల హార్ట్ డిసీజ్, దాంతో వ్యక్తులు అధిక బరువు, ఊబకాయంకు గురి అవుతుంటారు.

7. ఆస్తమా మరియు అలర్జీలకు గురి అవుతారు:

7. ఆస్తమా మరియు అలర్జీలకు గురి అవుతారు:

శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అధిక శాతంలో హిస్టమిన్ ఉత్పత్తి అవుతుంది . ఇది బాడీ మెకానిజమ్. హెయిర్ పాసేజ్ కు కూడా వాటర్ అవసరం అవుతుంది. అక్కడ కూడా డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఫలితంగా ఆస్తమా ..అలర్జీకి గురి అవుతుంది.

8. జాయంట్ స్టిఫ్ నెస్:

8. జాయంట్ స్టిఫ్ నెస్:

జాయింట్ రిపేర్స్ చాలా నిధానంగా జరుగుతుంది . జాయింట్స్ లో కార్టిలేజ్ ప్యాడింగ్ వీక్ అవుతుంది. కార్టిలేజ్ కూడా వాటర్ తో నిండి ఉంటుంది కాబట్టి, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది . జాయింట్ స్టిప్ గా మారితే పనిచేయడానికి కుదరదు మరియు నిద్రలేమి రాత్రులు గడపాల్సి వస్తుంది.

9. అలసట:

9. అలసట:

శరీరానికి సరిగా నీరు అందకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఎంజమాటిక్ యాక్టివిటీస్ ఆలస్యం అవుతాయి . దాంతో ఎనర్జీ తగ్గుతుంది, దాంతో ఎప్పుడు చూసినా అలసటగా కనిపిస్తుంటారు.

10. బరువు పెరుగుతారు:

10. బరువు పెరుగుతారు:

డీహైడ్రేషన్ కారణంగా ఎనర్జీ సెల్స్ కోల్పోవడం జరుగుతుంది . దాంతో ఎక్కువ ఫుడ్ తినాలనిపించి ఫ్యాస్ట్ ఫుడ్స్, స్వీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలను శరీరంలో చేరుతాయి . కాబట్టి డ్రింక్ వాటర్ =హైడ్రేషన్ + 0క్యాలరీలు.

English summary

10 Reasons Dehydration is Making You Sick and Fat

The human body is 60% water. You know that without breathing you cannot survive… well, the same is the case with water. Have you ever felt a groping pain in the head when you go for meetings one after the other, ignoring the needs of your body? Dehydration is the cause.
Story first published:Friday, April 29, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion