For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిళ్లు నిద్రలో లేచి పదే పదే యూరిన్ కి వెళ్లడానికి షాకింగ్ రీజన్స్..!!

By Swathi
|

పగలంతా.. ఆ పని ఈ పని అంటూ.. బాగా అలసిపోయిన తర్వాత.. రాత్రి హాయిగా నిద్రపోవాలి అనుకుంటాం. కంటినిండా నిద్రపోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మనందరికీ తెలుసు. రాత్రిపూట కంటినిండా నిద్రపోవడం వల్ల ఉదయం చాలా ఫ్రెష్ గా, రిలాక్స్ గా ఉంటుంది.

అయితే కొన్ని సందర్భాల్లో రోజంతా బాగా అలసిపోయినప్పటికీ.. రాత్రిపూట పూర్తీగా నిద్రపట్టదు. దీనికి కారణం.. రాత్రి సమయంలో నిద్రలో ఉండగా మధ్యలో అనేక సార్లు టాయిలెట్ కి వెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రి పూట తరచుగా యూరిన్ కి వెళ్తున్నారంటే.. మీ నిద్రపై చాలా దుష్ర్పభావం చూపుతుంది.

Reasons Why We Wake Up To Pee At Night

ఒకవేళ మీరు ప్రతి రోజూ రాత్రి నిద్రలో రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారంటే.. మీరు ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితిని నొక్టరియా అని పిలుస్తారు. ఇలా మధ్య రాత్రి నిద్రలేచి.. యూరిన్ కి వెళ్లడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

స్లీప్ అప్నియా

స్లీప్ అప్నియా

రాత్రిపూట యూరినేషన్ వల్ల 50 శాతం మంది స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. గాలి సరిగా అందకపోవడం వల్ల.. శ్వాస అందడం ఇబ్బందిగా మారుతుంది. అదే సమయంలో గుండె కండరం స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు హార్మోన్ బయటకు పంపడం వల్ల యూరిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది.

ఫ్లూయిడ్

ఫ్లూయిడ్

గుండె సరిగా శుద్ధి చేయలేకపోయినప్పుడు పగటిపూట ఫ్లూయిడ్ కాళ్లలో చేరుకుంటుంది. దీనివల్ల మనం పడుకున్నప్పుడు.. ఈ ఫ్లూయిడ్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది. అప్పుడు.. యూరిన్ ప్రొడక్షన్ పెరిగి.. మధ్య రాత్రి బాత్ రూమ్ కి వెళ్లడానికి కారణమవుతుంది.

MOST READ:నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలుMOST READ:నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు

కిడ్నీలో గ్లూకోజ్

కిడ్నీలో గ్లూకోజ్

కిడ్నీల్లో ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ ఉంటే.. రాత్రిపూట ఎక్కువగా ఉండే ఫ్లూయిడ్స్ యూరిన్ గా మారతాయి. దీని ఫలితంగా.. యూరిన్ ఉత్పత్తి పెరిగి.. రాత్రిపూట యూరినేషన్ కి కారణమవుతుంది.

వయసు పెరగడం వల్ల

వయసు పెరగడం వల్ల

వయసు పెరిగే కొద్దీ.. బ్లాడర్ కెపాసిటీ తగ్గుతుంది. బ్లాడర్ కండరాలు.. ఓవర్ యాక్టివ్ అవడానికి కారణమవుతాయి. దీనివల్ల తరచుగా యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది.

ఆల్కహాల్, కాఫీ

ఆల్కహాల్, కాఫీ

రాత్రిపూట అజీర్ణం వల్ల కూడా.. నిద్రకు భంగం కలిగించే నొక్టరియాకి కారణమవుతుంది. ఆల్కహాల్, కాఫీని లేట్ నైట్ తీసుకోవడం వల్ల.. తరచుగా యూరిన్ కి వెళ్లడానికి కారణమవుతుంది.

మెడిసిన్స్ వాడటం

మెడిసిన్స్ వాడటం

రాత్రిపూట లేటుగా డ్యురెటిక్ మెడికేషన్స్ వాడటం వల్ల.. తరచుగా యూరినేషన్ కి కారణమవుతాయి. కాబట్టి.. ఇలాంటి మెడిసిన్స్ ని ఉదయం తీసుకోవడం మంచిది.

నరాల సమస్యలు

నరాల సమస్యలు

నరాల వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు.. బ్లాడర్ పనితీరు అసవ్యస్తంగా మారుతుంది. దీనివల్ల రాత్రిపూట తరచుగా యూరినేషన్ కి వెళ్లాల్సి వస్తుంది.

MOST READ:సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరి MOST READ:సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరి

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్

నొక్టరియా అనేది.. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది. యూరిన్ కి వెళ్లేటప్పుడు మంట, జ్వరం, పొట్ట భాగంలో నొప్పి వంటి లక్షణాలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి సంకేతాలు.

ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం

ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం

కొంతమంది రాత్రి డిన్నర్ తర్వాత 30 శాతం కంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. దీనివల్ల రాత్రిపూట యూరినేషన్ కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి రాత్రి పడుకోవడానికి ముందు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

ఒబేసిటీ

ఒబేసిటీ

పొట్టలో ఒబేసిటీ కూడా రాత్రిపూట యూరినేషన్ కి కారణమవుతుంది. ఇది గుర్తించలేని స్లీప్ అప్నియా కారణంగా జరుగుతుందని తెలుస్తోంది. కానీ.. దీన్ని ఇంకా నిర్థారించలేదు.

English summary

10 Reasons Why We Wake Up To Pee At Night

10 Reasons Why We Wake Up To Pee At Night. When you have frequent urge to use the washroom at night, a good night’s sleep can turn into a real bad one.
Desktop Bottom Promotion