For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంలో 10 సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్

తల్లి చేసే మేలు ఉల్లి కూడా చేయదు అనేది నానుడి. ఇప్పుడు ఆ కోవలోకి నిమ్మ కాయ కూడా చేరింది అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. రుచికి పుల్లగా ఉండడంతో దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది మన శరీరానికి

|

తల్లి చేసే మేలు ఉల్లి కూడా చేయదు అనేది నానుడి. ఇప్పుడు ఆ కోవలోకి నిమ్మ కాయ కూడా చేరింది అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. రుచికి పుల్లగా ఉండడంతో దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్.

సాధారణంగా చాలా వరకూ డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు 'విటమిన్ సి' అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ 'విటమిన్ సి' మన శరీరం విటమిన్ సి 8 అనుబంద విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు.

విటమిన్ సిలో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల యాక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్, మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది.

వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, విటమిన్ సి అధికమైన కొన్ని దుష్ప్రభాలు కూడా కలుగుతాయి. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

స్టొమక్ అప్ సెట్ :

స్టొమక్ అప్ సెట్ :

నిమ్మరసంను అలాగే ఫ్రెష్ గా తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ కు కారణమవుతుంది. మన శరీరంలోకి తీసుకునే అన్ని రకాల ఆహారాలు జీర్ణం అవుతాయనుకోవడం పొరపాటు, నిమ్మరసం ఇతర పదార్థాలు, ద్రవాలతో చేర్చి తీసుకుంటే తేలికగా జీర్ణం అమవ్వడం మాత్రమే కాదు, జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఫ్రెష్ గా అలాగే నేరుగా, ఎలాంటి పదార్థాలు మిక్స్ చేయకుండా తీసుకోవడం వల్ల పొట్టలో అసిడ్ లెవల్స్ ను ఎక్కువగా పెంచుతుంది. దాంతో జీర్ణాశయంకు హానిక కలుగుతుంది. పొట్టనొప్పి, లూజ్ మోషన్ కు దారితీస్తుంది.

గ్యాస్ట్రో ఈసోఫోల్ రిఫ్లెక్స్ డిసీజ్ :

గ్యాస్ట్రో ఈసోఫోల్ రిఫ్లెక్స్ డిసీజ్ :

దీన్ని సాధారణంగా అసిడిక్ రిఫ్లెక్స్ ’ అని పిలుస్తారు, అటువంటి ఫుడ్స్ లో నిమ్మరసం ఒకటి. ఈ ఫ్రూట్ లో అసిడిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మజిల్స్ మరియు ఈసోఫోగస్ నుండి సపరేట్ చేస్తుంది. ఇది పొట్టలో ఆమ్లాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి వల్ల ప్రేగుల్లో ఇంటర్నల్ లైనింగ్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ లక్షణాలకు దారితీస్తుంది. వీటిలో కొన్ని హార్ట్ బర్న్, వికారం, వాంతులు, చెస్ట్ పెయిన్, గొంతు నొప్పి వంటి వాటికి దారితీస్తుంది.

పెప్టిక్ అల్సర్ :

పెప్టిక్ అల్సర్ :

నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ప్రేగుల్లో అంతర్గత లైనింగ్ ను దెబ్బతియ్యడం వల్ల పెప్టిక్ అల్సర్ పెరుగుతుంది.

 గాల్ బ్లాడర్ , కిడ్నీ స్టోన్స్ :

గాల్ బ్లాడర్ , కిడ్నీ స్టోన్స్ :

నిమ్మరసం, నిమ్మతొక్క ను వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిమ్మతొక్కలో ఆక్సాలేట్స్ అత్యధికంగా ఉండటం వల్ల, ఈ ఆక్సాలేట్స్ శరీరంలో క్రిస్టల్స్ గా మార్పు చెందుతాయి. ఇది క్యాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. క్యాల్షియం బాడీలో శోషణ జరగకపోవడం వల్ల కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గా ఏర్పడుతాయి .

 ఐరన్ శోషణ :

ఐరన్ శోషణ :

నిమ్మరసం, సిట్రిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ వీటిని గ్రహించి, ఐరన్ గా మార్చడంలో విఫలం అవుతుంది. క్రమంగా మన శరీరంలో ఉండే ఐరన్ ఉండాల్సిన దానికి కంటే ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలా ఐరన్ అధికం కావడం వల్ల హీమో క్రొమటోసిస్, లేదా ఐరన్ ఓవర్ లోడ్ అవంటి హెల్త్ డిజార్డర్స్ కు గురిచేస్తుంది

ఫ్రీక్వెంట్ యూరినేషన్ :

ఫ్రీక్వెంట్ యూరినేషన్ :

నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ వల్ల విటమిన్ సి అధికంగా ఏర్పడుతుంది. శరీరానికి విటమిన్స్ చాలా అవసరం అవుతాయి. ఈ విటమిన్ సి ఫ్రూట్స్ నేచురల్ డ్యూరియాటిక్ గా మారుతుంది. నిమ్మరసం ఎక్కువగా ఉపయోగించడం వల్ల యూరినేషన్ పెంచుతుంది. దాంతో ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది

మైగ్రేన్ తలనొప్పి:

మైగ్రేన్ తలనొప్పి:

నిరంతరం తలనొప్పికి గురి అవ్వడం. కొంత మంది వాతావరణంలో మార్పుల వల్ల తలనొప్పి అని చెబుతుంటారు. మరియు మరికొన్ని సందర్భాల్లో అధిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పికి గురవుతన్నట్లు చెబుతుంటారు. అయితే మీ శరీరంలో విటమిన్ సి ఎక్కువ అవ్వడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ ను మీరు ఎదుర్కొంటుండవచ్చు అని మీరు ఎప్పుడైనా గమనించారా? నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది అక్యుట్ మైగ్రేన్ లేదా క్రోనిక్ టెన్షన్, తలనొప్పి దారితీస్తుంది.

దంత సమస్యలు:

దంత సమస్యలు:

నిమ్మరసం నేరుగా తినడం, లేదా నిమ్మరసంను నేరుగా దంతాలతో స్క్వీజ్ చేయడం వల్ల దంతాలకు హాని కలుగుతుంది. ఓరల్ క్యావిటి తగ్గుతుంది. నిమ్మకాలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ లు టీత్ ఎనామిల్ కు హానికలిగిస్తాయి,. ఇది దంతక్షయం, దంతాల రంగు మారడం, డెంటల్ టిష్యులు దెబ్బతినడం, క్యావిటి సమస్య ఏర్పడుతుంది.

సన్ బర్న్ :

సన్ బర్న్ :

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాము. అయితే ఆరోగ్యానికైనా..అందానికైనా నిమ్మరసంను మితంగా వాడుకుంటేనే మంచిది. లేదంటే సీరియస్ సన్ బర్న్ కు దారితీస్తుంది. స్కిన్ కంప్లెక్షన్స్ ను దెబ్బతీస్తుంది.

జుట్టుకు ఎక్కువగా చిట్లడానికి కారణమవుతుంది:

జుట్టుకు ఎక్కువగా చిట్లడానికి కారణమవుతుంది:

నిమ్మరసంను హెయిర్ వాష్ కు ఉపయోగించడం మంచిదే అయితే, దీన్ని ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తుంటే జుట్టుకు ఎక్కువ హాని కలుగుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ నేచుర్ తలలో డ్రైగా మార్చుతుంది ఇంటర్నల్ గా జుట్టు కణాలను వీక్ గా మార్చుతుంది. అదేవిధంగా జుట్టును వీక్ గా మార్చుతుంది. దాంతో జుట్టు చాలా రఫ్ గా మారుతుంది. . దాంతో జుట్టు రాలే సమస్యలు కూడా పెరుగుతాయి.

English summary

10 Serious Side Effects Of Lemons

Most of us consider lemon as a ‘bliss’ for our health, skin and hair. Well, it actually is and without any doubt. But at the same time, it also comes with a number of adverse side effects. Can’t believe this? Go through the rest of the article to discover the top 10 side effects of this fruit.
Desktop Bottom Promotion