For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్స్ ఆరోగ్యానికి మంచిదే.. మోతాదు మించితే.. అత్యంత ప్రమాదం..!

రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిన అద్భుతమైన ఫుడ్ క్యారట్. కానీ.. దీన్ని మోతాదు మించి తీసుకుంటే.. కలిగే అనర్థాలు అనేకమని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By Swathi
|

క్యారట్స్ ని ఇష్టపడని వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఎందుకంటే.. పచ్చిగా కూడా తినగలిగే వెజిటబుల్ ఇది. అలాగే.. క్యారట్స్ తినడం వల్ల కంటికి, బ్లడ్ కి అన్నింటికీ మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. హెల్తీ ఫుడ్ అయినప్పటికీ.. పరిమితి మించితే.. హానికరమే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

10 Side Effects Of Carrots You Know

సలాడ్స్, స్నాక్స్ రూపంలో క్యారట్స్ ని డైట్ లో చేర్చుకుంటూ ుంటాం. క్యారట్స్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. రోజుకి కేవలం రెండు క్యారట్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సినంత పోషణ అందుతుంది. అలాగే క్యారట్స్ లో విటమిన్ కే, ఏ, సి, మాంగనీస్, పొటాషియం ఉంటాయి.

రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిన అద్భుతమైన ఫుడ్ క్యారట్. కానీ.. దీన్ని మోతాదు మించి తీసుకుంటే.. కలిగే అనర్థాలు అనేకమని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి ఎక్కువగా క్యారట్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయట. మరి అవేంటో చూద్దాం

చిన్న పిల్లలకు మంచిది కాదు

చిన్న పిల్లలకు మంచిది కాదు

చిన్న పిల్లలకు క్యారట్స్ మంచిది కాదని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో క్యారట్ తినిపించాలి. లేదంటే.. సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడాల్సి వస్తుంది.

అలర్జీలు

అలర్జీలు

కొంతమందికి క్యారట్స్ ని అలర్జీని తీసుకొస్తాయి. స్కిన్ ర్యాషెస్, డయేరియా, వాపు వంటి లక్షణాలకు కారణమవుతాయి. స్ట్రాబెర్రీ, బంగాళదుంప, నట్స్ వల్ల ఎలర్జీలతో బాధపడేవాళ్లు క్యారట్స్ ని కూడా తీసుకోకపోవడం మంచిది.

షుగర్ ఎక్కువ

షుగర్ ఎక్కువ

డయాబెటిస్ తో బాధపడేవాళ్లు క్యారట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇందులో ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది. కాబట్టి.. షుగర్ శరీరంలో గ్లూకోజ్ గా మారి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి.. డయాబెటిస్ తో బాధపడేవాళ్లు తక్కువ మోతాదులో.. అది కూడా ఉడికించిన క్యారట్స్ తీసుకోవడం మంచిది.

అలవాటుగా మారే అవకాశం

అలవాటుగా మారే అవకాశం

కొంతమంది ప్రతిరోజూ క్యారట్స్ తినడం అలవాటుగా మారి ఉంటుంది. దీనివల్ల క్యారట్స్ కి అడిక్ట్ అవుతారు. క్యారట్స్ తినే అలవాటు వల్ల చిరాకు, నిద్రలేమి, ఆందోళన వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ పడతాయి.

పాలు ఇచ్చే తల్లులు తీసుకోకూడదు

పాలు ఇచ్చే తల్లులు తీసుకోకూడదు

క్యారట్స్ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యం. కానీ క్యారట్స్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ఫ్లేవర్ మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు.. క్యారట్స్ జ్యూస్ ని ఎక్కువ మొత్తంలో తాగకూడదు.

కొన్ని వ్యాధులు

కొన్ని వ్యాధులు

డయాబెటిస్, బోవెల్ ప్రాబ్లమ్స్, లో షుగర్ లెవెల్, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు డైట్ లో క్యారట్స్ చేర్చుకునే ముందు.. డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే.. ఈ వ్యాధులతో బాధపడేవాళ్లు క్యారట్స్ తీసుకోవడం వల్ల లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్

క్యారట్స్ లో 12 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫైబర్ డైజెస్ట్ అవకపోతే.. పేగులలో పేరుకుపోయి.. గ్యాస్ట్రిక్, పొట్టనొప్పి, బ్లోటింగ్ కి కారణమవుతాయి.

English summary

10 Side Effects Of Carrots You Know

10 Side Effects Of Carrots You Should Be Aware Of. Carrots remind us of bugs bunny! They are crunchy and included in many salads or simply eaten raw as a snack.
Story first published: Tuesday, November 22, 2016, 13:42 [IST]
Desktop Bottom Promotion