For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ ఫెయిల్ అవుతోందని సూచించే డేంజరస్ సిగ్నల్స్..!

కిడ్నీలకు సంబంధించి ఏ మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. కాబట్టి కిడ్నీల డ్యామేజ్ సూచించే డేంజర్ సంకేతాల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం.

By Swathi
|

తాజా అధ్యయనాల ప్రకారం గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తర్వాత స్థానాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉన్నాయట. ఇటీవల చాలామంది కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 90 శాతం మంది ఇండియన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లేనని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

10 Symptoms That Indicate Your Kidney Is Failing

రక్తంలోని అనవసర పదార్థాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీల ప్రధాన ప్రక్రియ. ఫ్యాటీ యాసిడ్స్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం ఎక్కువవుతోంది. దీనివల్ల పరిమితికి మించి కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతున్నాయి.

కిడ్నీలు బ్లడ్ ప్రెజర్, ఎలక్ట్రోలైట్స్, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి వంటి వాటికి కూడా సహాయపడతాయి. కాబట్టి శరీరంలో కిడ్నీలు చాలా అవసరమైనవి. చాలా ముఖ్యమైన అవయవాలు. కాబట్టి ఇండియన్స్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని.. నీళ్లు బాగా తాగలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాట్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ దూరంగా ఉండటం వల్ల కిడ్నీల పనితీరు సజావుగా సాగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కిడ్నీలకు సంబంధించి ఏ మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. కాబట్టి కిడ్నీల డ్యామేజ్ సూచించే డేంజర్ సంకేతాల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

యూరిన్

యూరిన్

యూరిన్ కలర్ మారడం, కొన్నిసార్లు డార్క్ గా కనిపించడం, అలాగే యూరిన్ కి వెళ్లినప్పుడు ఇబ్బంది ఫేస్ చేయడం, తక్కువగా మోతాదులో యూరిన్ చేయడం లేదా ఎక్కువగా యూరిన్ చేయడం వంటి లక్షణాలన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ ని సూచిస్తాయి.

జాయింట్స్ లో వాపు

జాయింట్స్ లో వాపు

మోకాళ్లు, కీళ్లు, ముఖంలో వాపు కనిపిస్తోంది అంటే అలర్ట్ అవ్వాలి. కిడ్నీ పనితీరు సరిగా లేనప్పుడు, బలహీనంగా మారినప్పుడు, ఎక్కువ మోతాదులో ఫ్లూయిడ్స్ శరీరం నుంచి బయటకు వెళ్లిపోవడం వల్ల ఇలా జాయింట్స్ లో వాపు వస్తుంది. ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ ని సూచిస్తాయి.

తరచుగా శ్వాస అందకపోవడం

తరచుగా శ్వాస అందకపోవడం

తరచుగా శ్వాస అందకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే.. కిడ్నీ ఫెయిల్యూర్ కి సంకేతం. దీనికి ప్రధాన కారణం.. శరీరంలో ఎక్కువ టాక్సిన్స్ పేరుకుపోవడం. దీనివల్ల ఎర్రరక్తకణాలు శరీరంలో తగ్గిపోతాయి. దీనివల్ల శరీరం సరైన ఆక్సిజన్ లెవెల్స్ ని పొందలేకపోతుంది.

మెటాలిక్ టేస్ట్

మెటాలిక్ టేస్ట్

నోట్లో మెటాలిక్ టేస్ట్ ఉందంటే రక్తంలో వేస్ట్ ఉన్నప్పుడు ఆహారం టేస్ట్ లో మార్పు వస్తుంది. ఇది కూడా చాలా దుర్వాసనకు కారణమవుతుంది. ఆహారంలో హఠాత్తుగా మార్పులు, ఆకలి తగ్గిపోవడం కూడా కిడ్నీ డ్యామేజ్ కి సంకేతం.

మెమరీ లాస్

మెమరీ లాస్

ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయితే.. మెదడుకి అందాల్సిన ఆక్సిజన్ తగ్గుతుంది. దీనివల్ల మైకం, మెమరీ కోల్పోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన నొప్పి

తీవ్రమైన నొప్పి

పక్కటెముకల కింది భాగంలో చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది అంటే.. కిడ్నీ స్టోన్ ఉందని సంకేతం. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, నొప్పి కూడా.. కిడ్నీ ఫెయిల్యూర్ ని సూచిస్తాయి.

అలసట

అలసట

కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే.. అవి శరీరంలో ఎర్రరక్తకణాలను పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఆక్సిజన్ ని పెంచుతాయి. అది శరీరం మొత్తం సరఫరా అవుతుంది. ఒకవేళ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గితే.. అది అలసటకు, కండరాలు, బ్రెయిన్ ప్రాబ్లమ్ కి కారణమవుతుంది.

కళ్లు

కళ్లు

కిడ్నీల ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లినప్పుడు కళ్లు వాపులు వస్తాయి. ఇలాంటి లక్షణం కనిపించగానే డాక్టర్ ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అలాగే కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

కండరాలు

కండరాలు

ఎలక్ట్రోసైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కిడ్నీ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ మీరు రోజంతా కండరాల నొప్పులతో బాధపడుతుంటే.. కిడ్నీలపై దుష్ర్పభావం చూపుతోందని గ్రహించాలి.

చర్మంపై దురద

చర్మంపై దురద

మీ రక్తంలో మినరల్స్, ప్రొటీన్స్ ని సరైన మోతాదులో కిడ్నీలు బ్యాలెన్స్ చేయలేకపోతే.. చర్మంపై దురద మొదలవుతుంది. దురద ఎక్కువగా ఉన్నప్పుడు క్రీములు, మందులు వాడటం కంటే.. ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

English summary

10 Symptoms That Indicate Your Kidney Is Failing

10 Symptoms That Indicate Your Kidney Is Failing. It is important to keep a tab on the symptoms of kidney failure that your body shows. Read this article to find out about the various signs that you must take notice before it's too late.
Story first published: Friday, December 2, 2016, 15:44 [IST]
Desktop Bottom Promotion