For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫీవర్ బ్లిస్టర్స్(జ్వరంతో వచ్చే నోటి పొక్కులు) నయం చేసే సింపుల్ రెమెడీస్..!

|

చాలా మందికి పెదాల అంచుల మీద నీటి పొక్కులమాదిరిగా వస్తుంటాయి. వేడి చేసి వస్తుందని కొందరంటే, బల్లి మూత్రం వల్ల అని కొందరు చెబుతుండటం మీరు గమనించే ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది వైరస్ వల్ల వస్తుందని చాలా మందికి తెలియదు. పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫివర్ బ్లిస్టర్స్ అంటారు. ఇవి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ''హెర్పీస్ సింప్లెక్ష్'' వలన వస్తాయి. టీబీ, సిఫిలిస్, లుకేమియా, ఎనీమియా, ఏదైనా మందుల వల్ల, అలర్జీ వంటి వాటివల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి నుంచి రెండు వారాల్లో ఇవి వాతంతట అవే తగ్గిపోయి... మళ్లీ శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడో బయటపడటం సాధారణం. ఈ నీటిపొక్కులు అంటువ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు కనబడుతాయి. జ్వరం వల్ల వచ్చే బొబ్బలు పెదాలు, గెడ్డం, బుగ్గల మరియు ముక్కుకు దగ్గరలో కనబడుతుంటాయి .

అయితే ఈ ఫీవర్ బ్లిస్టర్స్ జ్వరం వల్ల మాత్రమే కాదు, ఒత్తిడి, హార్మోనల్ అసమతౌల్యం, పెదాలకు గాయం అయినప్పుడు, పీరియడ్స్, మరియు కాస్మోటిక్ సర్జరీల వల్ల కూడా రావచ్చు. కానీ లక్షణాలు మాత్రం వ్యక్తికి, మరో వ్యక్తికి మద్య తేడా ఉంటుంది. అయితే కొంతదరిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, తలనొప్పి, పెదాలు ఉబ్బడం, లింప్ నోడ్స్ లో వాపు మరియు దురద కనబడుతుంది. ఈ ఫీవర్ బ్లిస్టర్స్ ను ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల , ఒక వేళ బ్లిస్టర్స్ వచ్చిన వాటిని తాకకుండుట వల్ల, ఇవి వచ్చిన వారిని తాకకుండుట, వారు వాడిన వస్తువులను తాకకుండా ఉండటం వల్ల నివారించుకోవచ్చు.

ఈ కోల్డ్ సోర్స్ ను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే ఈ సింపుల్ హోం రెమెడీస్ తోనే మనం ఫీవర్ బ్లిస్టర్స్ ను నివారించుకోవచ్చు. మరి ఆ సింపుల్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఫీవర్ బ్లిస్టర్స్ ను బేకింగ్ సోడా నివారిస్తుంది. మరియు ఇది నొప్పి మరియు అసౌకర్యాన్ని నివారిస్తుంది . బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి . 10 నిముషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

సాల్ట్ :

సాల్ట్ :

ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఫీవర్ బ్లిస్టర్స్ ను నయం చేయడానికి ఇది బెస్ట్ రెమెడీ. తడి చేతులను సాల్ట్ మీద అద్ది, జ్వర పొక్కులున్న ప్రదేశంలో అప్లై చేయాలి. లేదా వాటిమీద ఒత్తి పట్టుకోవాలి. ఇలా చేస్తే త్వరగా నయమవుతుంది.

పెరుగు:

పెరుగు:

కొద్దిగా ఎగ్ వైట్ ను పెరుగుతో చేర్చి మిక్స్ చేసి బ్లిస్టర్ మీద అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

టీ బ్యాగ్:

టీ బ్యాగ్:

టీ బ్యాగ్ ను వేడి నీటిలో డిప్స్ చేసి బ్లాస్టర్ మీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రెస్ చేస్తుండాలి. దీన్ని రోజులో రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

అలోవెర:

అలోవెర:

కలబందలో ఉండే ఔషధగుణాల వల్ల బ్లిస్టర్స్ యొక్క చికాకును మరియు సలుపును తగ్గిస్తుంది. అలోవెరలో ఉండే కెమికల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు బ్లిస్టర్స్ ను తగ్గిస్తుంది.

పాలు:

పాలు:

పాలలో ఉండే క్యాల్షియం వైరస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నయం చేసే గుణాలు పాలలో మెండుగా ఉన్నాయి . దాంతో బ్లిస్టర్స్ ను చాలా త్వరగా తగ్గించేస్తుంది. కాటన్ బాల్ ను పాలలో డిప్ చేసి బ్లిస్టర్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. రోజులో రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

బ్లిస్టర్ పెయిన్ నుండి ఉపశమనం కలిగించడంలో ఉల్లిపాయలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫీవర్ బ్లిస్టర్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది . ఉల్లిపాయ పేస్ట్ ను అప్లై చేసి 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఫీవర్ బ్లిస్టర్స్ కు ఒక ఉత్తమ హోం రెమెడీస్ వెల్లుల్లి. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి, బొబ్బల మీద అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బయోటిక్ లక్షణాలు బ్లిస్టర్స్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి ఫీవర్ బ్లిస్టర్స్ ను గ్రేట్ గా నివారిస్తాయి. కాటన్ బాల్ ను డిప్ చేసి ఫీవర్ బ్లిస్టర్ మీద అప్లై చేయాలి.

పెప్పర్ మింట్ ఆయిల్ :

పెప్పర్ మింట్ ఆయిల్ :

కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆియల్ తీసుకుని బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. ఇది ఫీవర్ బ్లిస్టర్ ను ఎఫెక్టివ్ గా నయడం చేయడానికి సహాయపడుతుంది.

ఐస్:

ఐస్:

ఐస్ క్యూబ్స్ ఫీవర్ బ్లిస్టర్స్ కోల్డ్ కంప్రెసర్ వల్ల వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది . మరియు బ్లిస్టర్స్ ను నివారిస్తుంది.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫీవర్ బ్లిస్టర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. టీట్రీ ఆయిల్ ను షేక్ చేసి బొబ్బల మీద రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది . బ్లిస్టర్స్ త్వరగా నయం అవుతాయి.

English summary

12 Amazing Home Remedies For Fever Blisters

Small painful sores that normally occur around your lips in clusters, cheeks, nostril or your genital parts are not canker sores. Do not mistake. Those are fever blisters caused by a virus called herpes simplex.
Story first published: Saturday, October 8, 2016, 16:27 [IST]
Desktop Bottom Promotion