For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ ఫాయిజనింగ్ అయినప్పడు ఫాలో అవ్వాల్సిన టిప్స్

|

ఆధునికీరణ తెచ్చిన మార్పులు ఆహారపు అలవాట్లను కూడా మార్చేశాయి. ప్రయాణాలు చేయడం, ఇంట్లో వండుకునే తీరిక లేకపోవడం, తినడానికి కూడా సమయం కేటాయించలేకపోవడం.. లాంటి అనేక కారణాలు బయటి ఆహారానికి అలవాటుపడేలా చేస్తున్నాయి. ప్రత్యేకించి ఏదైనా సమస్య వస్తే తప్ప ఆహారం గురించి జాగ్రత్తపడం. ఎక్కడ పడితే అది, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు.. ఇలా ఒక పద్ధతి అంటూ లేకుండా తినడమే కొంప ముంచుతోంది. సరైన పోషకాలు సమపాళ్లలో రాకపోవడం ఒక ఎత్తయితే, కలుషితమైన నీరు, ఆహారం మరో ఎత్తు. ఏ పానీపూరి బండినో కన్పించేసరికి ఆగిపోతాం. అక్కడ రుచి, వాసన ఒకటే పనిచేస్తాయి. ఏ నీళ్లు వాడుతున్నారు, మురికి గుడ్డకి చేయి తుడుచుకుని అదే చేత్తో పానీపూరీ పెడుతున్నాడా వంటి విషయాలను పట్టించుకోం. అక్కడ ఇష్టానిదే పెద్ద పీట.

ప్రత్యేకించి ఏ సమస్య అయినా వచ్చినప్పుడే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉంటాం. కొలెస్ట్రాల్ పెరుగుతుందని కోడిగుడ్డు పచ్చసొనను వదిలేస్తాం. బరువు పెరగకుండా, జబ్బులు రాకుండా కాస్త చూసుకుని తింటాం. డైటీషియన్లు చెప్పే సమతులాహారాన్ని పాటించే ప్రయత్నం చేస్తాం. జబ్బులు వచ్చేవరకు కాకుండా ముందుగానే ఆహారం రంగు, రుచి కాకుండా పోషకాలతో పాటు, అది సురక్షితమైనదేనా కాదా అని చూసుకోవడం ప్రధానం.

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో, పార్టీ కల్చరనో, లేక టైమ్ లేదనో లేదా ఒంటరిగా ఉన్నారనో, బయట ఆహారాలకు అలవాటు పడుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కారణం ఏదైనా వకాచ్చు చాలా మంది ప్రజలు బయట వారికి ఇష్టమైన రెస్టారెంట్లలో, ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు కాబట్టే రెస్టారెంట్లలో కూడా వివిధ రకాల వెరైటీ ఆహారాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా తరుచూ తింటూపోతుంటే, కడుపు చాలా అసౌకర్యంగా మరి, చివరకు ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది.

ఫుడ్ పాయిజన్ అనే మాట తరచూ వింటుంటాం... దీంతో కడుపులో ఇబ్బందికరంగా ఉండటం. కొడుపునొప్పి, వాంతులు, విరేచనాలుంటాయి. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, నూనె పదార్థాల కారణంగా ఫుడ్ పాయిజన్ కలుగుతుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే తమ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. నూనెతో చేసిన పదార్థాలు తీసుకోకపోవడం ఉత్తమం. తక్కువగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. తరచూ తాజా పండ్లను సేవించండి. అలాగే పుడ్ పాయిజన్ వచ్చినప్పుడు కనీసం 48గంటల సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో మీ స్టొమక్ అప్ సెట్ ను నివారించడానికి అనేక మంచి ఆహారాలు కూడా ఉన్నాయి.

ఈ సమస్యను నివారించుకోవడం కోసం పిల్లల్ల నుండి పెద్దల వరకూ హాస్పిటల్ పాలవుతున్నారు. అలోపతి ట్రీట్మెంట్ తీసుకొనే ముందు కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ను ప్రయత్నించి చూడండి. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కొన్ని హోం రెమడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంతేకాదు కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ కంటే హోం రెమెడీస్ సురక్షితమైనవని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఫుడ్ పాయిజన్ నివారించడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్... ఈ క్రింది విధంగా...

అల్లం:

అల్లం:

ఫుడ్ పాయిజనింగ్ కు కారణం వికారం, హార్ట్ బర్న్, అసౌకర్యం. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి అల్లం గ్రేట్ గా పనిచేస్తుంది.ఫుడ్ పాయిజన్ ను నివారించడంలో ఒక ఉత్తమ ఇంటి చిట్కా అల్లం. స్టొమక్ అప్ సెట్ ను నివారించడంలో ఒక అద్భుత యాంటీబయోటిక్. కాబట్టి తురిమిని అల్లంను మీ డైట్ లో చేర్చుకోండి.

నిమ్మరసం

నిమ్మరసం

ఫుడ్ పాయిజన్ కు నిమ్మ ఒక ఉత్తమ నివారిణిగా సూచిస్తారు. నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్టొమక్ అప్ సెట్ కు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే గుణాలు నిమ్మరసం అధికంగా ఉన్నాయి. కాబట్టి, డైట్ లో నిమ్మరసాన్ని చేర్చుకోండి.గోరువెచ్చగా ఉండే నిమ్మరసంను తాగడం వల్ల వేగంగా తగ్గించుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

స్టొమక్ అప్ సెట్ నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఇతర వ్యాధులను ధరించేరకుండా నిరోధిస్తుంది.ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు టీస్పూన్ల వెనిగర్ ను ఒక కప్పు వేడి నీటిలో పోసి, భోజనానికి ముందు తాగాలి

తులసి:

తులసి:

కడుపు డిజార్డర్స్ మరియు ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో తులసి అద్భుత ఔషదం. ఒక కప్పు తులసి టీ త్రాగడం లేదా వంటల్లో తులసి ఆకులను జోడించడం వల్ల, కడుపులోని చెడు బ్యాక్టీరియాల నుండి ఉపయశమనం కలిగిస్తుంది . యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలోని అసౌకర్యాన్ని తొలగిస్తుంది. ఒక రోజులో రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అరటి పండ్లు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, అరటిపండులోని అత్యధిక శాతం పొటాషియం కంటెంట్ కడుపుకు ఉపశనమనం కలిగించి బ్యాక్టీరియాను చంపేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంగీ ఫంగల్ లక్షణాలు ఫుడ్ ఫాయిజనింగ్ నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ . డయోరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది . పొట్టనొప్పి తగ్గిస్తుంది. ప్రతి రోజూ వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఇటువంటి సమస్యలు దూరమవుతాయి.

చల్లటి పాలు:

చల్లటి పాలు:

కోల్డ్ మిల్క్ తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ నుండి ఉపశమనం పొందవచ్చు. . ఇది పొట్ట సమస్యలను స్మూత్ గా చేయడం మాత్రమే కాదు, వాంతులను, వికారాన్ని తగ్గిస్తుంది.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్ర ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాపడుతుంది . ఒక స్పూన్ జీలకర్రపొడి మీరు తయారుచేసే ఆహారంలో జోడించండి . ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోండి. ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే మెండి జీవులను నాశనం చేస్తుంది . జీలకర్రను నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి.

 ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఫుడ్ పాయిజనింగ్ నుండి తక్షణ ఉపశమన పొందడానికి ఆపిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఆపిల్స్ బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి . ఇన్ స్టాంట్ రిఫీల్ కలిగిస్తాయి . ఆపిల్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

తేనె:

తేనె:

తేనెలో పొట్ట సమస్యలను నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్ానయి . ఇవి అజీర్తిని నివారిస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది .ప్రతి రోజూ ఒక టీస్పూన్ తేనె తిటుండాలి.

మింట్ టీ:

మింట్ టీ:

ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు మరో బెస్ట్ హోం రెమడీ పుదీనా . స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది అద్బుతంగా సహాయపడుతుంది. ఫుడ్ పాయిజినింగ్ అయినప్పుడు పుదీనా జ్యూస్ లేదా రసాన్ని తాగడం ఉత్తమం. లేదా టీ తీసుకోవడం మంచిది

చికెన్ సూప్:

చికెన్ సూప్:

ఫుడ్ పాయిజనింగ్ సమయంలో చికెన్ సూప్ తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ రీస్టోర్ అవుతుంది . శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది . చికెన్ బ్రోత్ ఫుడ్ పాయిజన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . దీనిలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

English summary

12 Best Foods To Cure Food Poisoning

Food poisoning is one of those bacterial attacks that can happen to anyone at any given time. Often, it gets cured within 2 days, automatically. If not, then you need to consult a physician. You can also try some natural ways to recover from food poisoning.
Desktop Bottom Promotion