For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రుల ఉపవాసాల్లో ఇన్ స్టాంట్ ఎనర్జీని అందించే 12 సూపర్ ఫుడ్స్

By Super Admin
|

తూర్పు భారత దేశంలో అతి పెద్ద పండుగ అయిన దేవీ నవరాత్రులు దగ్గరలోనే ఉన్నాయి.తూర్పు, పశ్చిమ,ఉత్తర మరియూ మధ్య భారత ప్రజలు ఈ తొమ్మిది రోజులూ శ్రద్ధతో ఉపవసిస్తారు.

ఉపవాస సమయాల్లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ శక్తినిచ్చే ఆహారాన్ని తినడం చాలా అవసరం.దుర్గా నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒకొక్క దుర్గా మాత అవతారాన్ని పూజిస్తూ చాలా మంది ఉపవాసం చేస్తారు.కొంత మంది మాత్రం కేవలం మొదటి,చివరి రోజులు మాత్రమే ఉపవసిస్తారు.

ఈ తొమ్మిది రోజులూ ఉపవాసం చేసేవారు మాంసం,ఉల్లి,వెల్లుల్లి,త్రుణ ధాన్యాలు,మద్యం తీసుకోకుండా ఉంటారు.ఇంకొంతమంది మాంసాహారం పూర్తిగా మానేస్తారు.కొంతమందేమో మామూలు ఉప్పుకి బదులు శుద్ధి చెయ్యకుండా స్వచ్చంగా ఉండే రాళ్ళుప్పు వాడతారు,

ఉపవాస సమయంలో శరీరానికి శక్తిని అందివ్వడంతో పాటు తేమ కోల్పోకుండా చూడటం చాలా ముఖ్యం.తగినంత నీరు తీసుకుంటూ పండ్ల రసాలు కూడా తాగితే శరీరానికి తేమ అంది శక్తి కూడా పొందుతారు.

ఉపవాస సమయాల్లో మీకు శక్తిని అందించే 12 సూపర్ ఫుడ్స్ ఇవిగో..చూఒడండి మరి.

తాజా కూరలు:

తాజా కూరలు:

తాజా కూరలు ముఖ్యంగా ఆకు కూరలైన పాల కూర,క్యాబేజీ లాంటి కూరలు,టమాటా,ఆనపకాయ(సొరకాయ)లు ఎక్కువగా తీసుకుంటే పోషకాలు మరియూ పీచు కూడా అందుతాయి.ఈ కూరలు శరీరం నీటిని కోల్పోకుండా చేసి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి.

పాలు:

పాలు:

కాల్షియం తదితర పోషకాలున్న పాలు తీసుకుంటే ఉపవాస సమయంలో శరీరానికి చాలా మంచిది.

సగ్గు బియ్యం కిచిడీ:

సగ్గు బియ్యం కిచిడీ:

కార్బోహైడ్రేట్లు మరియూ పిండి పదార్ధాలు కలిగిన ఈ కిచిడీ ఉపవాస సమయంలో మీ శరీరానికి కావాల్సిన శక్తినివ్వడమే కాకుండా త్వరగా కూడా జీర్ణమవుతుంది.

పండ్లు:

పండ్లు:

ఆపిల్,నారింజ,పుచ్చకాయ,అవకాడో లాంటి ఫలాలు ఈ సమయంలో తీసుకుంటే కావాల్సిన పోషకాలే కాకుండా శరీరానికి కావాల్సిన తేమ కూడా అందుతుంది.

ఖర్జూరాలు:

ఖర్జూరాలు:

ఉపవాస సమయాల్లో ఖర్జూరాలు తీసుకుంటే శరీరంలో చక్కెర నిల్వలని సమతూకంలో ఉంచుతాయి.

ఆపిల్ ఖీర్:

ఆపిల్ ఖీర్:

పంచదార లేకుండా కేలొరీలు తక్కువ ఉన్న ఈ పాయాసం నవరాత్రుల ఉపవాసాల్లో మంచి ఎంపిక.

పెరుగు:

పెరుగు:

విటమిన్లు, కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం మరియూ మంచి బాక్టీరియా కలిగిన పెరుగుని ఉపవాస సమయంలో తీసుకుంటే శరీరానికి శక్తిని అందించినవారమవుతాము.

తేనె:

తేనె:

పంచదారకి బదులుగా తేనె వాడితే శరీరానికీ మరియూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు:

ఉపవాసం చేస్తున్నప్పూడు మీ శరీరానికి నిరంతరం నీరు అందించడం చాలా అవసరం.యాంటీ ఆక్సిడెంట్లు,అమైనో ఆసిడ్స్,విటమిన్లు,కాల్షియం, ఇనుము లాంటి పోషకాలతో నిండిన కొబ్బరి నీళ్ళకి మించిన పానీయం ఇంకోటి లేదు.ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

మజ్జిగ:

మజ్జిగ:

ఉపవాసంలో ఉన్నప్పూడు శరీరానికి కావాల్సీన్ నీరుని మజ్జిగ రూపంలో అందించవచ్చు.ఎలక్ట్రోలైట్స్‌తో నిండిన మజ్జిగ తీసుకుంటే ఉపవాస సమయంలో శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేసుగోలుగుతుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

బాదాం,ఎండూ ద్రాక్షలు,వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ మీ ఉపవాసం మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఇనుము, విటమిన్ సీ,కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తదిదత పోషకాలున్న నిన్న రసం తాగితే మీరు ఉపవాసం చేస్తున్నప్పుడూ కావాల్సిన శక్తి వస్తుంది.

English summary

12 Super Foods That Help Provide Energy During Navratri Fasting

The biggest of all the Hindu festivals, Navratri which is also widely known as Durga Puja in the Eastern part of India is just round the corner. Fasting on all nine days during Navratri is something which most people across north, west and central India do religiously.
Story first published: Tuesday, September 27, 2016, 7:56 [IST]
Desktop Bottom Promotion