For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు ఫ్రిడ్జ్ లో పెడితే.. విషపూరితమే.. !! ఎందుకు ?

By Swathi
|

మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా ? నిజమే.. ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎడాపెడా.. దొరికిన పదార్థాలన్నీ అందులో తోసేస్తున్నారా ? ఏ వస్తువు తీసుకొచ్చినా.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే.. ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే అవకాశం ఉంది.

మగవాళ్లు, ఆడవాళ్లలో లైంగిక సామర్థ్యాన్నిపెంచే పవర్ ఫుల్ ఫుడ్స్ మగవాళ్లు, ఆడవాళ్లలో లైంగిక సామర్థ్యాన్నిపెంచే పవర్ ఫుల్ ఫుడ్స్

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. ఏ మాత్రం ఫుడ్ మిగిలినా.. వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం అందరికి అలవాటు. అలాగే ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్ లో చేర్చడం చాలామందికి అలవాటుగా మారిపోయింటుంది.

హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్ హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుుడు చూద్దాం..

బ్రెడ్

బ్రెడ్

సాధారణంగా బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది త్వరగా డ్రై అవుతుంది. దీనివల్ల బ్రెడ్ తినడానికి ఫ్రెష్ గా అనిపించదు. కాబట్టి రూమ్ టెంపరేటర్ లో పెట్టాలి. లేదా చల్లగా ఉండే కప్ బోర్డ్ లో లేదా బ్రెడ్ బాక్స్ లో పెడితే.. ఫ్రెష్ గా ఉంటుంది.

కొన్ని రకాల పండ్లు

కొన్ని రకాల పండ్లు

అవకాడో, యాపిల్స్, అరటిపండ్లు, నారింజ, బెర్రీస్, పీచ్, ఆప్రికాట్ వంటి ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలి అనుకుంటే.. తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరంజ్, నిమ్మకాయలను రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవడం మంచిది. కట్ చేసిన అవకాడో ఫ్రూట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

టమోటా

టమోటా

టమోటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్సవుతుంది. అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయటే పేపర్ బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది.

కాఫీ

కాఫీ

కాఫీని ఎయిర్ టైట్ కంటెయినర్ లో పెట్టడం వల్ల చాలా మంచి వాసన, తాజాగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది.

పీనట్ బట్టర్

పీనట్ బట్టర్

పీనట్ బట్టర్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కూల్ గా, చీకటిగా ఉండే ప్రాంతంలో పెట్టుకుంటే మంచిది.

తేనె

తేనె

తేనె ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే.. గట్టిగా అవుతుంది. కాబట్టి రూం టెంపరేచర్ లో పెట్టుకోవాలి. అయితే సూర్య రశ్మి తగలకుండా పెట్టడం మంచిది.

హెర్బ్స్

హెర్బ్స్

చాలామంది హెర్బ్స్ ని తీసుకు రాగానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. కానీ హెర్బ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల త్వరగా చెడిపోతాయి. కాబట్టి టైట్ గా ఉండే గ్లాస్ జార్ లో వీటిని పెట్టడం వల్ల తాజాగా, క్రిస్పీగా ఉంటాయి.

బంగాళదుంపలు

బంగాళదుంపలు

బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ పై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి పేపర్ బ్యాగ్స్ లో పెడితే.. తాజాగా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. త్వరగా కుళ్లిపోతాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

పేపర్ బ్యాగ్ లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు తాజాగా ఉంటాయి. అయితే చాలామంది ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి పెడుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. బంగాళాదుంపలు విడుదల చేసే మాయిశ్చరైజర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి.

సలాడ్ డ్రెస్సింగ్స్

సలాడ్ డ్రెస్సింగ్స్

సలాడ్ డ్రెస్సింగ్ లకు ఉపయోగించే వెనిగర్, ఆయిల్ బేసేస్డ్ ప్రొడక్ట్స్ వంటివి ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం మంచిది. క్రీమ్, యోగర్ట్ వంటివి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

ధాన్యాలు

ధాన్యాలు

ధాన్యాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని బయటపెడితేనే.. తాజాగా ఉంటాయి.

కెచప్, సోయా సాస్

కెచప్, సోయా సాస్

కెచప్, సోయా సాస్ ఫ్రిడ్జ్ లో కాకుండా బయటపెడితేనే బావుంటుంది.

ఆయిల్స్

ఆయిల్స్

ఎలాంటి ఆయిల్ అయినా.. రూమ్ టెంపరేటచర్ లో పెట్టడమే సేఫ్. తక్కువ ఫ్యాట్ కంటెంట్ కలిగి ఉండే సన్ ఫ్లవర్ ఆయిల్ వంటివి అయితే.. ఫ్రిడ్జ్ డోర్ లో లేదా.. కూల్ గా ఉండే రూమ్, కప్ బోర్డ్ లో అయినా పెట్టవచ్చు. నట్ బేస్డ్ ఆయిల్స్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

పచ్చళ్లు

పచ్చళ్లు

పచ్చళ్లను బయటపెడితేనే చాలా తాజాగా ఉంటాయి.

క్యాప్సికం

క్యాప్సికం

రెడ్, గ్రీన్, ఎల్లో వంటి క్యాప్సికమ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా.. తాజాగా ఉంటాయి. కాబట్టి పేపర్ బ్యాగ్ లో పెట్టి.. చల్లటి వాతావరణంలో పెట్టాలి.

మెలాన్స్

మెలాన్స్

వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ వంటి ఫ్రూట్స్ ని బయటపెట్టడం మంచిది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే.. పౌడరీగా తయారవుతాయి. దీనివల్ల రుచి మారిపోతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్ లోనే పెటట్డం మంచిది. కట్ చేసిన తర్వాత అయితే.. మూడు నుంచి నాలుగు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

బెర్రీస్

బెర్రీస్

ఫ్రెష్ బెర్రీస్ తక్కువ లైఫ్ ఉంటుంది. కాబట్టి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా.. ఒకటి రెండ్రోజుల్లో తినేయాలి.

జామ్

జామ్

జామ్, జెల్లీస్ లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఒకవేళ ఓపెన్ చేసినా.. బయటేపెట్టాలి.

స్టోన్ ఫ్రూట్స్

స్టోన్ ఫ్రూట్స్

స్టోన్ ఫ్రూట్స్ గా చెప్పే పీచ్, చెర్రీ, ప్లమ్ వంటి ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్, సువాసన ఫ్రిడ్జ్ లో పెడితే తగ్గిపోతుంది. అలాగే త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటే పెట్టుకోవాలి.

మసాలాలు

మసాలాలు

మసాలా దినుసులను ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు.

నట్స్, డ్రై ఫ్రూట్స్

నట్స్, డ్రై ఫ్రూట్స్

నట్స్ , డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. వీటిని బయటేపెట్టవచ్చు.

గుమ్మడి జాతి

గుమ్మడి జాతి

గుమ్మడి జాతికి చెందిన ఎలాంటి కూరగాయలనైనా.. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి కూరగాయలను రూం టెంపరేచర్ లో పెట్టడం మంచిది.

ట్యూనా ఫిష్

ట్యూనా ఫిష్

ట్యూనా ఫిష్ ని సీల్డ్ ప్యాక్ చేసి ఉంటారు. కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు.

English summary

24 foods you should not Keep in Refrigerater!

24 foods you should STOP refrigerating! We're completely aware of how modern refrigeration is a substantial practice in every kitchen and household. It goes a long way in preserving our food and maintaining its quality.
Story first published: Friday, March 4, 2016, 11:54 [IST]
Desktop Bottom Promotion