For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ తినడానికి ఇష్టపడటం లేదా ?

By Swathi
|

క్యాబేజీ అంటే చాలా మంది ఇష్టపడరు. ఇది పెద్దగా రుచికరంగా ఉండదు. దానికి తోడు పచ్చిగా, ఆకుల రూపంలో ఉంటుంది. ఎంత వండినా.. కొద్ది పచ్చి వాసన తగులుతూ ఉంటుంది. దీనివల్ల క్యాబేజీ అంటే పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా ముఖం తిప్పుకుంటారు. కానీ క్యాబేజీలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది అన్ని వయసుల వాళ్లు తప్పక తీసుకోవాల్సినది.

benefits of cabbage

బరువు తగ్గడానికి
క్యాబేజీలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. క్యాబేజీని జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. క్యాబేజీలో ఉండే తార్ర్టోనిక్ అనే యాసిడ్ షుగర్ గా మారి.. ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది.

benefits of cabbage

అల్సర్
క్యాబేజ్ లో విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి కడుపులో ఇబ్బందిపెట్టే అల్సర్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. క్యాబేజ్ రసంలో యాంటీ అల్సర్ గుణాలు ఉంటాయి.

benefits of cabbage

కంటి ఆరోగ్యానికి
క్యాబేజ్ లో బీటా కెరోటిన్ కంటెంట్ ఉంటుంది. ఇది కళ్లలోపల వచ్చే మచ్చల నివారణకు సహాయపడుతుంది. కంటి శుక్లాలు రాకుండా కాపాడటంలోనూ క్యాబేజ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

హై బ్లడ్ ప్రెజర్
క్యాబేజ్ రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది బీపీని అదుపు చేయడానికి సహకరిస్తుంది. అలాగే స్కిన్ ఇన్ఫ్లమేషన్ ని కూడా క్యాబేజీలో ఉండే ఎమినో యాసిడ్స్ తగ్గిస్తాయి.

Story first published:Saturday, January 23, 2016, 17:52 [IST]
Desktop Bottom Promotion