For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని హానికర లక్షణాలు..!

By Swathi
|

ఇటీవల మహిళలు చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్, గర్భాశయ సమస్యలు వంటి రకరకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. అయితే మగవాళ్ల ఆరోగ్యం కూడా చాలా క్రిటికల్ గా మారుతోంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య ఆందోళనలను మగవాళ్లు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు.

మగవాళ్ల డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాల్సిన ఫుడ్స్

మగవాళ్ల విషయానికి వస్తే.. ఎప్పుడు ఏమవుతుందో అన్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది చిన్నవయసులతో హార్ట్ ఎటాక్, ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కారణం ఏదైనా.. మగవాళ్లు మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలను, లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

చెస్ట్ పెయిన్

చెస్ట్ పెయిన్

చాలామంది మగవాళ్లలో వచ్చే చెస్ట్ పెయిన్ హార్ట్ ఎటాక్ రిస్క్ తీసుకొస్తేంది. అయితే ఈ పెయిన్ చాలా రకాల అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ఊపిరిత్తుల పరిస్థితి బాగోలేనప్పుడు ప్నెమోనియా, పల్మనరీ ఎంబోలిజం, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది.

కారణాలు

కారణాలు

ఒత్తిడి విపరీతంగా పెరగడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు స్టమక్ అల్సర్ మగవాళ్లలో చాలా సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీవ్రమైన చెస్ట్ పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

శ్వాస ఆడకపోవడం

శ్వాస ఆడకపోవడం

శ్వాస అందడంలేదని మగవాళ్లలో వచ్చే కామన్ ప్రాబ్లమ్. ఇది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలను సూచిస్తుంది.

కారణాలు

కారణాలు

లంగ్ క్యాన్సర్, క్రోనిక్ బ్రోంచైటీస్, ఆస్తమా, హైపర్ టెన్షన్, అనీమియా కూడా కారణమవుతుంది. ఈ మధ్య మగవాళ్లలో అనీమియా సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి.. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

అలసట

అలసట

చాలామంది మగవాళ్లు రెగ్యులర్ గా అలసట, ఎనర్జీ తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్ మోటివేషన్ లేకపోవడం, నిద్రలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలసట ఫిజికల్, సైకలాజికల్ హెల్త్ కండిషన్ కి కూడా లక్షణం.

కారణాలు

కారణాలు

క్యాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, ఇన్ఫెక్షన్స్, కిడ్నీ, లివర్ సమస్యలు కూడా అలసటతో అనుసంధానమై ఉన్నాయని.. కాబట్టి ఎక్కువగా అలసిపోతున్నట్టు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

డిప్రెషన్

డిప్రెషన్

మగవాళ్లు డిప్రెషన్ కి గురవడానికి ఎక్కువ అవకాశాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. కుటుంబ అవసరాలు తీర్చడం కోసం మగవాళ్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్ వల్ల బ్రెయిన్ పనిచేయకుండా పోతుంది. ఇలాంటప్పుడే కోపం ఎక్కువగా ఉండటం, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువవుతాయి.

మెమరీ లాస్

మెమరీ లాస్

చెక్ బుక్, ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడ పెట్టామనేది మరచిపోవడం అంత సులభమైన విషయం కాదు. మరచిపోవడం అనేది మగవాళ్లు, ఆడవాళ్లలో కామన్. ఇది కొంతమందిలో వయసు కారణంగా వస్తుంది.

కారణాలు

కారణాలు

ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయిన అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ డ్యామేజ్, ఇన్ల్ఫమేషన్ ని సూచిస్తాయి. విటమిన్ డెఫిసియన్సీస్ కూడా మెమరీ లాస్ కి కారణమవుతుంది.

యూరినరీ ప్రాబ్లమ్స్

యూరినరీ ప్రాబ్లమ్స్

మహిళల్లాగే.. మగవాళ్లలో కూడా జెనటికల్ ప్రాబ్లమ్స్ ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్తంతో కూడిన యూరిన్ లేదా యూరిన్ కి వెళ్లేటప్పుడు వచ్చే సమస్యలను మగవాళ్లు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు.

ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రొస్టేట్ క్యాన్సర్

ఇది కిడ్నీ, లేదా లివర్ డిసీజ్ లకు సంకేతం. బ్లడ్ తో కూడిన యూరిన్ ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ స్టోన్, బ్లాడర్ లో వాపుకి సంకేతం. ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. మున్ముందు చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మగవాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కి ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టి.. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

6 common health concerns that men ignore

6 common health concerns that men ignore. Among the many health issues plaguing them, here are the six most common ones that men should not ignore.
Story first published:Tuesday, May 24, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion