For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ లైఫ్ పొందాలంటే.. డైట్ లో ఈ 6 ఆహారాలు కంపల్సరీ..!!

By Swathi
|

మనుషులందరూ డబ్బు సంపాదన, పిల్లల చదువులు, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలను పట్టించుకోరు. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ తలుపుతట్టిన తర్వాత చాలా బెంబేలెత్తుతారు. అప్పటికప్పుడు ఆహార అలవాట్లు, వ్యాయామం, డైట్ అంటూ మొదలుపెడతారు. కానీ ముందు నుంచీ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే.. ఎలాంటి సమస్యలు ఎదురవకుండా జాగ్రత్త పడవచ్చు.

నిద్రకు ముందు ఈ డ్రింక్ తాగితే.. ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరం..!!

మనకు ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో మంది.. అది తినకూడదు, ఇవి తినకూడదు, అలా తినకూడదు, ఇలా తినకూడదు అంటూ.. రకరకాల సలహాలు ఇస్తుంటారు. కొన్ని వండుకుని తినాలని, కొన్నింటిని పచ్చిగానే తినాలని రకరకాల కొత్త కొత్త సలహాలు ఇస్తారు. ఇలాంటి లిస్ట్ ఎండ్ అంటూ ఉండదు.

మీ లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసే 15 హానికర ఆహారాలు..

అయితే మన డైట్ లో కొన్ని రకాల ఆహారాలను మాత్రం ఖచ్చితంగా చేర్చుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, హెల్తీ లైఫ్ అనుభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్ పొందాలంటే.. కేవలం ఆరు రకాల ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలని సూచిస్తున్నారు.

నట్స్

నట్స్

నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ లో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్ నట్స్, బాదాం, పిస్తా, పీనట్స్ ని స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆకలి తగ్గించి, జీర్ణసమస్యలు రాకుండా నివారిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చిట్కా

చిట్కా

రోజుకి 8 నుంచి 10 నట్స్ తీసుకోండి. లేదా సలాడ్స్, ఎడ్స్, పెరుగు, స్మూతీలలో కొన్ని నట్స్ యాడ్ చేసుకుని తీసుకుంటే చాలు. ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతమవుతుంది.

వెజిటబుల్ జ్యూస్

వెజిటబుల్ జ్యూస్

రెగ్యులర్ గా గ్రీన్ వెజిటబుల్ జ్యూస్ తాగాలంటే.. చాలా కష్టంగా ఫీలవుతారు. కేవలం 1 గ్లాసు తాజా కూరగాయల జ్యూస్ తాగడం వల్ల.. మీ వ్యవస్థనంతటినీ.. క్లెన్స్ చేస్తుంది. విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ని గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

చిట్కా

చిట్కా

ఏవైనా మూడు రకాల కూరగాయలను బ్లెండ్ చేసి రెగ్యులర్ గా తీసుకోండి. ఒకవేళ నచ్చకపోతే.. ఫ్లేవర్ మార్చి.. ఒక్కోరోజు ఒక్కో రకం వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. ఇది తయారు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. తయాు చేసిన వెంటనే తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకు స్పినాచ్, గుమ్మడి, క్యారట్.. మూడింటినీ కలిపి జ్యూస్ చేసి తీసుకోవచ్చు.

పెరుగు

పెరుగు

ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. దీని ద్వారా క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి12, ప్రొటీన్ లభిస్తాయి. అలాగే ఇది శరీరానికి రిఫ్రెషింగ్ ఇచ్చి.. చల్లటి అనుభూతిని కలిగిస్తుంది.

చిట్కా

చిట్కా

ఒక కప్పు పెరుగు తినండి లేదా ఒక గ్లాసు మజ్జిగ చేసుకుని తాగండి. కావాలనుకుంటే.. ఏవైనా ఫ్లేవర్స్ కూడా ట్రై చేయవచ్చు. లేదా బెర్రీస్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, హనీ మీకు నచ్చినవి కలుపుకుని.. ఉధయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

ఎగ్స్

ఎగ్స్

ఎగ్స్ మంచి న్యూట్రీషియస్ ఫుడ్స్. ఎగ్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా నివారించడంతో పాటు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఎగ్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. విటమిన్స్, ఐయోడిన్, పాస్ఫరస్ కూడా లభిస్తాయి. ఇవన్నీ ఎముకలు, పంటి ఆరోగ్యానికి చాలా అవసరం.

చిట్కా

చిట్కా

రోజుకి రెండు కోడిగుడ్లను ఎవరైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఉడికించిన లేదా హాఫ్ బాయిల్డ్ ఏ రూపంలో తీసుకున్నా.. హెల్తీనే.

పప్పులు

పప్పులు

ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే.. పప్పు ధాన్యాలు మీకు కావాల్సినన్ని పోషకాలు అందిస్తాయి. ఇవి చాలా ముఖ్యమైన ఆహారాలు. ప్రతి ఒక్కరూ.. డైట్ లో వీటిని కంపల్సరీ చేర్చుకోవాలి. కండరాలు, అవయవాలు పోషకాల ద్వారానే ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గడానికి, ఆకలి తగ్గడానికి, క్యాలరీలు తక్కువగా తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి.

చిట్కా

చిట్కా

ప్రొటీన్స్ పొందడానికి ముఖ్యమైనవి మాంసం, చేపలు, గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్, నట్స్, ధాన్యాలు, గింజలు.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

యాక్నె నుంచి అనీమియా వరకు అన్నింటినీ దూరంగా ఉంచడానికి గ్రేట్ గా హెల్త్ చేస్తాయి ఫ్లాక్స్ సీడ్స్. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు. వీటిని రోజూ తీసుకోవచ్చు. ఇవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ లభించడం వల్ల .. ఇవి క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి.

చిట్కా

చిట్కా

ఎగ్స్, కేక్స్, పెరుగు వంటి వాటిపై ఫ్లాక్స్ సీడ్స్ చల్లుకుని తీసుకుంటే.. మంచి ఫ్లేవర్ తో పాటు, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

English summary

6 Foods That Are Necessary For A Healthy Life

6 Foods That Are Necessary For A Healthy Life. We decided to make life easier by compiling a list of 7 power-packed super foods that must be a part of your lifestyle.
Story first published:Wednesday, May 25, 2016, 10:23 [IST]
Desktop Bottom Promotion