For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పిని గుడ్ బై చెప్పే 6 స్ట్రాంగ్ హెర్బల్ టీలు..

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అందరూ ఏదో ఒక సమయంలో తలనొప్పికి బాధపడుతున్నారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో తలనొప్పికి కారణం స్ట్రెస్, నిద్రలేమి, విశ్రాంతి తీసుకోకపోవడం, డీహైడ్రేషన్ మరియు ఇతర కొన్ని అలర్జీలు. తలనొప్పిలో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో టెన్షన్ తో వచ్చే తలనొప్పి, క్లస్టర్ తలనొప్పి, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి, మరియు మైగ్రేన్.

టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి కొద్దిసమయం మాత్రమే ఉంటుంది. ఈ నొప్పి తలమొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. క్లస్టర్ హెడ్ ఏక్ ఇది ఒక సారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది . ఈ తలనొప్పి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సైనస్ హెడ్ ఏక్, ఇది సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది . ఇది చాలా లోతుగా ఇబ్బంది పెట్టే తలనొప్పి ముఖం మరియు నుదుటి బాగంలో ఎక్కువ నొప్పికి దారితీస్తుంది. మైగ్రేన్ హెడ్ ఏక్ ఇది ఎప్పుడూ ఎక్కువగా ఇబ్బంది పెట్టే తలనొప్పి.

మైగ్రేన్ తలనొప్పి యొక్క లక్షణాలు ఒక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. తలనొప్పికి కారణమేదైనా, తలనొప్పిని వెంటనే తగ్గించుకోవడం చాలా అవసరం. తలనొప్పిని తగ్గించుకోవడానికి వెంటనే గుర్తొచ్చేది పెయిన్ కిల్లర్. ఇలా పెయిన్ కిల్లర్స్ ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇస్తాయి. కానీ, కొంత సేపటి తర్వాత తిరిగి మెలిపెడుతుంటాయి. కాబట్టి, తక్షణ నొప్పిని తగ్గించుకోవడంతో పాటు, భవిష్యత్తులో తిరిగి తలనొప్పి రాకుండా ఉండాలంటే నేచురల్ ఆయుర్వేధిక్ రెమెడీస్ మంచిది.

తలనొప్పిని తగ్గించుకోవడానికి తీసుకొనే నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు చౌకైనవి, మనకు అందుబాటులో ఉండే చాలా సింపుల్ రెమెడీస్. తలనొప్పి తగ్గించడంలో హెర్బల్ రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి చాలా సింపుల్ మరియు ఎఫెక్టివ్ హోం రెమెడీ. మరి తలనొప్పి నుండి వెంటనే రిలీఫ్ కలిగించే కొన్ని హెర్బల్ టీలు మీకోసం...

HERBAL TEAS TO CURE HEADACHE

1. మింట్ టీ: హెర్చల్ టీలలో పుదినా టీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసనాబరితంగా ఉంటుంది. మింట్ టీ ని పురాతన కాలం నుండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . ఈ టీ తాగడం వల్ల వివిధ రకాల ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది . ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . గ్రీన్ టీ లీవ్స్ మరియు మింట్ లీవ్స్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి . గ్రీన్ టీని బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తి మెరుగుపరుచుకోవడానికి, క్యాన్సర్ నివారిణిగా మరియు ఇతర వ్యాధుల నివారణకు గ్రేట్ గా ఉపయోగిస్తారు . ఈ హెర్బల్ టీ తాగడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ హెర్బల్ టీ నొప్పి, వాపు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, శ్వాసనాళాల వాపు వంటి అరుదైన సమస్యలకు మెడిసిన్ లా పనిచేస్తుంది.

కావల్సినవి: ఒక కప్పు నీళ్ళు, 2టీస్పూన్ల డ్రైగ్రీన్ టీ , 2టీస్పూన్ ఫ్రెఫ్ మింట్ లీవ్స్ లేదా డ్రై మింట్ లీవ్స్.
తయారీ: నీరు బాగా మరిగించి అందులో గ్రీన్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసి బాగా మరిగించాలి. 10నిముషాలు ఉడికించిన తర్వాత, కప్పులోకి వడగట్టి తాగాలి.

HERBAL TEAS TO CURE HEADACHE

2. చమొమోలీ టీ: మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి చమొమోలీ టీ గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది. చమొమోలీ టీలో తలనొప్పిని తగ్గించే గుణాలు, రిలాక్స్ చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి . మోమిలే టీనే చేమంతి టీ అంటారు. దీన్ని చేమంతి పూల రెక్కలు, ఆకులతో తయారు చేస్తారు. ఈ హెర్బల్ టీ జీర్ణవ్యవస్థ, రిలాక్సేషన్, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి వంటి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే గుణం చమోమిలే టీలో ఉంది. అలాగే సూర్యరశ్మి వల్ల కమిలిపోకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. దాంతోపాటు గొంతు నొప్పి, గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది.

చమొమోలి టీ బ్యాగ్ ను వేడి నీటిలో డిప్ చేసి 10 నిముషాల తర్వాత తాగాలి. లేదా ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారుచేసుకొని, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి వడగట్టి తర్వాత తాగాలి.

HERBAL TEAS TO CURE HEADACHE

3. అల్లం టీ: తలనొప్పి నివారించుకోవడానికి తాగాల్సిన హెర్బల్ టీలో మరొకటి జింజర్ టీ , దీన్ని తాగడం వల్ల తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది . జింజర్ టీలో నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి చైనీస్ ఆయుర్వేదంలో ఇది బాగా పాపులర్ అయినది. అల్లం టీ వికారం తగ్గించడంలో, ఆకలి పెంచడంలో అల్లం టీ సహాయపడుతుంది. అలాగే మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు అల్లం టీ పవర్ ఫుల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

తయారీ: ఒక కప్పు నీటిలో అల్లం ముక్కలు వేసి 10 నిముషాలు ఓవర్ హీట్ లో బాగా మరిగించాలి. తర్వాత మంట తగ్గించి మరో 10 నిముషాలు ఉడికించాలి. తర్వాత కాఫీ కప్పులోకి వడగట్టి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

HERBAL TEAS TO CURE HEADACHE

4. దాల్చిన చెక్క టీ: మైగ్రేన్, జలుబు దగ్గు, లేదా ఇతర కారణాల వల్ల వచ్చే తలనొప్పిని నివారించుకోవడంలో దాల్చిన చెక్క టీ గ్రేట్ గా సహాయపడుతుంది. . దాల్చిన చెక్క టీలో మెగ్నీషియం, ఫైబర్, ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉన్నాయి . ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీగా పనిచేస్తుంది . ఇది తలనొప్పిని తగ్గిస్తుంది మరియు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.ఘాటైన సువాసన కలిగిన దాల్చిన చెక్క టీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ హెర్బల్ టీని తరచుగా తీసుకోవడం వల్ల మేధాశక్తిని, ఆలోచనా శక్తిని పెంచుతుంది. పొట్టలో వచ్చే సమస్యలు గ్యాస్, డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వ్యాధినిరోధకతను పెంచడానికి ఇది సహాయపడుతుంది.

కావల్సినవి: 1/2టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్, మరియు గుప్పెడు ల్యావెండర్ ఫ్లవర్స్ (ల్యావెండర్ లేకపోతే దాల్చిన చెక్క మాత్రమే ఉపయోగించవచ్చు)
తయారీ: ఒక కప్పు వేడి నీటిలో ల్యావెండర్ ఫ్లవర్ మరియు అరచెంచా దాల్చిన చెక్క పొడి వేసి బాగామిక్స్ చేయాలి . ఈమిశ్రమాన్ని 20నిముషాలు బాగా మరిగించి, తర్వాత వడగట్టి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

HERBAL TEAS TO CURE HEADACHE

5. తులసి టీ: ఇది మరో స్ట్రాంగ్ హెర్బల్ టీ. తలనొప్పి తగ్గించుకొనే ట్రీట్మెంట్ లో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు . ఇందులో అనాల్జిక్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి . తులసి హెర్బ్ యాంటీస్పాస్మోడిక్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ మరియు మజిల్ రిలక్సింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇతర లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్ానయి . మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవడంలో తులసి టీ గ్రేట్ గా ఉపయోపడుతుంది.

తయారీ: ఒక కప్పు వేడి నీటిలో 5, 6 తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి.10 నిముషాల తర్వాత వడగట్టి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి, ఇలా చేయడం వల్ల తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

HERBAL TEAS TO CURE HEADACHE

6. గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్, మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉన్నాయి . గ్రీన్ టీ నాడీవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది మరియు బ్రెయిన్ ను యాక్టివేట్ చేస్తుంది . గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మంచి పాత్రపోషిస్తుంది. తలనొప్పి నివారిస్తుంది. గ్రీన్ టీ గ్రీన్ టీ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా గ్రీ టీ కాపాడుతుంది.

English summary

6 HERBAL TEAS TO CURE HEADACHE

Headache comes in several different forms ranging from mild, moderate to severe. Most people experience headaches due to physical and mental stresses. Some people experience headaches due to illness and injury. Almost everyone on the planet suffers from headaches from time to time.
Story first published:Tuesday, May 31, 2016, 15:55 [IST]
Desktop Bottom Promotion