For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆక్యుప్రెజర్ పాయింట్స్..!

By Swathi
|

తలనొప్పి అనేది చాలా సాధారణంగా చాలామంది ఫేస్ చేసే సమస్య. ఇది చాలామందికి ప్రతిరోజూ వస్తుంటుంది. టీనేజర్స్, పెద్దవాళ్లు అంటూ తేడా లేకుండా.. అందరినీ వేధిస్తుంది తలనొప్పి. ట్యాబ్లెట్ వేసుకుని.. తలనొప్పి నుంచి రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ.. కొన్నిసార్లు.. అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

తలనొప్పి ఎక్కువగా రావడానికి ఒత్తిడి, నిద్రసరిపడా పొందలేకపోవడం, మైగ్రెయిన్, హై బ్లడ్ ప్రెజర్, సైనస్, జలుబు వంటి కారణాలున్నాయి. కారణం ఏదైనా.. తలనొప్పి వచ్చిందంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతాం. ఇది చాలా ఇరిటేషన్ కి గురిచేస్తుంది.

కాబట్టి మీరు సేఫ్ ట్రీట్మెంట్ కోసం చూస్తుంటే.. ఆక్యుప్రెజర్ చాలా అద్భుతమైన పరిష్కారం. చాలా ఎఫెక్టివ్ గా, వేగంగా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఈ ట్రీట్మెంట్. ఆక్యుప్రెజర్ అనేది చాలా పాతపద్ధతి. కానీ.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. బాధను తగ్గిస్తుంది. అందుకోసం.. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.

థర్డ్ ఐ

థర్డ్ ఐ

సరిగ్గా.. రెండు కనుబొమ్మలకు మధ్యలో ఉండేది థర్డ్ ఐ. బొటనవేలు ఉపయోగించి.. థర్డ్ ఐపై కొద్దిగా ప్రెజర్ ఇవ్వాలి. కొన్ని సెకన్లపాటు అలాగే చేస్తూ ఉండాలి. నెమ్మదిగా తలనొప్పి తగ్గిపోతుంది.

చేయి

చేయి

తలనొప్పి వచ్చినప్పుడు మీ చేతిలో ఆక్యుప్రెజర్ పాయింట్ పై నొక్కండి. సరిగ్గా చూపుడు వేలు, బొటనవేలు మధ్యలో ప్రెస్ చేయాలి. కొన్ని సెకన్ల పాటు సున్నితంగా ప్రెస్ చేయాలి. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ చిట్కాను ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు.

పాదం

పాదం

తలనొప్పిగా ఉన్నప్పుడు.. కాలి బొటనవేలు, రెండో వేలు మధ్య ఆక్యుప్రెజర్ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రెస్ చేయాలి. బొటనవేలు సహాయంతో కొన్ని సెకన్లు నొక్కాలి. ఇలా చేస్తే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

చెవి

చెవి

చెవి వెనక భాగంలో.. ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. చేతి ఐదు వేళ్లను ఒక వేలంత గ్యాప్ తో.. వరుసగా.. మెత్తగా ప్రెస్ చేయాలి. ఒకేసారి ఐదువేళ్లతో ప్రెజర్ ఇవ్వాలి. ఇలా చేస్తే.. చాలా త్వరగా తలనొప్పి తగ్గిపోతుంది.

తలవెనక

తలవెనక

వెన్నెముక దగ్గర కూడా.. ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి.. అవి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రెండు కండరాల మధ్య ఉంటాయి. ఇక్కడ సున్నితంగా ప్రెజర్ ఇవ్వడం వల్ల.. తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

కంటిలోపల

కంటిలోపల

సరిగ్గా ఐబ్రోస్ కింది భాగంలో.. ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ సున్నితంగా ప్రెజర్ చేయడం వల్ల.. సైనస్, జలుబు వల్ల వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖం

ముఖం

ముక్కు రంధ్రాలకు సరిగ్గా పక్కన రెండు వైపులా ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రాంతంలో నొక్కడం వల్ల సైనస్ వల్ల వచ్చే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

English summary

7 Acupressure Points That Give Instant Relief From Headaches

7 Acupressure Points That Give Instant Relief From Headaches. Headaches are one of the most common health problems which we face in our daily life. Be it teenagers, adults or the elderly, headaches spare no one.
Desktop Bottom Promotion