For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఎనర్జీని నాశనం చేసే ఈ ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకండి..

By Swathi
|

హెల్తీ ఫుడ్, వ్యాయామం, తరచుగా డాక్టర్ చెకప్స్ తో.. హెల్తీగా ఉండాలని భావిస్తున్నారా ? ఇవన్నీ ఫాలో అయినప్పటికీ.. కొన్ని సార్లు మీకు తెలియకుండానే, కారణం లేకుండానే అలసిపోతున్నారా ? అయితే.. ఏం జరుగుతోందని ఆందోళన పడుతున్నారా ? ఇలాంటి అలసట, ఎనర్జీ లెవెల్స్ పడిపోవడానికి కేవలం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే సరిపోదు. మీ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ పై ఇంకాస్త శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఎందుకంటే.. మనం నిత్యం తీసుకునే కొన్ని ఆహారాలు మన శక్తిని నాశనం చేస్తాయి.

తక్కువ ఎనర్జీ లెవెల్స్ ఒక వ్యక్తి.. జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రతి రోజూ చేయాల్సిన పనులు చేయలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది. రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాబ్, స్కూల్ వర్క్, ఫ్రెండ్స్ తో పార్టీ ఇలాంటి వాటన్నింటిలో ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

మీకు తెలుసా కొన్ని రకాల ఆహారాలు.. మీ ఎనర్జీ లెవెల్స్ ని పూర్తీగా తగ్గించేసి.. ఎప్పుడు అలసిపోయిన ఫీలింగ్ కలిగిస్తాయి. మరి ఎనర్జీని కిల్ చేసే.. కామన్ ఫుడ్స్ ఏంటో మీరే ఒక లుక్కేయండి..

బ్రేక్ ఫాస్ట్ లో ధాన్యాలు

బ్రేక్ ఫాస్ట్ లో ధాన్యాలు

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ధాన్యాలు చేర్చుకోవడం హెల్తీ అని భావిస్తారు. కానీ.. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉండే.. వాటిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల.. మెటబాలిజం తగ్గిపోయి.. అలసటగా అనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్

బ్రెడ్ లో ఎక్కువగా ఉండే గ్లిజమిక్ ఇండెక్స్ శరీరం నుంచి చాలా ఎనర్జీని గ్రహిస్తుంది. ఇది జీర్ణమవడానికి సమయం పడుతుంది. దీంతో.. ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది. అలాగే.. వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల త్వరగా అలసటకు లోనవుతాం.

కాఫీ

కాఫీ

కాఫీ ఇన్ స్టంట్ ఎనర్జీ ఇస్తుందని మనలో చాలామంది భావిస్తాం. కానీ.. ఇది ఓవర్ యాక్టివ్ అయ్యేలా చేస్తుందని, విశ్రాంతి లేకుండా చేస్తుందని ఎవరికీ తెలియదు. ఇలా కాఫీ మన ఎనర్జీ లెవెల్స్ ని గ్రహించేస్తుంది.

లో క్యాలరీ మీల్స్

లో క్యాలరీ మీల్స్

చాలామంది డైట్ ఫాలో అయ్యేవాళ్లు.. చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. తక్కువ క్యాలరీలు ఉండే ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ తీసుకునేస్తారు. దీనివల్ల శరీరానికి కావాల్సినంత క్యాలరీలు అందకపోవడంతో.. త్వరగా ఎనర్జీ కోల్పోతాం.

ప్యాక్ చేసిన యోగర్ట్

ప్యాక్ చేసిన యోగర్ట్

ప్యాక్ చేసి అందుబాటులో ఉండే యోగర్ట్ చాలా రోజుల పాటు నిల్వ ఉంచడం వల్ల.. వీటిల్లో పోషకాలు, ఎంజైమ్స్ కోల్పోయి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమే కాకుండా.. ఎనర్జీ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయి.

ఫ్రూట్ స్మూతీస్

ఫ్రూట్ స్మూతీస్

ఫ్రూట్ స్మూతీస్ హెల్తీ అనుకుంటాం. వీటిల్లో హైలెవెల్ షుగర్, ఫ్రక్టోజ్ ఉంటుంది. దీనివల్ల ఇవి నెగటివ్ గా ఎనర్జీపై ప్రభావం చూపుతాయి.

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్.. త్వరగా అలసిపోవడానికి కారణమవుతాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తాయి. కాబట్టి.. వీటికి దూరంగా ఉండటం మంచిది.

English summary

7 Common Energy-Killing Foods You Should Completely Avoid!

7 Common Energy-Killing Foods You Should Completely Avoid! Low energy levels can seriously hamper a person's life, as carrying out everyday tasks becomes quite difficult if a person is constantly tired!
Story first published:Monday, July 25, 2016, 20:39 [IST]
Desktop Bottom Promotion