For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం రన్నింగ్ తర్వాత తీసుకోవాల్సిన ఎనర్జిటిక్ ఫుడ్స్

By Super
|

రోజూ ప్రొద్దున్నే ఒకటి రెండు మైళ్ళు పరిగెత్తడం మంచిదే కానీ అంత సులభం కాదు. పరిగెత్తడం ద్వారా బోలెడు లాభాలున్నాయి. దీని వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మీ ఎముకలు, కండరాలని ధృడపరుస్తుంది. పరుగు గుండెకి మంచిది. అంటే మీరు ఎంత పరుగెడితే మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది.

పరుగు వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అందువల్లే రోజూ పొద్దున్నే వ్యాయామం కోసం పరుగు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజుల్లో చాలా మందికి పరుగు తర్వాత ఏమి తినాలి అన్న మీమాంస వస్తోంది. ప్రొద్దున్నే మీరు రన్నింగ్ చేసొచ్చాకా ఏమి తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం...

వీటిని తీసుకోవడం వల్ల రన్నింగ్ తర్వాత మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈ పదార్థాలు ఎలాంటి జబ్బులూ మీ దరి చేరకుండా కాపాడతాయి. అలాగే పరిగెత్తేటప్పుడు దీర్ఘ శ్వాస తీసుకునేటట్లు చూడండి. అందువల్ల ఊపిరితిత్తులకి కూడా మంచిది. మరి మీరు రన్నింగ్ తరువాత తీసుకోవాల్సిన 7 రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు, వాటి లాభాలేంటో చూద్దామా..

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లుంటాయి. మన శరీరానికి కావాల్సిన శక్తినివ్వడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఉంటాయి. సాల్మన్ మెదడుకి మంచిది.

బాదం:

బాదం:

బాదం కేవలం చర్మానికే కాకుండా ఆరోగ్యానికీ మంచిదే. బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెంచడానికి ఉపయోగపడతాయి. అందువల్ల మీ శరీరంలోని జబ్బులు, వ్యాధులు బయటకి పోతాయి.

అరటి పండు:

అరటి పండు:

అరటి పండువల్ల శరీరంలో ఎండ్యూరెన్స్(ఓరిమి)ని పెంచుతుంది. దీనిలో మినరల్స్, విటమిన్లు అధికం. పైగా దీనిలో ఉండే కార్బో హైడ్రేట్లు మీ శరీరంలో శక్తి స్థాయిలని పెంచి మీరు పరిగెత్తి వచ్చాకా కూడా శక్తితో ఉండేటట్లు చేస్తుంది

ఓట్‌మీల్:

ఓట్‌మీల్:

సహజ సిద్ధమైన ఆహారాల ద్వారా శక్తి రావాలంటే ఓట్‌మీల్ శ్రేష్టం. శారీరక శ్రమ తర్వాత కూడా అలసట రాకుండా ఉండాలంటే రోజూ ఒక బౌల్ ఓట్స్ తిని చూడండి.

కాయగూరలు:

కాయగూరలు:

వ్యాయామం తర్వాత మీరు తినే ఆహారంలో ప్లేట్ నిండా ఆకుపచ్చని కూరగాయలు ఉండేటట్లు చూసుకోండి. ఇవి శరీరానికి చాలా మంచిది.

చికెన్:

చికెన్:

వయసు పైబడిన తర్వాత వచ్చే కీళ్ళ నొప్పులని నివారించదానికి కావాల్సిన సిలీనియుం చికెన్ ద్వారా లభిస్తుంది. బ్రెస్ట్ చికెన్ లో ఉన్న ప్రోటీన్ మీరు ప్రొద్దున్నే పరుగు పెట్టి వచ్చిన తర్వాత కావాల్సిన శక్తినిస్తుంది.

పండ్లు:

పండ్లు:

కావాల్సినన్ని పండ్లు తినండి ఈ వేసవిలో. దీని వల్ల మీ శరీరానికి తేమ అంది ఉత్సాహంగా ఉంటారు. పండ్లలో ఉన్న సహజ సిద్ధమైన లవణాలు మీరు పరిగెత్తి వచ్చాకా మీ రక్తపోటుని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

English summary

7 Foods You Must Eat After A Morning Run: Running for a mile or two Every morning is a challenge

7 Foods You Must Eat After A Morning Run: Running for a mile or two Every morning is a challenge. 7 Foods You Must Eat After A Morning Run. Running for a mile or two every morning is a challenge and it is never easy.
Desktop Bottom Promotion