For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చింతకాయ విత్తనాల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

పుల్లగా ఉండే చింతపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని మనందరికీ తెలుసు. కానీ.. చింతకాయ విత్తనంలో కూడా.. అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని చాలామందికి తెలియదు. సాధారణంగా.. పుల్ల పుల్లటి చింతకాయను తిని.. మస్తుగా ఎంజాయ్ చేస్తారు. కానీ.. అందులోని విత్తనాన్ని మాత్రం పడేస్తుంటాం.

కానీ చింతకాయ విత్తనంలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే.. ఇకపై దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. తతచింతకాయ విత్తనాల్లో ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రకరకాల రకరకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను.. ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

చింతకాయ విత్తనాలు ఎలా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయో చూద్దాం..

గొంతు నొప్పి

గొంతు నొప్పి

చింతకాయ విత్తనం జ్యూస్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. గొంతు నొప్పిని నివారించి, తగ్గు, జలుబుని తగ్గిస్తాయి. కాబట్టి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో.. కొద్దిగా చింతకాయ విత్తనం పొడి కలిపి మౌత్ వాష్ లా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇన్ డైజెషన్

ఇన్ డైజెషన్

ఇన్ డైజెషన్ ని న్యాచురల్ గా నివారించవచ్చు. చింతకాయ విత్తనం జ్యూస్ తో.. అజీర్ణంను ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు.. ఇందులో ఉండే ఫైబర్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. చింతకాయ విత్తనాలకు పైన ఉండే రెడ్ కలర్ కోట్ లో.. జిలోగ్లూక్యాన్ ఉంటుంది. ఇది.. డయేరియాను నివారిస్తుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

చింతకాయ విత్తనాల్లో ఇమ్యునిటీ పవర్ పెంచే సత్తా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని, ఎర్రరక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ప్లేట్ లెట్స్ ని మెరుగుపరుస్తాయి. ఇమ్యున్ సెల్స్ ని కూడా పెంచుతాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్స్, వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్

చింతకాయ విత్తనాలు.. జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అర టీస్పూన్ వేయించిన చింతకాయ విత్తనాల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి.. రోజుకి రెండుసార్లు తాగితే.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

డయాబెటిస్

డయాబెటిస్

చింతపండు విత్తనాలు.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే.. బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి.

గుండె వ్యాధులు

గుండె వ్యాధులు

చింతపండు విత్తనాల్లో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చింతపండు విత్తనాల్లో లినోలెనిక్ యాసిడ్, ఎసెన్ఫియల్ ఫ్యాటీ యాసిడ్ ఉండటం వల్ల.. కార్డియోవాస్క్యులర్ వ్యాధులను నివారిస్తుంది. అలాగే బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది.

క్యాన్సర్

క్యాన్సర్

చింతపండు విత్తనాల్లో యాంటీ క్యాన్సర్ గుణాలుంటాయి. క్యాన్సర్ ని నివారించడమే కాకుండా.. కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. క్యాన్సర్ రిస్క్ నుంచి బయటపడేలా చేస్తాయి.

English summary

7 health benefits of tamarind seeds you didn’t know !

7 health benefits of tamarind seeds you didn’t know ! We all know that the tangy tamarind is packed with health benefits. But did you know even its seed is rich in proteins, amino acids, essential fatty acids and minerals?
Story first published:Tuesday, August 30, 2016, 19:58 [IST]
Desktop Bottom Promotion