For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీమోథెర‌పీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు

By Swathi
|

క్యాన్స‌ర్ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ.. చాలా ఆందోళ‌న‌, భ‌యం వ‌స్తుంది. ఎందుకంటే.. ఆ నొప్పి, మ‌ర‌ణం అనేవి భ‌యాందోళ‌న‌కు గురిచేస్తాయి. క్యాన్స‌ర్ అనేది ప్రాణాంత‌క వ్యాధి కావ‌డం వ‌ల్ల ఇది ఒక వ్య‌క్తి జీవితాన్ని తారుమారు చేస్తుంది.

క్యాన్స‌ర్‌ని మొద‌టి ద‌శ‌లోనే ట్రీట్మెంట్ చేయ‌డం, గుర్తించ‌డం వ‌ల్ల‌.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కానీ.. ఇది త‌ర్వాత స్టేజ్‌ల‌లో గుర్తించిన‌ట్లైతే.. ఆ వ్య‌క్తి జీవితం కోల్పోయిన‌ట్టే. చాలా భ‌యంక‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఇబ్బందిపెట్టిన త‌ర్వాత‌.. ప్రాణాలు తీసుకెళ్లే భ‌యంక‌ర‌మైన వ్యాధి క్యాన్స‌ర్.

శ‌రీరంలో కొన్ని కణాలు అసాధార‌ణంగా ఏర్ప‌డ‌టం వ‌ల్ల ట్యూమ‌ర్స్ గ్రోత్ కి కార‌ణ‌మ‌వుతాయి. ఇలా.. అవ‌య‌వాల్లోని టిష్యూస్ నాశ‌నం అయి.. చివ‌రికి ఆ అవ‌య‌వ‌మే.. ఫెయిల్ అవుతుంది.

బ్రెస్ట్ క్యాన్స‌ర్, ప్రొస్టేట్ క్యాన్స‌ర్, కోల‌న్ క్యాన్స‌ర్, మెల‌నోమా లేదా స్కిన్ క్యాన్స‌ర్, లంగ్ క్యాన్స‌ర్, ల్యుకేమియా, బ్ల‌డ్ క్యాన్స‌ర్ వంటి ర‌క‌ర‌కాల క్యాన్స‌ర్లు బెంబేలెత్తిస్తున్నాయి. కీమోథెర‌పీ అనేది.. చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఈ ప‌ద్ధ‌తిలో కొన్ని ప‌వ‌ర్ ఫుల్ మెడిసిన్స్ ఉప‌యోగించి.. క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను కంట్రోల్ చేస్తాయి.

అయితే కీమోథెర‌పీ వ‌ల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఉప‌యోగించే మందులు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. అయితే.. కీమోథెర‌పీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా కొన్ని ఫుడ్స్ తీసుకోవ‌డం వ‌ల్ల సైడ్స్ ఎఫెక్ట్స్ త‌గ్గించుకోవ‌చ్చు.

క్యార‌ట్స్

క్యార‌ట్స్

క్యార‌ట్స్‌లో బీటా కెరోటిన్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇమ్యున్ సిస్ట‌మ్ అభివృద్ధికి స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే అనేక సైడ్ ఎఫెక్ట్స్ ద‌రిచేర‌కుండా అరిక‌డ‌తాయి. కాబ‌ట్టి వీటిని కీమోథెర‌పీ స‌మ‌యంలో ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

పాలు

పాలు

పాలు నోరు ఆరిపోవ‌డాన్ని అరిక‌డ‌తాయి. కీమోథెర‌పీ స‌మ‌యంలో సాధారణంగా ఎదుర‌య్యే సైడ్ ఎఫెక్ట్ ఇది. పాలు తీసుకోవ‌డం వ‌ల్ల సాలివ‌రీ గ్లాండ్స్ యాక్టివ్‌గా ఉంటాయి.

బియ్యం

బియ్యం

రైస్, బ్రెడ్ ల‌లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి డ‌యేరియాని నివారిస్తాయి. కీమోథెర‌పీ స‌మ‌యంలో ఎదుర‌య్యే మ‌రో సైడ్ ఎఫెక్ట్ ఇది. కాబ‌ట్టి.. దీన్ని నివారించ‌డానికి బియ్యం, బ్రెడ్ ని డైట్ లో చేర్చుకోవాలి.

డ్రైఫ్రూట్స్

డ్రైఫ్రూట్స్

కీమోథెర‌పీ వ‌ల్ల కొన్ని సార్లు జీర్ణ‌సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కాబ‌ట్టి.. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉండే.. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవి.. జీర్ణ‌స‌మ‌స్య‌లు నివారించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

సూప్స్

సూప్స్

సూప్స్, పోర్రేడ్జ్ వంటివి కీమోథెరపీ పేషంట్స్ చాలా తేలిక‌గా తీసుకోవ‌చ్చు. ఎందుకంటే.. కొన్నిసార్లు వాళ్ల‌కు మౌత్ అల్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోవ‌డం తేలిక‌.

ఆరంజ్ జ్యూస్

ఆరంజ్ జ్యూస్

ఆరంజ్ జ్యూస్‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఇమ్యునిటీని మెరుగుప‌రుస్తుంది. నోటిలో డ్రైనెస్ ని త‌గ్గిస్తుంది. కాబ‌ట్టి.. కీమోథెర‌పీ చేయించుకునే పేషంట్స్ హైడ్రేట్ గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.

వెల్లుల్లి

వెల్లుల్లి

క్యాన్స‌ర్ పేషంట్స్‌కి వెల్లుల్లి చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ఉప‌యోగ‌క‌ర‌మైన‌ది. ఇది క్యాన్స‌ర్ సెల్స్ తో ఎఫెక్టివ్ గా పోరాడుతుంది. కీమోథెర‌పీ వ‌ల్ల డ్యామే్ అయిన వాటిని మ‌ళ్లీ పున‌ర్ నిర్మించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తుంది.

English summary

7 Most Healthy Foods To Consume During Chemotherapy

7 Most Healthy Foods To Consume During Chemotherapy. Well, cancer is indeed a deadly disorder that can completely change a person's life once he/she is affected with it.
Story first published:Friday, July 29, 2016, 10:09 [IST]
Desktop Bottom Promotion