For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లేట్ లెట్ కౌంట్ ని పెంచుకునే న్యాచురల్ అండ్ సింపుల్ రెమిడీస్..!!

By Swathi
|

తక్కువ ప్లేట్ లెట్ కౌంట్ ఉండటాన్ని వైద్యశాస్త్రంలో ధ్రోంబోబోసైటోపెనియా అని పిలుస్తారు. ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉండటానికి కారణాలను బట్టి.. తీవ్రత ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, గాయాలు, దెబ్బలు వంటి లక్షణాలతో పాటు, మలంలో బ్లడ్ రావడం, యూరిన్ లో బ్లడ్ రావడం కూడా ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉందని తెలుపుతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. చాలామంది పూర్తీ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉందని గుర్తిస్తారు. ఒకవేళ ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయని మొదట్లోనే గుర్తిస్తే.. కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా పెంచుకోవచ్చు. లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా.. వీటిని పెంచవచ్చు.

లో ప్లేట్ లెట్ కౌంట్ ని పెంచే న్యాచురల్ పద్ధతులను మీకు పరిచయం చేయపోతున్నాం. ఇందులో ఎలాంటి ఖర్చు ఉండదు. పెయిన్ ఫుల్ ట్రీట్మెంట్స్, పద్ధతులు ఏమాత్రం ఉండవు. చాలా సింపుల్ గా చిన్న చిన్న మార్పులతో ప్లేట్ లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.

సరిపడా నిద్ర

సరిపడా నిద్ర

సరిపడా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. తాజాగా మీకు లో ప్లేట్ లెట్ కౌంట్ ని తెలిస్తే.. మీరు ఖచ్చితంగా సరైన పద్ధతిలో నిద్రపోవాలి. రోజుకి ఖచ్ఛితంగా 8 గంటలు నిద్రపోవాలి.

వ్యాయామం

వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి.. ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి మీకు లో ప్లేట్ లెట్ కౌంట్ అని డాక్టర్లు చెప్పి ఉంటే.. వెంటనే వ్యాయామం చేయడం మొదలుపెట్టండి.

నీళ్లు తాగడం

నీళ్లు తాగడం

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ప్లేట్ లెట్స్ ఉత్పత్తి పెరుగుతుంది. లో ప్లేట్ లెట్స్ కౌంట్ సమస్య నుంచి బయటపడటానికి ఇది సింపుల్ టిప్.

విటమిన్ సి ఫుడ్

విటమిన్ సి ఫుడ్

విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. లో ప్లేట్ లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి.. టమోటాలు, నిమ్మ, ఆరంజ్ వంటివి డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.

ఉసిరి

ఉసిరి

ఉసిరికాయలు.. ప్లేట్ లెట్స్ పెంచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ గా ఉసిరికాయ జ్యూస్ తాగితే.. ఈ సమస్య నుంచి తేలికగా, త్వరగా బయటపడవచ్చు. అలాగే ఇమ్యునిటీ మెరుగుపడుతుంది.

పాలకూర

పాలకూర

లో ప్లేట్ లెట్ డిజార్డర్ నివారించడంలో పాలకూర ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని సలాడ్ రూపంలో లేదా జ్యూస్ గా తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇందులో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్ ప్లేట్ లెట్స్ ప్రొడక్షన్ ని పెంచుతాయి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది లో ప్లేట్ లెట్ కౌంట్ ని ట్రీట్ చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల.. సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.

English summary

7 Natural Ways Of Increasing A Low Platelet Count

7 Natural Ways Of Increasing A Low Platelet Count. This health condition could prove to be fatal, which is why you should always be on a lookout for these warning signs.
Story first published:Friday, June 10, 2016, 17:20 [IST]
Desktop Bottom Promotion