For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు క్యాల్షియం లోపం ఉందని తెలిపే హెచ్చరిక సంకేతాలు

By Super
|

శరీరంలో క్యాల్షియం చాలా కీలకమైనది. ఎముకల ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది క్యాల్షియం. ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు, కండరాలు, నరాల వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. అదే విధంగా శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఎముకలకు సంబంధించిన ఓస్టిరియోపోసిస్, లో బోన్ డెన్సిటి వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

కొన్ని ప్రమాదకర కేసుల్లో, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. శరీరంలో క్యాల్షియం తక్కువైతే బోన్స్, దంతాలు చాలా వీక్ గా మారుతాయి. శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల శరీరం ఎముకల నుంచి ఇతర పోషకాలను గ్రహించడం వల్ల ఇతర అవయవాల్లో కూడా క్యాల్షియం లోపం ఏర్పడుతుంది.

క్యాల్షియంతో పాటు, ఇతర న్యూట్రీషియన్స్ ఎముకల ఆరోగ్యానికి , బలమైన కండరాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇవి హానికర బ్యాక్టీరియాను శరీరంలోని భాగాలకు వ్యాప్తి చెందకుండా కవర్ చేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ ఏర్పడకుండా ఉంటాయి. వైద్యపరంగా రక్తంలో క్యాల్షియం చాలా తక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియలు సరిగా జరగవు.

సంవత్సరానికి కొన్ని వేల మంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. చాలా వరకు ఎక్కువ మంది, చాలా పెద్ద సంఖ్యలో క్యాల్షియం సప్లిమెంట్ మీద ఆధారపడుతున్నారు. శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడితే కనిపించే లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి. మరి అవేంటో చూద్దామా..

కండరాలు

కండరాలు

కండరాల నొప్పులు కనిపిస్తున్నాయంటే .. అది క్యాల్షియం లోపమని గుర్తించాలి. శరీరంలో లో క్యాల్షియం లెవెల్ ఉన్నప్పుడు కండరాల నొప్పి వస్తుంది.

మెమరీ లాస్

మెమరీ లాస్

శరీరంలో క్యాల్షియం తగ్గినప్పుడు మెమరీ లాస్ కి దారితీయవచ్చు. క్యాల్షియం లోపించినప్పుడు.. నరాల వ్యవస్థ పనితీరుపై దుష్ర్పభావం ఉంటుంది.

వణకడం

వణకడం

క్యాల్షియం లోపంతో బాధపడేవాళ్ల శరీరంలో ఎక్కువ వణుకుడు సమస్య వస్తుంది. చేతివేళ్లు, నేతులు, నోటి దగ్గర వణుకుతూ ఉన్నట్టు అనిపిస్తుంది.

డిప్రెషన్

డిప్రెషన్

క్యాల్షియం లోపం ఉన్న వాళ్లలో మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం ఉంటుంది. క్యాల్షియం తక్కువగా ఉంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది.

అలసట

అలసట

శరీరంలో క్యాల్షియం లోపిస్తే.. మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసపడటం వంటి సమస్యలు కనిపిస్తాయి.

గోళ్లు

గోళ్లు

క్యాల్షియం శరీరంలో తగ్గినప్పుడు గోళ్లు చాలా బలహీనవుతాయి. మాటికి విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఆకలి తగ్గడం

ఆకలి తగ్గడం

క్యాల్షియం లోపంతో బాధపడేవాళ్లలో ఆకలి చాలా తగ్గిపోతుంది. అలాగే వికారంగా అనిపిస్తూ ఉంటుంది.

English summary

7 Signs That Show You Have Calcium Deficiency

7 Signs That Show You Have Calcium Deficiency. Adequate level of calcium is imperative for the proper functioning of bones, muscles and nerves.
Desktop Bottom Promotion