Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
అపోహలు-వాస్తవాలు : కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదా..? కాదా?
కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ, సంపదా కొబ్బరి పంట మీద అదారపడివున్నాయి . కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్ని వందల్లో ఆర్టికల్స్ చదువింటాము, అయితే, నిజంగానే కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదేనా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.
కొబ్బరినూనెతో ఆరోగ్య పరంగా వివిధ రకాల ప్రయోజనాలున్నా...కొన్ని సందర్బాల్లో ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇతర పదార్థాల వలే, కొబ్బరి నూనెలో కూడా కొన్ని అపోహాలు వాస్తవాలున్నాయి . కొబ్బరినూనెను సరైన పద్దతిలో ఉపయోగిస్తే , ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్స్, ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి పోషణను అందిస్తుంది.
కొబ్బరి నూనె ఉపయోగించడానికి ముందు వాటిలోని ప్రయోజనాలు మాత్రమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవడం మంచిది. కొబ్బరి నూనె వాడకం మన ఆరోగ్యానికి మంచిదా.. కాదా అని తెలసుకోవడానికి కొన్ని వాస్తవాలను ఈ ఆర్టికల్లో తెలపడం జరిగింది. కొబ్బరి నూనెలోని అపోహలు, వాస్తవాలు...

1. బరువు పెంచుతుంది:
బరువు తగ్గాలని ప్లాన్ లో ఉన్నవారికి కొబ్బరి నూనె , హెల్తీ ఆప్షన్ కాదు. ఇందులో ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు పెంచుతుంది. క్యాలరీలు ఎక్కువ. కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది.

2. దంతాలు తెల్లగా ఉండవు:
కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు నేచురల్ గా తెల్లగా మారుతాయని అంటుంటారు. రీసెర్చ్ ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అంత ఎఫెక్టివ్ కాదని చెబుతున్నారు.

3. గాయాలకు రాయడం నివారించాలి:
కొబ్బరి నూనె ఆరోగ్యానికి అనారోగ్యకరమైనది. గాయాలు, స్కార్స్, కాలిన గాయల మీద దీన్ని అప్లై చేయడం హానికరం. కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల ఇది స్కిన్ ఇరిటేషన్ మరియు రెడ్ నెస్ కు కారణమవుతుంది.

4. సన్ స్క్రీన్ గా దీన్ని ఉపయోగించకూడదు:
కొబ్బరి నూనెను నేచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగించడం అంత మంచిది కాదు, ఇందులో ఎస్ పి ఎఫ్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి చర్మానికి యూవి రేస్ నుండి ఎలాంటి రక్షణ కల్పించదు.

5. మాయిశ్చరైజ్ గా ఏమాత్రం పనిచేయదు:
కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది చర్మాన్ని జిడ్డుగా మరియు బ్యాక్టీరియల్ గ్రోత్ కు కారణమవుతుంది. ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరం కాదు.

6. వింటర్లో దీన్ని నివారించాలి:
వింటర్ సీజన్ లో కొబ్బరి నూనెను ఉపయోగించడం అనారోగ్యకరం, సురక్షితమైనది కాదు, ఇందులో ఉండే కూలింగ్ లక్షణాల వల్ల ఇది సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూ సమస్యలకు కారణమవుతుంది.

7. హార్ట్ డిసీజ్ రిస్క్ ను పెంచుతుంది:
కొబ్బరి నూనె ఆరోగ్యకరమా? కొబ్బరి నూనెను ఎక్సెస్ గా ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. కొలెస్ట్రాల్ పెంచడంలో మరియు హార్ట్ డిసీజ్ ను పెంచడానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications