For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : బ్లాడర్ క్యాన్సర్ కు డేంజరస్ హెచ్చరిక సంకేతాలు..!!

|

ఈ మద్య కాలంలో చాలా మందిలో హెల్త్ కాన్సియస్ నెస్ పెరిగింది. అందుకు ఆహారంలో, వ్యాయామంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంత మందిలో మాత్రం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో తెలియని భయం వారి వెంటాడుతుంది. ఫ్యూచర్ లో మనకు ఈ వ్యాధి వస్తుందేమో, అలా జరుగుతుందేమో అని జరగని విషయాలకు ఆందోళన చెందుతుంటారు. అలాంటి వాటిలో మనల్ని భయపెట్టే ఆరోగ్య సమస్య క్యాన్సర్. క్యాన్సర్ ఒక ప్రాణాంతమైన సమస్య. ఎవరినైనా క్యాన్సర్ పేషంట్స్ చూస్తే, భయపడి అది వారికి కూడా వస్తుందేమోనని అంతర్గతంగా భయపడే వారు చాలమందే ఉన్నారు.ముఖ్యంగా ఈ మద్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ , బ్లాడర్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాము. అయితే చాలా మంది వీటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. చివరి దశకు వచ్చే వరకూ గుర్తించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.

బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?సహజంగా బ్లాడర్ క్యాన్సర్ పెద్దవారిలో , 50 -55 సంవత్సరాల మద్యవయస్కుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది మహిళ కంటే ఎక్కువగా పురుషుల్లో ఉంటుంది. సాధారనంగా బ్లాడర్ ఇన్నిర్ లైన్ కు ఈ క్యాన్సర్ సోకుతుంది. తర్వాత చుట్టూ ఉన్న భాగాలకు వ్యాప్తి చెందుతుంది. బ్లాడర్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే కనుగొన్నట్లైతే , ట్రీట్మెంట్ సహాయంతో నివారించుకోవచ్చు.

బ్లాడర్ క్యాన్సర్ కు ముఖ్యమైన లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, యూరిన్ సమయంలో నొప్పి గా అనిపించిడం ఈ లక్షణాలు బ్లాడర్ క్యాన్సర్ ఉన్న వ్యక్తిలో కనబడుతాయి. ఈ లక్షణాలను చాలా మంది నిర్ల్యక్షం చేస్తుంటారు. ఇవి సహజలక్షణాలుగా నిర్లక్ష్యం చేయడం వల్ల చివరికి ప్రాణాపాయానికి గురిచేస్తుంది. వీటితో పాటు బ్లాడర్ క్యాన్సర్ కు మరికొన్ని సైలెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి . వీటిని గుర్తించడం కొద్దిగా కష్టమే అయినా..ఈ క్రింది సూచించిన సర్పైజింగ్ లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేకండి...

1. యూరిన్ లో బ్లడ్ క్లాట్స్:

1. యూరిన్ లో బ్లడ్ క్లాట్స్:

బ్లాడర్ క్యాన్సర్ ఉన్న వారు మూత్రంలో బ్లడ్ క్లాట్స్ కనబడటం. సహజంగా ఈ లక్షణాలను యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర సాధారణ కారణాల వల్ల కనిపించిందని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, బ్లాడర్ క్యాన్సర్ కు ఇది హెచ్చరిక సంకేతమని గుర్తించండి.

2. బర్నింగ్ సెన్షేషన్:

2. బర్నింగ్ సెన్షేషన్:

బ్లాడర్ క్యాన్సర్ ఉన్నవారు, మూత్రవిసర్జన సమయంలో మంటగా ఉంటుంది. ఈ లక్షణం స్త్రీ , పురుషులిద్దరిలోనూ ఒకే విధంగా ఉంటుంది.

3. యూరిన్ తక్కువగా వెళ్ళడం:

3. యూరిన్ తక్కువగా వెళ్ళడం:

తరచూ మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది, కానీ వెళ్లినప్పుడు కొన్ని డ్రాప్స్ కే పూర్తి చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ లేదా బ్లాడర్ క్యాన్సర్ కు హెచ్చరిక సంకేతంగా గుర్గించాలి.

4. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తరచూ బాధిస్తుంటుంది:

4. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తరచూ బాధిస్తుంటుంది:

బ్లాడర్ క్యాన్సర్ కు మరో సంకేతం, తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కు గురి చేయడం, మహిళల్లో ఈ సమస్య కంటిన్యుగా ఉంటే సర్వికల్ క్యాన్సర్ కు హెచ్చరిక సంకేతంగా గుర్గించాలి.

5. డార్క్ యూరిన్ :

5. డార్క్ యూరిన్ :

బ్లడార్ క్యాన్సర్ కు మరో సైలెంట్ సంకేతం యూరిన్ డార్క్ కలర్లో ఉండటం. అప్పటికప్పడు నీళ్ళు తాగి మూత్రవిసర్జన చేసిన యూరిన్ డార్క్ కలర్ లో ఉంటే ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

6. కలయికలో నొప్పిగా అనిపించడం:

6. కలయికలో నొప్పిగా అనిపించడం:

సెక్స్యువల్ ఇంటర్కోర్స్ సమయంలో నొప్పిగా , మంటగా అనిపిస్తే అది బ్లాడర్ క్యాన్సర్ కు హెచ్చరిక సంకేతంగా గుర్తించాలి.

7. కాళ్లలో వాపులు:

7. కాళ్లలో వాపులు:

బ్లాడర్ క్యాన్సర్ కు మరో సంకేతం : కాళ్లలో వాపులు , బ్యాక్ పెయిన్ ఉన్నట్లైతే కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది, ఇది శరీరంలో వాటర్ రిటెన్షన్ కు కారణమవుతుంది.

English summary

7 Surprising Signs Of Bladder Cancer That You Must Not Ignore!

Bladder cancer affects the inner lining of the bladder initially and then spreads on to the surrounding areas. Bladder cancer, if detected in the early stages, can be cured.Some of the most prominent symptoms of bladder cancer include frequent urination, pain during urination, etc. Many a times, certain signs of bladder cancer are mistaken to be symptoms of minor ailments and so the person never gets tested for the same, resulting in fatal consequences.
Story first published:Thursday, September 1, 2016, 12:53 [IST]
Desktop Bottom Promotion