For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేరెంట్స్ ద్వారా మీకు వచ్చే ఊహించని వ్యాధులు..!

శారీరక, వ్యక్తిత్వాలకు సంబంధించిన చాలా విషయాలను మనం మన తల్లిదండ్రుల నుంచి పొందుతాం. దీనికి కారణం వాళ్ల ద్వారా పొందిన డీఎన్ఏ వల్ల ఇలాంటివి జరుగుతాయి. అదేవిధంగా కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తాయి

By Swathi
|

మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు.. మీ తల్లి ముక్కు లేదా మీ నాళ్ల కళ్లు మీరు పొందారని తరచుగా ఫీలవుతూ ఉంటారా ? మీకు తెలుసా.. కేవలం లుక్స్ మాత్రమే కాదు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కొన్ని వ్యాధులను కూడా పొందుతారు ? అవును మొక్క బావుంటేనే విత్తనం బావుంటుంది అన్నట్టు.. తల్లిదండ్రులు హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం.

7 Unexpected Diseases You Can Inherit From Your Parents

శారీరక, వ్యక్తిత్వాలకు సంబంధించిన చాలా విషయాలను మనం మన తల్లిదండ్రుల నుంచి పొందుతాం. దీనికి కారణం వాళ్ల ద్వారా పొందిన డీఎన్ఏ వల్ల.. ఇలాంటివి జరుగుతాయి. అదేవిధంగా కొన్ని వ్యాధులు, అనారోగ్య సమస్యలు కూడా వారసత్వంగా వస్తాయి.

అంతేకాదు తల్లిదండ్రులే కాకుండా..వాళ్ల క్లోజ్ రిలేటివ్స్ ద్వారా కూడా.. కొన్ని వ్యాధులను వారసత్వంగా పొందే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ చాలా ముఖ్యం. తల్లిదండ్రుల ద్వారా ఊహించని విధంగా వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు చూద్దాం..

హై కొలెస్ట్రాల్

హై కొలెస్ట్రాల్

అన్ హెల్తీ లైఫ్ స్టైల్ కారణంగా.. హై కొలెస్ట్రాల్ సమస్య ఎదురవుతుంది. అయితే కొంతమంది విషయంలో.. జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా.. ఈ సమస్య ఎదురవుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వారసత్వంగా వచ్చే రిస్క్ ఉంటుంది. పేరెంట్స్ ద్వారా రావచ్చు లేదా డీఎన్ఏలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు.

బట్టతల

బట్టతల

జుట్టు సంబంధిత సమస్యలు మధ్య వయస్కులు, మగవాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. తల్లుల ద్వారా కూడా.. ఈ సమస్యను పొందే అవకాశాలుంటాయి. అయితే వాతావరణ సమస్యలు ఈ రోజుల్లో మగవాళ్ల బట్టతలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

డయాబెటిస్

డయాబెటిస్

వారసత్వంగా వచ్చే వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలామందిలో డయాబెటిస్ కి.. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.

లాక్టోజ్ ఇన్ టోలరెన్స్

లాక్టోజ్ ఇన్ టోలరెన్స్

లాక్టోజ్ ఇన్ టోలరెన్స్ అనేది కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. జీర్ణమవడానికి లాక్టోజ్ అనేది చాలా అవసరం. ఈ వ్యాధి కూడా.. తల్లిదండ్రుల నుంచి రావచ్చు.

డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ కూడా హెరిడిటీ వల్ల వస్తుందని.. అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సెరోటొనిన్, డొపామైన్ ఉత్పత్తి తగ్గినప్పుడు.. ఈ సమస్య వస్తుంది. దీనికి కొన్నిరకాల జీన్స్ లదే బాధ్యత.

ఆల్కహాలిజం

ఆల్కహాలిజం

ఆల్కహాలిజం కూడా హెరిడిటీ సమస్య కావచ్చు. అలాగే కొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఆల్కహాల్ కి అడిక్ట్ అవడానికి కొన్ని రకాల జెనెటిక్స్ ది బాధ్యత.

English summary

7 Unexpected Diseases You Can Inherit From Your Parents

7 Unexpected Diseases You Can Inherit From Your Parents. Listed here are some diseases you never thought you could get from your parents, have a look!
Story first published: Tuesday, November 29, 2016, 16:09 [IST]
Desktop Bottom Promotion